NNS October 4th Episode: ​ఘోరాతో మనోహరి గొడవ.. రణ్​వీర్ దగ్గర నిజం తెలుసుకుని షాక్​.. అరుంధతిని బంధించిన గుప్తా-nindu noorella saavasam serial october 4th episode manohari fight with ghora nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns October 4th Episode: ​ఘోరాతో మనోహరి గొడవ.. రణ్​వీర్ దగ్గర నిజం తెలుసుకుని షాక్​.. అరుంధతిని బంధించిన గుప్తా

NNS October 4th Episode: ​ఘోరాతో మనోహరి గొడవ.. రణ్​వీర్ దగ్గర నిజం తెలుసుకుని షాక్​.. అరుంధతిని బంధించిన గుప్తా

Sanjiv Kumar HT Telugu
Oct 04, 2024 10:10 AM IST

Nindu Noorella Saavasam October 4th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌‌లో సంతోషంగా ఘోరాకు కాల్ చేస్తుంది మనోహరి. కానీ, ఘోరా చెప్పింది విని షాక్ అయిన మనోహరి అతనితో గొడవ పడుతుంది. తర్వాత రణ్‌వీర్ దగ్గరికి వెళ్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌ (NNS 4th October Episode)లో రణ్​వీర్​ దగ్గరకు వెళ్లి మనోహరి గతం తెలుసుకున్న అరుంధతి షాకవుతుంది. అంజు మనోహరి కూతురు అంటే నమ్మలేకపోతున్నాను గుప్తగారు అంటుంది. అంజలి వాళ్ల కూతురు అన్న నిజం ఎవ్వరికీ తెలియకుండా చేస్తాను అంటూ వెళ్లిపోతుంది.

ఇరిటేటింగ్‌గా మనోహరి

మళ్లీ విధికి ఎదురు వెళ్తున్నావు బాలిక అంటూ హెచ్చరిస్తాడు గుప్త. అరుంధతి వినకుండా వెళ్లిపోతుంది. మనోహరి అందరూ వెళ్లిపోయారు అనుకుని ఘోరాకు ఫోన్‌ చేద్దామని డోర్‌ వేయబోతుంటే అంజు వస్తుంది. అంజు తన గొప్పతనం గురించి, తాయత్తు కట్టి మీకు హెల్ప్​ చేశానంటూ తనని తను పొగుడుకుంటూ ఉంటుంది. కానీ, మనోహరి ఇరిటేటింగ్‌‌గా ఫీలవుతుంది.

తనకు హెడేక్‌‌గా ఉందని అంజును పంపించి డోర్‌ వేసుకుని ఘోరాకు కాల్‌ చేస్తుంది. నీ జీవితాశయం నెరవేరాక కూడా ఇంకా నీరసంగా మాట్లాడుతున్నావేంటి ఘోరా. గట్టిగా మాట్లాడు. నీ మాటల్లో మన గెలుపు వినాలని ఉంది. నేను కలలు కన్న జీవితం నాకు రాబోతుందని చెప్పు. హలో ఘోరా ఏమైంది. ఏమీ మాట్లాడటం లేదు అంటుంది మనోహరి. చెప్పు మనోహరి.. అంటాడు ఘోరా.

ఘోరా మాటలు నీరసంగా అనిపించడంతో.. ఫ్లీజ్‌ అరుంధతిని నువ్వు బంధించలేదని మాత్రం చెప్పకు. దాన్ని బంధించడానికి నన్ను నేను ఎరగా వేసుకున్నాను అంటుంది మనోహరి. ఆ ఆత్మను బంధించే లోపు ఆ అమరేద్ర వచ్చాడు మనోహరి. నన్ను కూడా పట్టుకోవాలని చూశాడు. కానీ, నేను ఎలాగోలా తప్పించుకుని వచ్చాను అంటాడు ఘోరా.

ఘోరాతో గొడవ

ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోయావా? మంత్రాలు తంత్రాలు క్షుద్రపూజలు వచ్చని చెప్తావు కదా..? శక్తి వంతుడివి అని చెప్తుంటావు కదా? ఆఫ్ట్రాల్ ఒక ఆత్మని, గాలిని బంధించలేకపోయావా..? నిన్ను నమ్ముకున్నాను చూడు నాకు బుద్ది లేదు అని మనోహరి కోపంగా ఫోన్‌ కట్‌ చేసి విసిరికొట్టబోతుంటే రణ్‌వీర్‌ ఫోన్‌ చేస్తాడు.

ఇందాక నా ఇంటికి ఎందుకు వచ్చావో కనుక్కుందామని ఫోన్‌ చేశాను అని అడుగుతాడు రణవీర్‌. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో తేరుకుని ఇప్పుడే నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది. తనలో ఉన్న అరుంధతి ఆత్మ రణవీర్‌ దగ్గరకు ఎందుకు వెళ్లింది. ఏం తెలుసుకుంది అని అనుమాపడుతుంది మనోహరి. మరోవైపు అరుంధతి పిల్లల రూంకి వెళ్తుంది.

అంజు లేదని చూస్తుంది. ఇంతలో అంజు పాట పాడుతూ లోపలికి వస్తుంది. పిల్లలు ముగ్గురు చదువుకోవడం చూసి వాళ్లను డిస్టర్బ్‌ చేస్తుంది. మరోవైపు రణవీర్‌ దగ్గరకు మనోహరి వెళ్తుంది. నీకోసమే ఎదురుచూస్తున్నాను మనోహరి అంటున్నరణ్​వీర్​తో నిన్న అది వచ్చి ఏం మాట్లాడింది అంటుంది. ఎవరు?ఎవరొచ్చారు..? అంటాడు రణ్‌వీర్. ఆదే ఆ ఆ.. నేనే.. నేను వచ్చి ఏం మాట్లాడాను అని అడుగుతుంది మనోహరి.

మెమోరీ లాస్ అయిందా

నీకు గుర్తు లేదా? లేక మెమెరీ లాస్‌ ఏమైనా అయిందా? అంటాడు రణ్​వీర్​. అది కాదు రణవీర్‌ అది వచ్చి నీతో ఏం మాట్లాడిందో చెప్పు రణవీర్‌ అంటున్న మనోహరితో నీకేమైనా పిచ్చి పట్టిందా? మనోహరి. నిన్న వచ్చి ఇలాగే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్లిపోయావు. ఇప్పుడొచ్చి ఎవరో వచ్చారంటున్నావు. నువ్వేం మాట్లాడావని అడుగుతున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అంటాడు రణ్​వీర్​.

అర్థం అవుతుంది. చెప్పు నిన్న నేను వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది అని మనోహరి అడగ్గానే నిన్న నువ్వు వచ్చి జరిగింది ఏదీ తెలియనట్టు అడగావు. నిన్ను ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లలేదని అడిగావు అంటూ జరిగంది మొత్తం చెప్తాడు రణవీర్‌. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నీ కథ ముగిస్తాను అని రణ్‌వీర్ అనుకుంటాడు. పిలల రూంలోంచి వెళ్లిపోతున్న అరుంధతిని భాగీ చూస్తుంది.

అక్కలా అనిపిస్తుంది. ఈ టైంలో అక్క ఇక్కడేం చేస్తుంది అనుకుంటుంది భాగీ. కానీ, భాగీ చూడటం గమనించిన ఆరు గార్డెన్‌‌లోకి పరుగెడుతుది. గుప్త రాగానే విషయం చెప్పి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతుంది. గుప్త నవ్వుతుంటాడు. ఇన్ని రోజులు నిన్ను మా లోకానికి రమ్మని అడిగితే రానన్నావు ఇప్పుడు నన్నే మార్గం అడుగుతున్నావా..? అంటూ నవ్వుతాడు.

ఆరుపై కోపంగా భాగీ

అరుంధతి ఎక్కడకు వెళ్లకుండా బంధిస్తాడు. దీంతో భాగీ వస్తుంది. నన్ను చూస్తుంది. వదలండి అంటూ ప్రాధేయపడుతుంది అరుంధతి. భాగీ వచ్చి అక్కా అంటూ పిలుస్తూ కోపంగా చూస్తుంది. ఆరు ఆత్మని గుప్త యమలోకానికి తీసుకెళ్తాడా? అంజు తన కూతురేనని మనోహరి తెలుసుకుంటుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 04న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner