Chinni Serial: టీవీలో సరికొత్త సీరియల్ చిన్ని ప్రారంభం.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ఆటా పాట! (ఫొటోలు వైరల్)
Star Maa Chinni Serial Maa Chinni Stars: ఎప్పటికప్పుడు సరికొత్త సీరియల్స్‌తో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు వినోదం అందించే స్టార్ మా మరో ధారావాహికను తీసుకొస్తుంది. స్టార్ మాలో త్వరలో ప్రారంభం కానున్న చిన్ని సీరియల్ నటీనటులు సికింద్రాబాద్ ప్రభుత్వ పాటశాలలో విద్యార్థులతో ఆడిపాడారు.
Maa Chinni Stars Event: సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ రోజు (జూన్ 28) "మా చిన్ని స్టార్స్" స్టూడెంట్స్‌తో కలిసి సందడి చేశారు. వినోదం, అభ్యాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో మా చిన్ని స్టార్స్ చేసిన సందడి ఆకట్టుకునేలా ఉంది. ఈ ఉత్సాహభరితమైన సందర్భంగా పాఠశాల ప్రాథమిక విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త టీవీ షో "చిన్ని"లోని ప్రియమైన పాత్రలైన చిన్ని, కావేరితో ఆడి పాడారు.

చిన్ని, కావేరి పిల్లలతో కలిసి ఉల్లాసంగా, ఆనందాన్ని కలిగించే వాతావరణాన్ని సృష్టించింది. ఈ రోజును పిల్లలకు చిరస్మరణీయమైనదిగా, విద్యావంతం చేసింది. విలువైన జీవిత పాఠాలను అందించడానికి రూపొందించిన వరుస ఆకర్షణీయమైన గేమ్‌లతో చిన్ని యువ ప్రేక్షకులను ఆకర్షించింది.
ఈ ఉల్లాసభరితమైన వాతావరణంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులు చెప్పింది వినడం, వారి తల్లిదండ్రులను గౌరవించడం, పరీక్షలలో ఉతీరణ సాధిచడం పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం వంటి విషయాల వల్ల కలిగే ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా "తల్లి మరియు బిడ్డ" అనే అంశంపై జరిగిన పెయింటింగ్ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పిల్లల కళాత్మకతో తల్లులు, అలాగే వారి పిల్లల మధ్య ప్రేమ, బంధాన్ని అందంగా చిత్రీకరించాయి. కుటుంబాలు కలిసి భోజనం చేయడం, ఆప్యాయత ప్రదర్శించడం, విలువైన క్షణాలను పంచుకునే దృశ్యాలను ప్రదర్శించారు. భాష, అభ్యాసంపై వారి ప్రేమను పెంపొందించిన విజేత విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ పుస్తకాలను ప్రదానం చేశారు.
చిన్ని తన ఆన్-స్క్రీన్ తల్లితో కలిసి ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. అందమైన మనసుల చిరునవ్వులు, ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈవెంట్ సంతోషకరమైన విషయాలతోపాటు స్ఫూర్తిని నింపేలా చేసింది. చిన్నారులు కూడా చిన్నితో పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేస్తూ వాతావరణంలో ఆనందాన్ని మరింత పెంచారు.
ఈ మధురమైన క్షణంలో భాగం అయిన విద్యార్థులందరితో చిన్ని, కావేరి సెల్ఫీ తీసుకోని పిల్లల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని మరింతగా పెచారు. ఈ కార్యక్రమంలో పిల్లల పట్ల ఉత్సాహం, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇది మరపురాని అనుభూతిని కలిగించింది.
ఇదిలా ఉంటే, "చిన్ని" సీరియల్ జూలై 1 నుంచి స్టార్ మా టీవీ ఛానెల్‌లో ప్రారంభం కానుంది. ప్రతి రోజు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. చిన్ని కొత్త సాహసాలను ఎదుర్కొంటూ, అర్థవంతమైన సంబంధాలను ఏర్పరుచుకుని, తన తల్లిని జైలు నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తుంటుంది. జైలు గోడలపై సాగే చిన్ని ప్రయాణంపై ఈ కథ సాగుతుంది.