NNS June 26th Episode: అమావాస్య ఘడియలు మొదలు.. ఆత్మతో చిత్రగుప్తుడి తిప్పలు.. భాగీని అరుంధతి గురించి అడిగిన అమర్
Nindu Noorella Saavasam June 26th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 26వ తేది ఎపిసోడ్‌లో అమావాస్య ఘడియలు మొదలు అవుతాయి. దాంతో అరుంధతి ఆత్మ చిత్రగుప్తుడికి కనిపించదు. దాంతో తంటాలు పడతాడు గుప్తా. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 26th June Episode) అమర్ కూడా మిస్సమ్మ ఇంట్లో ఉండటమే కరెక్ట్ అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. షాక్లో ఉన్న మంగళను ఇంటికి వెళ్దాం పదా అంటాడు రామ్మూర్తి. ఇప్పుడే తొందరేం ఉంది అన్నయ్యగారు.. కాసేపు ఉండి వెళ్దురు అని లోపలకు తీసుకుని వెళ్తుంది నిర్మల.

మనసు దోచుకోవడంలో
జరిగిందంతా కిటికీలోనుంచి చూస్తున్న అరుంధతి ఇదేనా గుప్త గారు కథలో ట్విస్ట్ అని అడుగుతుంది. అవునంటూ అక్కడనుంచి వెళ్తాడు గుప్త. ఇంట్లో నుంచి పొమ్మన్న నోటితోనే ఇక్కడే ఉండిపొమ్మని అనిపించుకుంది ఆ బాలిక. ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మనషుల మనసులు దోచుకోవడంలో ఏదో కిటుకు కనిపెట్టినట్లున్నారు అనుకుంటాడు గుప్త.
ఇంతలో యమధర్మరాజు పిలిచి అమావాస్య దగ్గర పడుతుందని గుర్తుచేస్తాడు. అమావాస్య ఘడియలు మొదలవగానే ఆ బాలికను తీసుకుని మన లోకానికి వస్తాను ప్రభు అని మాటిస్తాడు గుప్త. అది నువ్వనుకున్నంత తేలిక కాదు గుప్తా.. ఆ బాలిక ఆత్మ నీకు కనిపించదు. కానీ ఆత్మ కదలికల్ని నువ్వు కనిపెట్టగలవు అని చెప్పి మాయమవుతాడు యముడు.
గుర్తుకు వచ్చిన అమావాస్య
గుప్త ఆకాశంలోకి చూస్తూ మాట్లాడటం చూసి నేను లేని సమయం చూసి యముడితో నా గురించి ఉన్నవి లేనివి కల్పించి చెబుతున్నట్లున్నారు అనుకుంటుంది అరుంధతి. వారి సంభాషణ వినేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఏంటని గుప్తని అడుగుతుంది. తనెవరితో మాట్లాడట్లేదని బుకాయిస్తున్న గుప్త మాటలు వినగానే ఆరోజు అమావాస్య అని అరుంధతికి గుర్తుకొస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది.
మిస్సమ్మను ఇంట్లోనుంచి బయటకు పంపించాలనే తమ ప్లాన్ వర్కౌట్ అవలేదని కోపంగా ఉంటుంది అంజు. అమ్ము కావాలనే మిస్సమ్మకు అనుకూలంగా ఓటు వేసి తమను ఓడించిందని కోప్పడుతుంది. మిస్సమ్మకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అమ్ము. కానీ మిగతా పిల్లలు అమ్ము మాట వినిపించుకోకుండా తాము అంజు పార్టీనే అంటారు. అమ్ము మాటలు విని తన అన్నయ్యలు కూడా ఎక్కడ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతారోనని ఆందోళన చెందుతుంది అంజు.
అక్కను మిస్ అవుతున్నాను
రోజంతా గదిలోనే ఉండడంతో భాగీకి బోర్ కొడుతుందని గ్రహించిన అమర్ తనని మాటల్లో పెడతాడు. టీవీ చూస్తావా? పాటలు వింటావా అని అడుగుతాడు. కాదు ఎఫ్ఎమ్ వింటాను అంటుంది భాగీ. ఆర్జేగా పనిచేయడం మిస్సవుతున్నావా అని అడుగుతాడు అమర్. అవునంటుంది భాగీ. ఉద్యోగం చేయడం కంటే దాని ద్వారా దగ్గరైన అక్కను మిస్సవుతున్నానని అంటుంది.
భాగీని అమర్ ఆర్జే లాగా మాట్లాడమని అడుగుతాడు. తద్వారా అతను ఆరును తలుచుకుంటాడు. అరుంధతి అమర్ భార్య అని తెలియని భాగీ ఆరు గురించి మాట్లాడుతుంది. కొడైకెనాల్ వరకు తీసుకెళ్లిన తన ప్రేమ కళ్లెదుటకు మాత్రం రాలేదని వాపోతుంది. అరుంధతి లేదనే వార్త తెలిస్తే భాగీ తట్టుకుంటుందో లేదోనని ఆలోచిస్తాడు అమర్. ఆమెకి ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నావా? అని అడుగుతాడు.
యమలోకానికి అరుంధతి
కానీ, ఆరు ఆలోచనలను తట్టుకోలేక గదిలో నుంచి బయటకు వచ్చేస్తాడు అమర్. అమావాస్య మొదలవుతుంది. గుప్తా ఆరును చూడలేడు. గుప్తా అరును కదలమని అడుగుతాడు, తద్వారా అతను ఆమెను గుర్తించగలడు. అరుంధతి కదులుతున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న మొక్కలు కదలడం కనిపిస్తుంది. గుప్తా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరుని యమలోకానికి తీసుకెళ్లాలని అనుకుంటాడు.
అరుంధతి ఆత్మను గుప్త యమలోకానికి తీసుకెళ్తాడా? అమావాస్య ఘడియల్ని అరుంధతి ఎలా ఉపయోగించుకోనుంది? అనే విషయాలు తెలియాలంటే జూన్ 27న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్