Krishna mukunda murari serial april 20th: కృష్ణకి ఈ జన్మలో పిల్లలు పుట్టరు, షాక్ లో మురారి.. ముకుంద పైశాచికానందం-krishna mukunda murari serial april 20th episode krishna suffers stomach ache doctor revelas shocking truth to murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial April 20th: కృష్ణకి ఈ జన్మలో పిల్లలు పుట్టరు, షాక్ లో మురారి.. ముకుంద పైశాచికానందం

Krishna mukunda murari serial april 20th: కృష్ణకి ఈ జన్మలో పిల్లలు పుట్టరు, షాక్ లో మురారి.. ముకుంద పైశాచికానందం

Gunti Soundarya HT Telugu
Apr 20, 2024 08:09 AM IST

Krishna mukunda murari serial april 20th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ముకుంద వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కృష్ణకి ఇక ఈ జన్మలో పిల్లలు పుట్టే యోగం లేదని డాక్టర్ చెప్పడంతో మురారి గుండె ముక్కలైపోతుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial april 20th episode: ముకుంద ట్యాబ్లెట్ కలిపిన పానకం కృష్ణ తాగేస్తుంది. తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని ముకుంద తెగ సంతోషపడుతుంది. రేవతి దగ్గరకు ఆదర్శ్ వచ్చి తన మనసులో ఉన్న విషయం బయట పెడతాడు.

ముకుందని పెళ్లి చేసుకుంటాను

అమ్మతో చెప్పాలని అనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదని అంటాడు. అక్కతో నీ మనసులో మాట చెప్తే చాలా సంతోషిస్తుందని రేవతి అంటుంది. నేను చెప్పిన విషయం తన అమ్మ దగ్గర చెప్పమని అంటాడు. నేను ముకుందని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నానని చెప్తాడు. అదే మీరాని ఈ విషయం నువ్వే ఎలాగైనా అమ్మకి చెప్పు అంటాడు.

అంతే కదా నేను చెప్తానులే వెళ్ళు అంటుంది. ఇంత సింపుల్ గా ఒప్పుకున్నావ్ ఏంటి ఆశ్చర్యపోతాడు. మీరాని పెళ్లి చేసుకుంటానని అనగానే అనాథ పిల్లని పెళ్లి చేసుకుంటానని అనడం ఏంటని అంటావ్ అనుకుంటే ఇలా ఒప్పుకున్నావ్ ఏంటని అంటాడు.

అనాథ పిల్ల అయితే నీ మనసుకి నచ్చితే చాలు. మీరా కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూస్తేనే అర్థం అయ్యింది నువ్వు తనని ఇష్టపడుతున్నట్టు అని రేవతి అంటుంది. ఎందుకో తెలియదు మీరా పక్కన ఉంటే ముకుంద పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ విషయం అమ్మకి చెప్పి ఒప్పించమని అడుగుతాడు.

ఆలోచిద్దామన్న భవానీ

అమ్మాయికి తెలుసా అని రేవతి అంటే తను బయట పడటం లేదు నాకు చెప్పే ధైర్యం రావడం లేదు. అందుకే అమ్మకి చెప్పు అమ్మ అడిగితే తను మాట కాదనదు అంటాడు. ప్లీజ్ పిన్ని ఎలాగైనా ఒప్పించమని రేవతిని బతిమలాడతాడు. సరేనని భవానీతో విషయం మాట్లాడేందుకు వెళ్తుంది.

ఆదర్శ్ నీతో చెప్పలేక నన్ను చెప్పమన్నాడు. తను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. చేస్తే బాగుంటుందని రేవతి అంటుంది. ఇప్పుడే చెప్పావ్ కదా ఆలోచిద్దామని భవానీ అంటుంది. ఇప్పటికే వాడి జీవితంలో చాలా జరిగాయి ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని భవానీ చెప్తుంది.

ముకుంద అంటే ఇష్టమని పెళ్లి చేసుకున్నాడు కానీ తను ఇష్టపడలేదు. మరి ఈ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకున్నారా అని అడుగుతుంది. వాడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు మీరు తనతో మాట్లాడి ఒప్పించమని చెప్తుంది.

మీరా మంచిదే

ఎవరు లేని అనాథ పిల్ల ఇంతకంటే గొప్ప జీవితం ఎక్కడ దొరుకుతుంది. అడగమని రేవతి చెప్తుంది. ఆశ్రయం ఇచ్చామని చెప్పి జీవితం అడగటం కరెక్ట్ కాదు. పైగా రజిని తన కూతురిని కోడలిని చేయమని అడుగుతుంది. సంగీత కూడా ఆదర్శ్ మీద ఆశలు పెట్టుకుందని అంటుంది.

ఆదర్శ్ మీరాని ఇష్టపడుతున్నాడు కదా అంటే ఇష్టపడేవి అన్నీ ఇవ్వలేం కదా. ముకుందని చేసుకుంటే ఏమైందో చూశాం కదా దీని గురించి ఆలోచిద్దాములే అని భవానీ అంటుంది. మురారి విషయంలో చాలా హెల్ప్ చేసింది, మన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసింది కానీ కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోలేమని భవానీ చక్కగా చెప్తుంది.

పాపం కృష్ణ

కృష్ణ పిల్లల గురించి ఆలోచిస్తూ మురిసిపోతుంది. తన కడుపు ఎప్పుడు పండుతుందో ఎప్పుడు పెద్దత్తయ్య కోరిక నెరవేరుస్తానోనని ఆత్రంగా ఉందని అంటుంది. అప్పుడే కృష్ణ సడెన్ గా పొత్తి కడుపులో చాలా నొప్పిగా ఉందని తట్టుకోలేకపోతున్నానని అల్లాడిపోతుంది.

కృష్ణ పరిస్థితి చూసి ముకుంద చాలా సంతోషిస్తుంది. నొప్పితో బాధపడుతున్న కృష్ణని చూసి భవానీ కంగారుపడుతుంది. నీ కలలు ఆవిరి అయిపోయి నా కలలు నెరవేరబోతున్నాయని ముకుంద మనసులో సంతోషపడుతుంది. భరించలేకపోతున్నాను పెద్దత్తయ్య చచ్చిపోతానని భయంగా ఉందని కృష్ణ అనేసరికి అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటారు.

చచ్చిపోతానేమో పెద్దత్తయ్య

నోర్ముయ్ ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకొనని అంటుంది. నాకేమవుతుందోనని భయం కాదు పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట తీర్చకుండానే పోతానని భయంగా ఉందని అంటుంది. పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా పానకం, వడపప్పు తిన్నావ్ కదా దాని వల్ల ఏమైనా అని భవానీ అంటుంది.

ముకుంద కంగారుగా దాని వల్ల ఏం కాదులే అని సర్ది చెప్తుంది. నా కోరిక ఇలా క్షణాల్లో తీరుస్తావని అనుకోలేదు ఇప్పుడు నేను వేసే ప్రతి అడుగు మురారి వైపు అనుకుంటుంది. కృష్ణని హాస్పిటల్ కి తీసుకొస్తారు. మురారితో పాటు బాధపడుతున్నట్టు ముకుంద తెగ నటించేస్తుంది.

పరిమళ కృష్ణని చెక్ చేస్తుంది. ఇదేదో తినడం వల్ల, ఫుడ్ పాయిజన్ వల్ల వస్తున్న నొప్పి కాదు త్వరగా స్కాన్ చేయించమని కృష్ణ చెప్తుంది. పరిమళ మురారికి ధైర్యం చెప్తుంది.

తరువాయి భాగంలో..

పరిమళ కృష్ణని చెక్ చేస్తుంది. ఏమైందని మురారి కంగారుగా అడుగుతాడు. కృష్ణకి గర్భసంచి తీసేయాలని చెప్పేసరికి పరిమళ చెప్పేసరికి మురారి షాక్ అవుతాడు. ఈ జన్మకి ఇక కృష్ణకి పిల్లలు పుట్టే యోగం లేదని పరిమళ చెప్తుంది. ఆ మాటలు విని ముకుంద చాలా సంతోషిస్తుంది.

Whats_app_banner