Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 3rd July Episode) మనోహరిని వెతుక్కుంటూ ఆమె భర్త రణ్‌వీర్ రిసార్ట్‌కి వస్తాడు. రణ్‌వీర్, అతని మనుషులు రిసార్ట్ మొత్తం వెతుకుతూ ఉంటారు.
మనోహరి కనపడగానే కోపంతో చంపేయకుండా ఇక్కడ నుంచి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లడం మంచిది. ఇది అసలే ఆర్మీ ఫంక్షన్.. ఏదైనా తేడా వస్తే ఆర్మీ వాళ్లు ఊరుకోరు అని హెచ్చరిస్తాడు అతని అనుచరుడు. సరేనంటాడు రణ్‌వీర్. వాళ్లంతా ఫంక్షన్హాల్లో తిరుగుతూ వెతుకుతుంటే మనోహరి వారికి దొరకకుండా దాక్కుంటుంది.
బీహారీ ముఠా వ్యక్తులు ఎదురుపడటంతో ఆరోజు మా అమ్మాయి పెళ్లిలో కూడా వచ్చిందే మీరే కదా అని అడుగుతాడు శివరామ్. అవును.. అనగానే ఏ మీరు వెతుకుతున్న అమ్మాయి ఇంకా దొరకలేదా అంటాడు. కచ్చితంగా దొరుకుతుంది అంటాడు రణ్‌వీర్. వారిని చూసి మనోహరి దాక్కోవడం చూసిన శివరామ్ ఏంటమ్మా మనోహరి అని అంటాడు. దాంతో మనోహరి షాక్ అవుతుంది. మనోహరిని చూసిన రణ్‌వీర్ కూడా ఆశ్చర్యపోతాడు.
వెంటనే నేను వాష్‌రూమ్ వెళ్లొస్తా అంకుల్ అంటూ పరుగులు పెడుతుంది మనోహరి. తను వెతుకున్న మనోహరి అక్కడే ఉందని పరిగెత్తుకుంటూ వస్తాడు రణ్‌వీర్. కానీ, వాళ్లమ్మాయి పేరు కూడా మనోహరినే అని చెప్పడంతో ఆగుతాడు. మరోవైపు నాలుగు కుప్పిగంతులు వేసి తనదే డ్యాన్స్ అని కొందరు ఫీలవుతున్నారని అంజు అంటుంది.
స్టేజ్ మీదకి ఎక్కి తానూ తన అక్క, అన్నయ్యలతో కలిసి డ్యాన్స్ చేసి అసలు డ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తాను అని అనౌన్స్ చేస్తుంది అంజు. పిల్లలు అందరూ స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తారు. భాగీ, అమర్, అరుంధతి.. అందరూ సంబరపడిపోతారు. భాగీ, పిల్లలు టేబుల్ దగ్గర కూర్చుని సెల్ఫీలు తీసుకుంటుంటే వాళ్లని వెళ్లి భోజనం చేయమంటాడు అమర్. సరేనని పిల్లల్ని తీసుకుని భోజనానికి వెళ్తుంది భాగీ.
ఇంతలో మనోహరిని చూసిన రణ్‌వీర్ కోపంతో అరుస్తాడు. దాంతో మనోహరి హాయ్ అని అంటుంది. హాయ్ చెప్పడానికి రాలేదు.. బాయ్ చెప్పడానికి వచ్చాను అంటూ మనోహరి వెంటపడి చంపేందుకు ప్రయత్నిస్తాడు రణ్‌వీర్. దాంతో ప్రాణభయంతో ఫంక్షన్‌లోకి పరుగులు పెడుతుంది మనోహరి.
రణ్‌వీర్ తుపాకీతో కాలుస్తూ మనోహరి వెంటపడుతూ బుల్లెట్లు పేల్చడంతో అందరూ కంగారుపడి పరుగులు పెడతారు. అమర్, భాగీ, పిల్లలు తలో దిక్కున పరిగెడతారు. ఆ తోపులాటలో అంజు కిందపడిపోతుంది. అంజు కనపడకపోవడంతో అందరూ కంగారు పడతారు. కిందపడిన అంజుని ఎవరూ తొక్కకుండా అడ్డుపడి కాపాడుతుంది మిస్సమ్మ.
రణ్‌వీర్‌కి దొరకకుండా ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది మనోహరి. అంజు మిస్సమ్మని అర్థం చేసుకుంటుందా? అమర్‌కి రణ్‌వీర్ ఎవరో తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే జులై 04న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!