Krishna mukunda murari may 2nd:మీరాని అనుమానించిన మురారి.. భవానీ ఆనందాన్ని చెడగొట్టిన ముకుంద-krishna mukunda murari serial today may 2nd episode murari krishn discuss about surrogate mother ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari May 2nd:మీరాని అనుమానించిన మురారి.. భవానీ ఆనందాన్ని చెడగొట్టిన ముకుంద

Krishna mukunda murari may 2nd:మీరాని అనుమానించిన మురారి.. భవానీ ఆనందాన్ని చెడగొట్టిన ముకుంద

Gunti Soundarya HT Telugu
May 02, 2024 08:15 AM IST

Krishna mukunda murari serial may 2nd episode: భవానీ ఇంటికి సరోగసి మథర్ కావాలని చెప్పారంటూ ఒక అమ్మాయి రావడం వెనుక మీరా ఉందేమోనని మురారి అనుమానిస్తాడు. ఇదే విషయం గురించి తనని నిలదీస్తాడు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 2వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 2వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial may 2nd episode: భవానీ కృష్ణని అందంగా రెడీ చేసి సీమంతం చేస్తుంది. నిజంగా నెలతప్పినట్టు ఏం నాటకాలు ఆడుతున్నారు, ఇప్పుడు నేను నిజం బయట పెడితే ఏమైపోతావో అని ముకుంద మనసులో అనుకుంటుంది.

సంగీత డాన్స్

అందరూ అక్షింతలు వేసి కృష్ణని ఆశీర్వదిస్తారు. ముకుంద కృష్ణకి కంగ్రాట్స్ చెప్తుంది. మీ పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావన్న మాట అంటూ మురారికి కూడా కంగ్రాట్స్ చెప్తుంది. మీరు ఏ పరిస్థితిలో మౌనంగా ఉన్నారో అర్థం అవుతుంది అందుకే మీతో పాటు నేను కూడా ఏం తెలియనట్టు నటించాల్సి వస్తుందని మురారితో చెప్తుంది.

మీరు సంతోషంగా ఉందంటే దానికి కారణం కృష్ణ అని ముకుంద తెగ మెచ్చుకుంటుంది. కృష్ణ అక్క చాలా అందంగా ఉంది తన దిష్టి పోవాలంటే తాను పాట పాడి డాన్స్ వేస్తానని సంగీత చెప్తుంది. ఇది అబద్ధం అయిన వీళ్ళు ఇంత సంతోషంగా ఉండేందుకు వీల్లేదు బ్రేక్ వేయాలని ముకుంద అనుకుంటుంది.

నీ కోడలే రమ్మంది

అందరూ సంతోషంగా డాన్స్ లు వేస్తూ ఎగురుతూ ఉంటారు. ముకుంద వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. కాసేపటిలో ఈ సంతోషాన్ని ఆవిరి చేయబోతున్నానని ముకుంద అనుకుంటుంది. అప్పుడే ఒకావిడ వచ్చి ఇక్కడ సరోగసి మథర్ కావాలని చెప్పారు మాట్లాడటానికి వచ్చామని అంటుంది.

కృష్ణ, మురారి షాక్ అవుతారు. సరోగసి ఏంటి ఏం మాట్లాడుతున్నావని భవానీ కంగారుగా అడుగుతుంది. ఏదైనా కారణం వల్ల పిల్లలని కనలేకపోతే వేరే గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు కదా అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇక్కడ ఎవరు రమ్మంటే వచ్చావని భవానీ అంటే నీ కోడలే రమ్మంది ఏమోనని తన స్నేహితురాలు సరస్వతి అంటుంది.

నీ కోడలికి పిల్లలు పుట్టరేమో

నీ కోడలికి పిల్లలు పుట్టడం లేదని సరోగసి ద్వారా పిల్లలు పుట్టించాలని చూస్తున్నావా ఏంటని సరస్వతి భవానీని అవమానిస్తుంది. అంత అవసరం మాకేముంది మా కోడలు నెల తప్పిందని భవానీ అంటుంది. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారని రేవతి ఆ అమ్మాయిని నిలదీస్తుంది.

కృష్ణ నువ్వే రప్పించావా సరోగసి చేయించుకుని నిజంగా నెలతప్పినట్టు మీ అత్తని మాయ చేయడం లేదు కదా అని సరస్వతి అవమానిస్తుంది. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే సరోగసి అని ఎవరు చెప్పారని ముకుంద ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి అడ్రస్ పేపర్ చూస్తుంది.

ముకుంద ప్లాన్ సక్సెస్

ఈ అమ్మాయి రాంగ్ అడ్రస్ కి వచ్చిందని కవర్ చేస్తుంది. కృష్ణ హమ్మయ్య అనుకుంటూ ఒక్కసారిగా కూలబడిపోతుంది. ఆ అమ్మాయిని వెళ్లిపొమ్మని సైగ చేస్తుంది. తన కోడలు నిజంగానే నెల తప్పిందని భవానీ అంటుంది. మురారి, కృష్ణ వాళ్ళు సరోగసి మథర్ గురించి మాట్లాడుకుంటారు.

సరోగసి మథర్ ఎవరు అనే విషయం ఎవరూ చెప్పరు కానీ ఈవిడ ఎలా వచ్చింది. నాకు ఎందుకో ఎవరో కావాలని ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. మన గురించి నిజం తెలుసుకుని మనతోనే నిజం చెప్పించాలని మనకు మనశ్శాంతి లేకుండా చేయాలని ఇలా చేసి ఉండవచ్చని కృష్ణ అనుమానిస్తుంది.

ఎవరో కావాలని చేశారు

మురారి మీరా సరోగసి గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మనం సరోగసి గురించి మాట్లాడుకుంది డాక్టర్ వైదేహికి తప్ప ఎవరికీ తెలియదు. మన ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు ఎవరో మన గురించి తెలుసుకుని ఇలా చేసి ఉంటారని కృష్ణ డౌట్ పడుతుంది.

మురారికి మాత్రం మీరా మీద అనుమానం వస్తుంది. భవానీ కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి వచ్చి దాని గురించి ఆలోచించొద్దని అంటుంది. సరోగసి అంటూ అద్దె గర్భం గురించి మాట్లాడుతుంటేనే ఏదోలా అనిపించదని భవానీ రేవతితో అంటుంది. కృష్ణ వాళ్ళ మాటలు విని ఏడుస్తుంది.

ఇంత అబద్దం ఆడినా అత్తయ్య సంతోషంగా లేకుండా పోయారని అనుకుంటుంది. భవానీ మనసు డైవర్ట్ చేయాలని కృష్ణ మాట్లాడుతుంది. సరోగసి అంటే చాలా సీక్రెట్ గా ఉంచుతారు. ఇటు అసలు తల్లిదండ్రులకు, అటు బిడ్డని మోసే ఆమెకు ఎటువంటి విషయాలు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

మీరు సరోగసి చేయించుకుంటున్నారా?

అలాంటిది పబ్లిక్ గా సరోగసి కావాలని అడిగారని చెప్పింది. మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి అడ్రస్ వేరు అని చెప్పి పంపించేశామని అంటుంది. నిజంగానే మీకు పిల్లలు పుట్టరేమో సరోగసి చేయించుకుంటున్నారని గుండెల్లో రాయి పడినట్టు అయ్యిందని భవానీ అంటుంది.

కృష్ణ అలా ఎందుకు చేస్తుంది ఏదైనా ఉంటే మనకి చెప్తుంది కదాని రేవతి సర్ది చెప్తుంది. వారసులు కావాలని ఆరాటపడుతున్నా కదా నా బాధ చూడలేక ఏదైనా సమస్య వల్ల బిడ్డలు పుట్టే అవకాశం లేక ఇలా మరోదారి ఎంచుకున్నారేమోనని ఆలోచించాను.

పేగు బంధం ఉంటేనే

తొమ్మిది నెలలు మోసి పేగు తెంచుకున్న బిడ్డ మనది అవుతుంది కదా అంటే అలా ఏమి లేదు అత్తయ్య తొమ్మిది నెలలు మోయకపోయినా పిండం మనదే కాబట్టి బిడ్డ మీద హక్కు మనకే ఉంటుందని కృష్ణ చెప్తుంది. కానీ పేగు బంధం అనేది ఒకటి ఉంటుంది కదా అది తెంచుకుని పుడితేనే మనది అనే ఫీలింగ్ అవుతుంది.

అలా తెచ్చుకుంటే ఎవరో ఇంటి నుంచి బిడ్డని తెచ్చుకున్న ఫీలింగ్ ఉంటుంది కానీ మన అనే అనుబంధం ఉండదని భవానీ చెప్తుంది. నువ్వు తొమ్మిది నెలలు మోసి ఎప్పుడు బిడ్డని చేతులో పెడతావా అని ఆశగా ఎదురుచూస్తున్నామని రేవతి అంటుంది. భవానీ కృష్ణకి చాలా జాగ్రత్తలు చెప్తుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

కృష్ణ ఇంటికి వచ్చిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మురారి మీరాని పిలిచి మాట్లాడతాడు. అసలు ఈ విషయం నీకు నాకు కృష్ణకి తప్ప ఎవరికీ తెలియదు. నువ్వే చెప్పావ్ కదాని మురారి మూకునదని నిలదీస్తాడు.

Whats_app_banner