NNS June 21st Episode: హాస్పిటల్‌లో భాగీ, ఆందోళనలో అమర్​.. ఆధారాలతో నీలకి తెలిసిపోయిన మనోహరి పెళ్లి గతం​​​​​!-nindu noorella savasam serial june 21st episode amar worried about bhagamathi nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns June 21st Episode: హాస్పిటల్‌లో భాగీ, ఆందోళనలో అమర్​.. ఆధారాలతో నీలకి తెలిసిపోయిన మనోహరి పెళ్లి గతం​​​​​!

NNS June 21st Episode: హాస్పిటల్‌లో భాగీ, ఆందోళనలో అమర్​.. ఆధారాలతో నీలకి తెలిసిపోయిన మనోహరి పెళ్లి గతం​​​​​!

Sanjiv Kumar HT Telugu
Jun 21, 2024 06:32 AM IST

Nindu Noorella Saavasam June 21st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 21వ తేది ఎపిసోడ్‌‌లో హాస్పిటల్‌లో మిస్మమ్మకు ట్రీట్‌మెంట్ జరుగుతుంది. మిస్సమ్మను చూసి అమర్ ఆందోళన పడుతాడు. మనోహరి పెళ్లి గతాన్ని ఆధారాలతో సహా నీల తెలుసుకుంటుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 21వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 21వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 21st June Episode) హాస్పిటల్‌లో ఉన్న భాగీ గురించి ఆదోళన పడుతుంటాడు అమర్​. మరోవైపు అనవసరంగా తను వేసిన ప్లాన్​ బెడిసికొట్టి మొదటికే మోసం వచ్చిందని కంగారు పడుతుంది మనోహరి.

కోపంగా మనోహరి

అమర్​ ఏంటి.. కూతురుని కాపాడిందని దానిపై జాలిపడుతున్నాడు. అదికాస్తా ప్రేమగా మారిపోతుందా ఏంటి? అనుకుంటుంది. కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్న మనోహరిని చూసి నెమ్మదిగా మేడమ్ ​గారూ.. మళ్లీ మీరు కాలునొప్పి అంటూ ఇంకో బెడ్​మీద ట్రీట్​మెంట్​ తీసుకోవాల్సి వస్తుంది. కడుపు మండుతున్నట్లుంది.. అంటాడు రాథోడ్​. కోపంగా చూస్తుంది మనోహరి. అంతలో నర్స్​ రావడంతో మిస్సమ్మకి ఎలా ఉంది? ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? అని అడుగుతాడు అమర్​.

అది చూసి అరుంధతి కుళ్లుకుంటుంది. చూశావా అతగాడి ప్రేమ అని గుప్త ఆటపట్టిస్తాడు. అలాంటిదేం లేదు.. అమ్ముని కాపాడబోయి మిస్సమ్మ ప్రాణాలమీదకి తెచ్చుకుందని జాలి అంతే అని బుకాయిస్తుంది అరుంధతి. డాక్టర్​ బయటకి రావడంతో మిస్సమ్మ ఎలా ఉందని అడుగుతాడు అమర్. కంగారులో ఉన్న అమర్​ని చూసి ఏంటండి మీరు.. అందరూ ఇలా ప్రశ్నలతో చంపేస్తే మేం ట్రీట్​మెంట్​ ఎలా చేయాలి అంటాడు.

భర్యను పడనిస్తాడా

ఇంతకీ లోపల ఉన్నామె ఈయనకి ఏమవుతుందని అడగడంతో తాళి కట్టిన భార్య అని చెబుతాడు శివరామ్​. మీ ప్రేమ ఇంట్లో చూపించుకోండి. కానీ, ఇలా నర్సులను, నన్ను భయపెట్టడం కాదు. మీది ప్రేమలా లేదు పిచ్చిలా ఉంది. ఇంత ప్రేమించేవాడివి ఆమె కిందపడుతుంటే ఏం చేశావు? అంటాడు డాక్టర్. అప్పుడు మా అబ్బాయి పక్కనలేడు. లేకపోతే తన భార్యను పడనిస్తాడా ఏంటి అంటుంది నిర్మల. ఇంతలో మిస్సమ్మ కాసేపట్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్​ అనడంతో తోసుకుంటూ లోపలకు వెళ్తాడు అమర్.

అది చూసి చూశావా నీ పతిదేవుడి ప్రేమ అని అరుంధతిని ఆటపట్టిస్తాడు గుప్త. మిస్సమ్మ బెడ్​పై దెబ్బలతో పడి ఉండటం చూసి బాధపడతాడు అమర్​. అప్పుడే మెలకువ వచ్చిన భాగీ అమర్​ని చూసి అమ్ము ఎలా ఉంది? ఎక్కడ ఉంది? అని అడుగుతుంది. పక్క వార్డులో ఉందని చెప్పడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్ముని చూస్తుంది భాగమతి.

చావు తెచ్చే కష్టం

అమ్ముకి ఏం కాలేదని తెలుసుకుని సంతోషపడుతున్న మిస్సమ్మను చూసి అమ్ముని కాపాడటం కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావేంటమ్మా.. నీకేమైనా అయితే మీ నాన్నగారికి మేమేం సమాధానం చెప్పేవాళ్లం అంటాడు శివరామ్. చావుబతుకుల మధ్య ఉన్న అమ్ముని చూసి నా ప్రాణం గురించి ఆలోచించలేదు మామయ్య. ఒక చావు కుటుంబానికి తెచ్చే కష్టం, బాధ దగ్గరుండి చూసినదాన్ని, మళ్లీ ఆ బాధ నా కుటుంబానికి రానివ్వను అంటుంది మిస్సమ్మ.

కానీ, నువ్వు ఆ కుటుంబంలో భాగమే. నీకేమైనా అయినా ఆ కుటుంబం బాధపడుతుందని ఎలా మర్చిపోయావు మిస్సమ్మ అంటాడు శివరామ్​. మరోసారి అలాంటి పొరపాటు చేయను మామయ్య అంటుంది మిస్సమ్మ. డాక్టర్​ వచ్చి పేషెంట్​ దగ్గర అంతమంది ఉండటం ఏంటని కోప్పడి అమ్ముని ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెబుతాడు. మిస్సమ్మ మాత్రం సాయంత్రం వరకి హాస్పిటల్లోనే ఉండాలి అంటాడు.

మనోహరికి ఇదివరకే పెళ్లి

మిస్సమ్మ దగ్గర అమర్​ని ఉండమని చెప్పి అమ్ముని తీసుకుని ఇంటికి వెళ్తాడు శివరామ్​. చేసేదేం లేక మిస్సమ్మతో హాస్పిటల్‌లో ఉండిపోతాడు అమర్​. ఇల్లు ఊడుస్తున్న నీలకి మనోహరి కబోర్డ్​లో ఉన్న నగల పెట్టె కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూసిన నీల అందులో తాళి, పెళ్లిఫొటో ఉండటం చూసి షాకవుతుంది. అంటే మనోహరికి ఇదివరకే పెళ్లయిందని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది.

అప్పుడే హాస్పిటల్​ నుంచి మనోహరి, పిల్లలు రావడంతో హడావిడిగా మరో రాక్​లో ఆ నగల పెట్టెని పెడుతుంది. నీలకి తన పెళ్లి రహస్యం తెలిసిందని మనోహరి తెలుసుకుంటుందా? అమర్​, భాగీల మధ్య ప్రేమ మొదలవనుందా? అనే విషయాలు తెలియాలంటే జూన్​ 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel