NNS June 27th Episode: ఘోరా తలకు గన్ గురిపెట్టిన మనోహరి.. చంపుతానని వార్నింగ్.. అరుంధతిని కాపాడిన అమర్
Nindu Noorella Saavasam June 27th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 27వ తేది ఎపిసోడ్‌లో ఘోరా వేసిన నిమ్మకాయ నుంచి అరుంధతిని అమర్ కాపాడుతాడు. మరోవైపు ఘోరా తలకు గన్ గురిపెట్టి చంపుతానని మనోహరి వార్నింగ్ ఇస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 27th June Episode) ఇంట్లో జరుగుతున్న సమస్యల గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో మనోహరి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నా అరుంధతిని చంపారు. నేను ఆలస్యంగా వెళ్లింటే మిస్సమ్మకు ఏమయ్యేది. అలాగే మిస్సమ్మ వెళ్లడం ఆలస్యం అయినా అమ్ము ప్రాణాలు పోయేవి అని అమర్ చెబుతాడు.
ఇంట్లోకి వచ్చేందుకు
కావాలనే పక్కాగా ప్లాన్ చేసి నా ఫ్యామిలినీ టార్గెట్ చేస్తున్నారు. నా అరుంధతిని చంపి ఎంత పెద్ద తప్పు చేశారో వాళ్లకు తెలియట్లేదు అని అమర్ అంటాడు. తెలుసు అమర్. నీ కోపం తెలుసు. నీ ప్రేమ తెలుసు. నీకు నిజం తెలిస్తే మా ఇద్దరిని ఇక్కడే బొంద పెడతాడు అని మనోహరి తనలో తానే భయపడిపోతుంది. మరోవైపు ఇంట్లోకి ఘోరా వచ్చేందుకు ట్రై చేస్తుంటాడు. అది చూసిన మనోహరి ఘోరాను అమర్ చూస్తే ఎలా అని కంగారుపడుతుంది.
అనంతం అరుంధతిని పట్టుకునేందుకు ఓ నిమ్మకాయ తెస్తాడు ఘోరా. గోరా ఇంట్లోకి ప్రవేశించి అరును గుర్తించడానికి చుట్టూ వాసన చూడటం ప్రారంభిస్తాడు. గుప్తా వెళ్లేముందు తన ఉనికిని అనుభూతి చెందకుండా కదలవద్దని అరుకు సలహా ఇస్తాడు. ఘోరా అరుపై తాంత్రిక నిమ్మకాయను విసురుతాడు. దాంతో అరుంధతి ఇంట్లోకి పరుగెత్తుతుంది. అయితే ఆ నిమ్మకాయ కూడా అరుంధతి వెంటే వెళ్తుంది.
అమర్ కాలికి నిమ్మకాయ
ఈ క్రమంలోనే మనోహరి ఘోరాను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ, ఘోరా ఆగడు. అరు ఇంట్లోకి పరిగెత్తి మెట్ల దగ్గర ఆగిపోతుంది. అక్కడే భయంతో కిందపడిపోతుంది. కింద పడి భయంతో వణుకుతుంటుంది. ఇంతలో ఘోరా వేసిన నిమ్మకాయ అరుంధతి దగ్గరికి వస్తుంటుంది. అప్పుడే అమర్ వస్తాడు. అమర్ కాలికి తగిలి నిమ్మకాయ ఆగిపోతుంది. అది చూసిన అరుంధతి లేచి వెళ్లిపోతుంది.
గన్ తీసిన మనోహరి
తర్వాత రాథోడ్‌ను అమర్ పిలుస్తాడు. ఈ నిమ్మకాయ ఏంటీ, ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోమ్మని రాథోడ్‌కు చెబుతాడు. ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించారో వెతకమని అంటాడు అమర్. రాథోడ్ నుంచి ఘోరాను దాచేందుకు మనోహరి తెగ కష్టపడుతుంది. అమర్ ఆ నిమ్మకాయను నలిపి, చివరికి అరును రక్షిస్తాడు. ఘోరా ఆత్మ కోసం మళ్లీ ప్రయత్నిస్తే మనోహరి అడ్డుకుంటుంది. అయినా ఘోరా వినకపోవడంతో మనోహరి గన్ తీస్తుంది.
గన్ తీసి ఘోరా తలకు గురి పెడుతుంది. ఘోరా మళ్లీ ఇంట్లోకి ప్రవేశిస్తే చంపేసి పైకి పంపుతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది మనోహరి. దాంతో ఏం చేయలేక సైలెంట్ అయిపోతాడు ఘోరా. ఆ తర్వాత బయటకు వెళ్లిపోతాడు ఘోరా.
అమర్ ఎమోషనల్
కట్ చేస్తే అమర్ తన మంచం మీద పడుకుని లేచి చూస్తాడు. ఉదయాన్నే నిద్ర లేచిన భాగీ నడిచేందుకు ఇబ్బంది పడుతుంది. అనంతరం కోడలిగా తన విధులను పునఃప్రారంభించి కుటుంబం కోసం వంట చేయడం మొదలుపెడుతుంది మిస్మమ్మ. కుక్కర్ విజిల్ శబ్దంతో కుటుంబ సభ్యులు మేల్కొంటారు. అత్తమామలు ఏమి జరుగుతుందోనని ఆందోళన పడి వంట గదిలోకి వస్తారు. అక్కడ మిస్సమ్మను చూసి కోలుకోకముందే ఇంటి పనులు ఎందుకు చేస్తున్నావని మందలిస్తారు.
అరుంధతి కూడా ఇలాగే చేసేదాని వారు అనుకుంటారు. ఇది పిల్లల కోసం అని, స్కూల్ స్టార్ట్ అయిందని, ఇవాళ స్కూల్ ఫస్ట్ డే అని భాగీ వాళ్లకు గుర్తు చేస్తుంది. పిల్లల కోసం అంత కష్టపడుతున్న భాగీని చూసి శివరామ్, నిర్మల చలించిపోతారు. పిల్లలు ఆమె ప్రేమను త్వరలోనే అర్థం చేసుకుంటారని ఆశిస్తారు. అవతలి గదిలోంచి ఈ సంభాషణ విని అమర్ ఎమోషనల్ అవుతాడు.