NNS July 6th Episode: విషం గురించి తెలుసుకున్న భాగీ- బయటపడిన మనోహరి బాగోతం- అమర్ ట్విస్ట్- పిల్లలు బతుకుతారా? ఆరు వేదన
Nindu Noorella Saavasam July 6th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 6వ తేది ఎపిసోడ్‌లో ఇంటి కిచెన్‌లో విషపు సీసా కనిపించడంతో అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తుంది భాగీ. అనంతరం నిజం తెలుసుకుంటుంది. దాంతో స్కూల్‌కు పరుగున వెళ్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 6th July Episode) మనోహరి వంటల్లో విషం కలిపిన సంగతి ఎలాగైనా భాగీకి తెలిసేలా చేయమని దేవుడిని వేడుకుంటుంది అరుంధతి. కిచెన్ డస్ట్‌బిన్‌లో మనోహరి పడేసిన విషం సీసా భాగీ కంటపడుతుంది. దాన్ని తీసి ఇదేంటి.. ఏదో ఆయుర్వేదం మందులా ఉంది. అత్తయ్య, మామయ్యలకు దీని గురించి తెలుసేమో అని అడగడానికి వెళ్తుంది.
షాకైన మనోహరి
ఆ సీసా తీసుకుని భాగీ బయటకు రావడం చూసి షాకవుతుంది మనోహరి. అసలు ఆ సీసా భాగీకి ఎలా దొరికిందని ఆలోచనలో పడుతుంది. తనే వంటల్లో విషం కలిపి సీసాని డస్ట్‌బిన్‌లో పడేసిన సంగతి గుర్తొచ్చి తిట్టుకుంటుంది. దీనికి కొంచెం అనుమానం వచ్చినా వదిలేయదు అని గది బయట నుంచి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది. మరోవైపు అమర్ తల్లిదండ్రులను ఆ సీసా గురించి అడుగుతుంది భాగీ.
అసలు ఆ సీసా గురించి తమకేం తెలియదని అమర్ తల్లిదండ్రులు చెప్పడంతో ఆలోచనలో పడుతుంది భాగీ. అసలు ఇది కిచెన్‌లోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ బయటకు వస్తుండగా మనోహరి గది తలుపు శబ్దం కావడంతో ఆగిపోతుంది. ఇక్కడేదో తప్పు జరుగుతోంది. వెంటనే అదేంటో కనిపెట్టాలని అనుకుంటుంది మిస్సమ్మ. నా పిల్లల ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి ఎలాగైనా వాళ్లని కాపాడు మిస్సమ్మ అంటుంది అరుంధతి.
నన్ను కలిసే పనేంటీ
రణ్‌వీర్‌ని కట్టేసి ఇంటరాగేట్ చేస్తారు పోలీసులు. తను అర్జెంట్‌గా వెళ్లాలి వదిలెయ్యమంటాడు రణ్వీర్. నీ టార్గెట్ ఎవరు? ఎవరిని చంపడానికి అక్కడకు వెళ్లావు? అని ప్రశ్నిస్తాడు పోలీస్. నా టార్గెట్ మిలట్రీ వాళ్లు కాదు.. ఎవరో వాళ్లని చంపిన తర్వాత చెప్తాను అంటాడు రణ్వీర్. అతన్ని కలవడానికి లెఫ్టినెంట్ అమరేంద్ర వస్తున్నాడని చెబుతాడు కానిస్టేబుల్. ఆ మిలట్రీవాడికి నన్ను కలిసే పనేంటి? అనుకుంటాడు రణ్వీర్.
రాథోడ్, అమర్ ఇద్దరూ కారులో వెళ్తూ ఫంక్షన్లో జరిగినదాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పోలీస్ ఫోన్ చేసి అతన్ని కలడానికి సార్ ఇప్పుడే రమ్మన్నారని చెబుతాడు. అమర్ వెంటనే రాథోడ్‌ని ఇంటికి వెళ్లమని చెబుతాడు. మనోహరికి ఫోన్ చేసి బయటకు వెళ్లాలని చెప్పాకదా.. రెడీగా ఉండమంటాడు. సరేనంటుంది మనోహరి. అమర్‌తో కలిసి మొదటిసారి బయటకు వెళ్తున్నాననే సంబరంలో బాగా రెడీ అవ్వాలనుకుంటుంది మనోహరి.
అన్నం తినేస్తారో
డస్ట్‌బిన్‌లో దొరికిన బాటిల్ తీసుకుని మెడికల్ షాపుకి వెళ్లి అదేంటని అడుగుతుంది మిస్సమ్మ. అది చాలా విషపూరితమైన పసరు మందని, కొంచెం శరీరంలోకి వెళ్లినా ప్రమాదమని, అన్నంలో కలిపి ఇస్తే ఎవరికీ అనుమానం రాదని చెబుతాడు మెడికల్ షాపతను. అది విన్న మిస్సమ్మ పిల్లలు గుర్తొచ్చి స్కూల్‌కి పరిగెత్తుతుంది. లంచ్ టైమ్ అవుతోంది పిల్లలు విషం కలిపిన అన్నం తినేస్తారో ఏమో.. మిస్సమ్మకి నిజం తెలిసిందో లేదోనని కంగారుపడుతూ ఎలాగైనా తన పిల్లలను కాపాడమని దేవుడ్ని వేడుకుంటుంది అరుంధతి.
మనోహరి స్వార్థాన్ని తన పిల్లల్ని బలితీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తుంది. పిల్లలు లంచ్ బ్రేక్ ఇవ్వడంతో బాక్స్‌లు ఓపెన్‌చేసి తినేందుకు రెడీ అవుతారు. అమ్ము వాళ్లని ఆపి తాతయ్యని పిలవాలి కదా అంటూ రామ్మూర్తిని పిలుచుకుని వస్తుంది. అంజు కూడా అమ్ము వెంట వెళ్తుంది. మిస్సమ్మ పరగెత్తుకుంటూ స్కూల్‌కి చేరుకుంటుంది.
మిస్సమ్మ ఆపుతుందా?
పిల్లలు విషం కలిపిన అన్నం తినకుండా మిస్సమ్మ ఆపుతుందా? అమర్ మనోహరిని రణ్వీర్ దగ్గరకు తీసుకెళ్తాడా? అనే విషయాలు తెలియాలంటే జులై 07న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్