NNS July 1st Episode: రామ్మూర్తికి రక్తపు వాంతులు.. అరుంధతికి తెలిసిపోయిన మనోహరి గతం.. జోరుగా భాగీ అమర్‌ లవ్ ట్రాక్-nindu noorella saavasam serial july 1st episode arundhathi knows manohari past nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns July 1st Episode: రామ్మూర్తికి రక్తపు వాంతులు.. అరుంధతికి తెలిసిపోయిన మనోహరి గతం.. జోరుగా భాగీ అమర్‌ లవ్ ట్రాక్

NNS July 1st Episode: రామ్మూర్తికి రక్తపు వాంతులు.. అరుంధతికి తెలిసిపోయిన మనోహరి గతం.. జోరుగా భాగీ అమర్‌ లవ్ ట్రాక్

Sanjiv Kumar HT Telugu
Jul 01, 2024 01:15 PM IST

Nindu Noorella Saavasam July 1st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 1వ తేది ఎపిసోడ్‌‌లో రామ్మూర్తికి ఆరోగ్యం పాడవుతుంది. రక్తపు వాంతులు చేసుకుంటాడు. అది మిస్సమ్మకు తెలియకుండా జాగ్రత్తపడతాడు. తర్వాత అమర్ భాగీ ఓ పార్టీకి వెళ్తారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

రామ్మూర్తికి రక్తపు వాంతులు.. మనోహరి గతం తెలుసుకున్న అరుంధతి.. జోరుగా భాగీ అమర్‌ లవ్ ట్రాక్
రామ్మూర్తికి రక్తపు వాంతులు.. మనోహరి గతం తెలుసుకున్న అరుంధతి.. జోరుగా భాగీ అమర్‌ లవ్ ట్రాక్

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 1st July Episode) పిల్లల అడ్మిషన్​ల కోసం మిస్సమ్మను కూడా స్కూల్​కి రమ్మంటాడు అమర్​. సరే అంటుంది మిస్సమ్మ. తాను కూడా వస్తానని బయల్దేరుతుంది మనోహరి. కానీ, కారులో చోటు లేదని, మనది కాదని తెలిసినప్పుడు వదిలేయడమే మంచిది అంటాడు శివరామ్. కోపంతో ఆగిపోతుంది మనోహరి.

తనకేం కాలేదని చెప్పి

స్కూల్‌లో తండ్రిని చూసి మళ్లీ తనకి చెప్పకుండా ఉద్యోగంలో చేరినందుకు కోప్పడుతుంది మిస్సమ్మ. పిల్లల అడ్మిషన్ పని పూర్తి చేసుకుని వచ్చిన భాగీ, అమర్​కి రామ్మూర్తి కనపడకపోవడంతో కంగారు పడతారు. తీవ్రమైన దగ్గుతో రక్తం వాంతులు చేసుకున్న రామ్మూర్తి ఆ విషయం భాగీకి తెలిస్తే కంగారు పడుతుందని భయపడతాడు. తనకేం కాలేదని చెప్పి భాగీని ఇంటికి వెళ్లమంటాడు. మిస్సమ్మను జాగ్రత్తగా కారులో ఇంటికి పంపిస్తాడు అమర్‌.

సీటు బెల్ట్‌ కూడా అమరే పెట్టడంతో పక్కనే ఉన్న రాథోడ్‌ ముసిముసి నవ్వులు నవ్వుతాడు. తర్వాత అమర్‌, రాథోడ్‌తో జాగ్రత్తగా వెళ్లమని చెప్తాడు. కారులో రాథోడ్‌, మిస్సమ్మ వెళ్తుంటారు. అమర్‌ సీటు బెల్ట్‌ పెట్టడాన్నే గుర్తు చేసుకుంటుంది మిస్సమ్మ. ఏంటమ్మా మిస్సమ్మా.. ముసి ముసి నవ్వులు మురిసిపోవడాలు.. ఆ మధుర క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నావా? అంటాడు రాథోడ్. నేనెక్కడ మురిసిపోతున్నా నార్మల్‌గానే ఉన్నాను అంటుంది మిస్సమ్మ.

మీ కలయికతో ముగుస్తుంది

మనసు ఇక్కడ ఉంటేనే కదమ్మా తెలియడానికి? నాకు తెలిసి ఆ ఆటోలో మా ఆఫీసుకు వెళ్తుందని నా అభిప్రాయం అంటాడు రాథోడ్. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సైలెంట్‌గా డ్రైవింగ్‌ చేయ్‌ అని మిస్సమ్మ​ అనగానే నువ్వు ఎన్ని చెప్పినా మేం అన్ని గమనిస్తున్నాం. సార్‌ ప్రవర్తన చాలా మారిపోయింది అంటూ రాథోడ్‌ అమర్‌ గురించి గొప్పగా చెప్తాడు. తర్వాత కొడైకెనాల్‌లో మా మేడంతో మొదలైన ప్రయాణం. హైదరాబాద్‌లో మీ ఇద్దరి కలయితో ముగుస్తుంది. ఆరోజు నిన్ను కలవనందుకు మా మేడం చాలా బాధపడ్డారని రాథోడ్‌ చెప్తాడు.

స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మనోహరికి ఫోన్‌ చేస్తుంది. స్కూల్‌లో పిల్లల్ని జాయిన్‌ చేయడానికి ఎందుకు రాలేదని అడుగుతుంది. మరోహరి ఏదో చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు మిస్సమ్మ, రాథోడ్‌ ఒక పార్టీకి వెళ్తారు. రెడీ అవ్వమని కారులో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అసలు ఇది ఏం పార్టీ ఎవరి పార్టీ.. అని అడుగుతుంది మిస్సమ్మ. సంజయ్‌ సింగ్‌ అని మా సీనియర్‌. ఆయన రిటైర్‌మెంట్‌ పార్టీ మేడం. కళ్లు తిప్పుకోలేనంత బాగా ఉన్నారా? మా సారు గారు అంటాడు రాథోడ్.

కపుల్ ఎంట్రీ అటువైపు

అవును అంటున్న మిస్సమ్మతో అమ్మగారు ఇంటికి వెళ్లాక మా సారుకు దిష్టి తీయండి అంటాడు. వెయిట్‌ సార్‌ కపుల్‌ ఎంట్రీ అటు వైపు ఉంది అంటాడు హోటల్​ వెయిటర్​. అమర్‌ విన్నావు కదా కపుల్‌‌కి సెపరేట్‌ ఎంట్రీ అట. వెళ్లండి.. అంటాడు శివరామ్​. వెళ్లండి అమర్‌ చూస్తారేంటి? అని నిర్మల అనగానే మిస్సమ్మ, అమర్‌ ఇద్దరూ కలిసి కపుల్‌ ఎంట్రీ వైపు వెళ్తారు.

మరోవైపు బాబ్జీని రౌడీలు కొట్టి వాడి ఫోన్‌ నుంచి మనోహరికి ఫోన్‌ చేస్తారు. మనోహరి ఎక్కడ ఉందో అడగమని చెప్తారు. సిటీ అవుట్‌ స్కట్‌లో ఒక ఫాం హౌస్‌లో ఫంక్షన్‌లో ఉన్నానని చెబుతుంది. రౌడీలు అక్కడకు వెళ్తారు. తర్వాత మిస్సమ్మ, అమర్‌ లోపలికి వెళ్లబోతుంటే ఎక్కడికి అమర్‌? అంటాడు శివరామ్. లోపలికి నాన్నా.. అంటాడు అమర్​.

ఫస్ట్ ఫొటో బాగా తీయించుకోండి

మీ ఎంట్రీ ఇంకా అవ్వలేదు. ఇదిగో ఒకసారి అటు చూడు అంటున్న శివరామ్​తో నాన్నా అవన్నీ ఏమీ వద్దు పదండి లోపలికి వెళ్దాం. నిర్మల ఇంట్లో రూల్‌ ఈజ్‌ రూల్‌.. రూల్‌ ఫర్‌ ఆల్‌ అని ఎవరో చెప్తూ ఉంటారు కదా? ఎవరు? అంటాడు. సరే పదండి.. అంటాడు అమర్​. మిస్సమ్మ ఇద్దరూ కలిసి తీయించుకునే ఫస్ట్‌ ఫోటో బాగా తీయించుకోండి అంటుంది నిర్మల.

మిస్సమ్మ, అమర్‌ ఇద్దరూ కలిసి ఫోటో దిగి వస్తారు. వాళ్లను చూసిన మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. తర్వాత గుప్త, అరుంధతి దగ్గరకు వచ్చి నిన్ను మా లోకంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే నువ్వేమో ఇక్కడున్నావా? అంటాడు. దీంతో మనోహరికి ఇంతకు ముందే పెళ్లి అయిందని ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందని అరుంధతి, గుప్తకు చెప్తుంది.

ఏదో జరగబోతోంది

తను ఎప్పుడు పెళ్లి చేసుకుంది. నా భర్త కోసం ఎందుకు వచ్చింది. ఏదో జరగబోతుంది అని అరుంధతి అడుగుతుంది. దీంతో ఆమె గతం, ఆమె భవిష్యత్తు రెండు ఎదురుపడుతున్నవి అంటాడు గుప్త. మనోహరి గతం అందరికీ తెలియనుందా? అరుంధతి మరణం వెనక ఉన్నది మనోహరి అని తెలుసుకున్న అమర్​ ఏం చేయనున్నాడు? అనే విషయాలు తెలియాలంటే జులై 2న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner