NNS June 14th Episode: ఫొటోలో కనిపించని అరుంధతి- మిస్సమ్మకు డౌట్- మ్యాజిక్ చేసిన గుప్తా- అమ్ము కిడ్నాప్‌కు మనోహరి ప్లాన్
Nindu Noorella Saavasam June 14th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 14వ తేది ఎపిసోడ్‌లో అరుంధతిని ఫోన్‌లో ఫొటో తీస్తుంది మిస్సమ్మ. కానీ, అరుంధతి అందులో కనిపించకపోవడంతో భాగీకి డౌట్ వస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 14th June Episode) అంజు గీసిన బొమ్మలో కాలిపోకుండా ఉన్న అరుంధతి కళ్లను కత్తిరించి దేవుడి గదిలో ఉంచుతాడు అమర్. ఆ కళ్లను చూసిన భాగీ వాటిని ఎక్కడో చూసినట్లుందని ఆలోచిస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన రాథోడ్ ఆ కళ్లను చూసి మా అమ్మగారి కళ్లు కదా.. ఈ బొమ్మ కోసమే కదా నిన్న ఇంట్లో అంతపెద్ద రచ్చ జరిగింది అంటాడు.
ఫొటో చూడకపోవడం ఏంటీ
అది కాదు రాథోడ్ నేను ఈ కళ్లని ఎక్కడో చూశాను అంటుంది మిస్సమ్మ. మా అమ్మగారి ఫొటోలో చూసుంటావు అంటాడు రాథోడ్. లేదు రాథోడ్.. నేను ఇప్పటివరకు ఆమె ఫొటోని కూడా చూడలేదు అంటుంది మిస్సమ్మ. అదేంటి.. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. మా అమ్మగారి ఫొటో కూడా ఈ ఇంట్లోనే ఉంది.. మరి ఇప్పటివరకు ఆ ఫొటో చూడకపోవడం ఏంటి అంటాడు రాథోడ్. అదే నాకు అర్థం కావడం లేదు రాథోడ్.. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె ఫొటో మాత్రం చూడలేకపోయా అంటుంది మిస్సమ్మ.
మరి ఎక్కడ చూసుంటావు మిస్సమ్మ.. ఫొటో చూడలేదు.. మా అమ్మగారి కోసం కొడైకెనాల్ వచ్చినప్పుడూ కలవలేదు అంటాడు రాథోడ్. అదేంటి.. నేను మా అక్కని కలవడానికి కొడైకెనాల్ వెళ్తే ఈ ఇంటి కోడల్ని కలవడానికి వచ్చానంటావేంటి అంటుంది మిస్సమ్మ. అదే మిస్సమ్మ.. నువ్వు కొడైకెనాళ్లో మా సార్‌ని కలిసినప్పుడు మేడమ్ పక్కనలేరు కదా.. చూసే ఛాన్స్ ఉండదు అన్నాను అంటూ అమర్ పిలుస్తున్నాడని అబద్ధం చెప్పి అక్కడ నుంచి తప్పించుకుంటాడు రాథోడ్.
కంగారుగా అరుంధతి
ఆ ఫొటో పట్టుకుని ఆలోచిస్తూ గార్డెన్‌లోకి వెళ్తుంది మిస్సమ్మ. గుప్తతో లోపల జరిగిందంతా చెప్పి కంగారు పడుతుంది అరుంధతి. నేను చెప్పినది విని మా లోకానికి వెళ్తే ఈ అగచాట్లు ఉండేవి కాదు కదా అంటాడు గుప్త. ఏది మాట్లాడినా అక్కడికే వస్తారేంటి.. ఏదో ఒకటి చేసి మిస్సమ్మ నుంచి కాపాడండి అని అరుంధతి అంటుండగానే మిస్సమ్మ అక్కడకు వస్తుంది. పూలు కోసుకుంటున్నట్లు నటిస్తూ ఏమైంది మిస్సమ్మ అంటుంది అరుంధతి.
ఏం లేదక్కా.. ఆ చెట్టు కింద కాసేపు కూర్చుంటా అంటుంది మిస్సమ్మ. సరే మిస్సమ్మ.. కూర్చొని రిలాక్స్ అవ్వు అంటున్న అరుంధతి కళ్లు చూసి ఫొటోలోని కళ్లతో పోలుస్తుంది. ఆ కళ్లను చూసి అరుంధతి కూడా తన కళ్లే అని అనడంతో మిస్సమ్మకు అనుమానం వస్తుంది. మిస్సమ్మ పరుగున వెళ్లి ఫోన్ తెచ్చి అరుంధతిని ఫొటో తీస్తుంది. కానీ, ఆ ఫొటోలో అరుంధతి కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. ఎలాగైనా మిస్సమ్మ నుంచి తనని కాపాడమని గుప్తని అరుంధతి కోరడంతో ప్రత్యక్షమవుతాడు.
మిస్సమ్మ కనపడకుండా
ఆశ్చర్యంగా చూస్తున్న మిస్సమ్మతో అనుకోకుండా మా ఊరు నుంచి సమాచారం అందితే ఇంటికి వెళ్లాను. పని ముగించుకుని వచ్చాను. అయ్యగారు ఇంట్లోనే ఉన్నారా? మళ్లీ పనిలో చేరుతాను అంటాడు గుప్త. కానీ, మిస్సమ్మ ఫొటో గురించి చెప్పడంతో ఆ ఫోన్ తీసుకుని భాగీని కూడా ఫొటో తీసి అందులో మిస్సమ్మ కనపడకుండా మాయం చేసి ఆ ఫోన్ పాడైనదని చెబుతాడు గుప్త. అయోమయంగా అక్కడనుంచి వెళ్లిపోతుంది మిస్సమ్మ.
పిల్లలు పుస్తకాలు కొనుక్కోడానికి వెళ్లేందుకు తయారవుతారు. అమర్ పిల్లల్ని తీసుకెళ్తుండటంతో మిస్సమ్మని కూడా వాళ్లతో పాటు తీసుకెళ్లమని అంటాడు శివరామ్. మేమేం షికారుకి వెళ్లట్లేదు నాన్న తనని కూడా వెంట తీసుకెళ్లడానికి అంటూ బయల్దేరుతున్న అమర్‌కి క్యాంప్ నుంచి ఫోన్ వస్తుంది. అర్జంట్‌గా క్యాంప్‌కి వెళ్లాలని మనోహరిని పిల్లల్ని బయటకు తీసుకెళ్లమని చెబుతాడు అమర్.
మిస్సమ్మతోనే పంపించు
సంతోషంగా ఓకే చెప్పబోయిన మనోహరి అమ్ముని కిడ్నాప్ చేసి మిస్సమ్మను బయటకు గెంటించేందుకు ఇదే సరైన టైమ్ అని మిస్సమ్మతోనే పిల్లల్ని బయటకు పంపమని అంటుంది. సరే అంటాడు అమర్. పిల్లలు కోపంగానే మిస్సమ్మతో బయటకు వెళతారు. మనోహరి మాటల్ని అనుమానించిన అరుంధతి ఏదో జరగబోతోందని గుప్తతో అంటుంది.
నువ్వు చేసిన పనికి నీ కూతురు శిక్ష అనుభవించబోతోంది అంటాడు గుప్త. అమ్ముని మనోహరి కిడ్నాప్ చేయిస్తుందా? అమర్ మిస్సమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తాడా? అనే విషయాలు తెలియాలంటే జూన్ 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!