NNS May 30th Episode: రామ్మూర్తికి కనపడిన అరుంధతి ఆత్మ.. మిస్సమ్మను చంపేస్తానని మనోహరి వార్నింగ్.. ఆరుకు మళ్లీ శక్తులు
Nindu Noorella Saavasam May 30th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 30వ తేది ఎపిసోడ్‌లో రామ్మూర్తికి కనపడిన అరుంధతి ఆత్మ మిస్సమ్మను కాపాడమంటూ చెబుతుంది. తర్వాత అరుంధతికి మనోహరి నీలాగే భాగీని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 30th May Episode) మిస్సమ్మను చంపేందుకు మనోహరి డ్రైవర్‌కి సుపారి ఇవ్వడం చూసి కంగారుతో ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది అరుంధతి. కూతురు ఎలా ఉందోననే బెంగతో మంగళ ఫోన్ తీసుకుని భాగీకి వీడియో కాల్ చేస్తాడు రామ్మూర్తి.
ఏదో కనపడిందని
ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అరుంధతి వచ్చి అమర్‌తో ఎలాగైనా మనోహరి బారినుంచి మిస్సమ్మను కాపాడండి అని చెబుతుంది. అరుంధతి ఆత్మను ఫోన్లో చూసిన రామ్మూర్తి నీ పక్కన ఏదో ఉందమ్మా అంటాడు. ఏముంది నాన్నా.. ఇక్కడ నేను, ఆయన తప్ప ఎవరూ లేరే? అంటుంది భాగీ. ఆ మాట విని తలుపు వెనకాల దాక్కుంటుంది అరుంధతి. ఫోన్లో ఏదో కనపడిందని రామ్మూర్తి అనడంతో అది అరుంధతి ఆత్మనే అయింటుందని వెంటనే మనోహరికి ఫోన్ చేసి చెబుతుంది మంగళ.
షాకైన అరుంధతి
బయటకు వెళ్లేందుకు వచ్చిన అమర్ సడెన్‌గా ఆగిపోవడం చూసి ఆశ్చర్యపడుతుంది మనోహరి. అమర్ చుట్టూ అరుంధతి తిరుగుతూ నేను చెప్పేది కొంచెం వినండి.. ఎలాగైనా మిస్సమ్మను కాపాడండి అంటుంది. అంటే తనకు అరుంధతి వైబ్రేషన్స్ తెలిసినట్లే అమర్‌కి కూడా తెలుస్తున్నాయేమో అనుకుంటుంది మనోహరి. అమర్ బయటకు వెళ్లగానే ఎలా ఉన్నావు అరుంధతి అంటుంది. తనని పలకరించిన మనోహరిని చూసి షాకవుతుంది అరుంధతి.
భాగీ నీడ కూడా తాకనివ్వను
నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు.. నిన్ను చంపినట్లే ఆ భాగమతిని కూడా చంపుతాను. నాకు, అమర్‌కి మధ్యలో ఎవరు వచ్చినా వాళ్లకి చావే గతి. నా స్థానాన్ని లాక్కుని నువ్వు తప్పు చేశావు, చంపేశాను. ఇప్పుడు అదే తప్పు ఆ భాగమతి చేసింది, దాన్ని కూడా చంపేస్తాను అంటుంది మనోహరి. నువ్వు చేస్తుంది పాపం, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను భాగీ నీడ కూడా తాకనివ్వను అంటుంది అరుంధతి. నువ్వు కేవలం గాలివి మాత్రమే.. నువ్వు నన్నేం చేయలేవు అంటూ లోపలకు వెళ్తుంది మనోహరి.
పిశాచి పీడ పోవాలని
తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన శివరామ్ ప్రసాదం భాగీకి ఇచ్చి దేవుడి దగ్గర పెట్టి అందరికీ పంచమని చెబుతాడు. ఏయే పుణ్యక్షేత్రాలు దర్శించి ఏం పూజలు చేయించారు అని అడుగుతుంది నిర్మల. మనింట్లో ఓ పిశాచి తిష్ట వేసుకుని ఉంది కదా అత్తయ్య. ఆ పిశాచి పీడ మనకి ఒదిలిపోవాలని పూజ చేయించి ఉంటారు అంటుంది భాగీ. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ నువ్వు అని కోపంగా అరుస్తుంది మనోహరి.
పెళ్లి గుర్తు చేయకండి
బ్యాడ్ టైమ్ గురించి మనోహరి.. ఏ నువ్వు ఇంకేమైనా అనుకున్నావా అంటుంది భాగీ. ప్రసాదం ఇచ్చి పిల్లలకి పెట్టమంటాడు శివరామ్. రేపు పౌర్ణమి కదా మిస్సమ్మ చేత ఆ శివుడికి రుద్రాభిషేకం చేయిద్దాం అంటుంది నిర్మల. మీ పెళ్లి పౌర్ణమిరోజునే జరిగింది ఇప్పుడు పూజ కూడా పౌర్ణమి రోజునే జరుగుతుంది అంటాడు శివరామ్. ఆ పెళ్లి గురించి గుర్తు చేయకండి మామయ్య.. అసలు ఆ పౌర్ణమిరోజున ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడంలేదంటే అప్పుడే మరో పౌర్ణమి వచ్చేసిందా అంటుంది భాగీ.
మిస్సమ్మను కాపాడుకునేందుకు
పౌర్ణమి అంటే తనకి మళ్లీ శక్తులు వస్తాయా? సమయానికి గుప్త కూడా ఇక్కడ లేరు అంటే.. మిస్సమ్మను కాపాడుకోవడానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకావశం అనుకుంటా అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. మరోవైపు మనోహరి కూడా ఘోరా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ పౌర్ణమి వేళ మళ్లీ ఏం జరుగుతుందోనని భయపడుతుంది.
టాపిక్