NNS July 22nd Episode: అమర్, భాగీల దాంపత్య వ్రతం.. మనోహరికి పెళ్లయిందని చెప్పిన పంతులు.. రణ్‌వీర్‌కి దొరికిపోయిన మనోహరి
NNS July 22nd Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (జులై 22) ఎపిసోడ్లో అమర్, భాగీలు దాంపత్య వ్రతం చేస్తారు. అదే సమయంలో మనోహరికి పెళ్లయిందని పంతులు చెప్పడం విని షాకవుతాడు అమర్.
NNS July 22nd Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు (జులై 22) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పంతులు రాకుండా ఆయన అన్నని పంపించడంతో ఎక్కడ దాంపత్య వ్రతం గురించి నోరు జారతారోనని భయపడతారు అమర్ తల్లిదండ్రులు.
వాళ్లు భయపడినట్లే.. విషయం అంతా తెలుసు.. విశేషం చెప్పేలా నేను చేస్తాను. దాంపత్య వ్రతం చేయించడంలో నేను దిట్ట అంటాడు పంతులు. దాంతో ఏంటమ్మా.. మీరేమో దోష నివారణ పూజ అన్నారు కానీ ఈయనేమో దాంపత్య పూజ అంటున్నారు అంటాడు.
దాంపత్య వ్రతానికి ఒప్పుకున్న అమర్
అదే.. ఇద్దరూ దంపతులు కలిసి చేసే పూజ కాబట్టి దాంపత్య పూజ అన్నాను అని కవర్ చేసి అందరినీ పూజకు తీసుకెళ్తాడు పంతులు. దంపతులిద్దరినీ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయించి ముడుపు కట్టిస్తాడు. వీళ్లిద్దరిని కలపడానికి మనమింత కష్టపడి పూజ ఏర్పాటు చేస్తే ఈయనేంటి ఇంత సింపుల్‌గా పూజ అయిపోయింది అంటున్నారు అంటాడు శివరామ్. ముడుపు కట్టడానికి అమర్‌ని సాయం చేయమంటుంది భాగీ.
అమర్ షర్ట్ విప్పమంటాడు పంతులు. ఎందుకు అంటాడు అమర్. పూజ చేస్తున్నావు కాబట్టి తియ్యాలి అంటాడు పంతులు. అయినా పూజ చేయడానికి షర్ట్ తీయడమెందుకు అంటుంది మనోహరి. అమ్మా.. మనోహరి నువ్వు కొంచెం ఆగుతావా.. పంతులుగారి మాటకే ఎదురు చెప్తావా అంటాడు శివరామ్. అమర్.. పంతులు చెప్పినట్లు చెయ్యి అని శివరామ్ అనడంతో అమర్ షర్ట్ విప్పుతాడు.
మనోహరికి పెళ్లయిందని చెప్పిన పంతులు
కార్యక్రమం మొదలు పెట్టండి అంటాడు రాథోడ్. చుట్టూ చూసి అమ్మాయి.. నిండు ముత్తైదువులా ఉన్నావు ఈ ఇద్దరినీ ఈ కండువతో కలిపి కట్టు అని మనోహరిని చూసి అంటాడు పంతులు. అదేంటి పంతులుగారు.. పెళ్లైన వాళ్లని కదా ముత్తైదువు అంటారు. మరి మనోహరిని అలా అంటున్నారేంటి అంటుంది మిస్సమ్మ. అదేంటమ్మా.. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు. ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంటే అంటాడు పంతులు.
అందరూ షాకవుతారు. మనోహరీ.. పంతులుగారు చెబుతోంది నిజమేనా? నీకు పెళ్లి జరిగిందా అని అడుగుతాడు అమర్. కంగారు పడుతుంది మనోహరి. చెప్పమని అమర్ గట్టిగా అనడంతో నాకు పెళ్లి జరగడం ఏంటి అమర్.. జరిగితే నీకు తెలియకుండా? ఆయనేదో పొరపాటు పడుతున్నారు అంటుంది మనోహరి. పొరపాటు పడే అవకాశమే లేదు ఈ అమ్మాయికి కచ్చితంగా పెళ్లైంది అంటాడు పంతులు.
దగ్గరగా అమర్, భాగీ.. దూరంగా మనోహరి
నా పెళ్లి గురించి ఎందుకు.. ఇప్పుడేంటి.. ఆ కండువాతో వీళ్లిద్దరినీ కలిపి కట్టాలి అంతేనా అని కండువా తీసుకుని అమర్, భాగీని కలిపి కడుతుంది మనోహరి. అలా దూరంగా కాదు అని గట్టిగా లాగి కడతాడు పంతులు. ఇద్దరినీ కలిసి ముడుపు కట్టమని చెబుతాడు. ఇలాంటి పరిస్థితిలో ఎలా ముడుపు కట్టడం అంటున్న అమర్‌తో కట్టి తీరాల్సిందే అంటాడు.
చేసేదేంలేక ఇద్దరూ కలిసి ముడుపు కట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ పంతులు వాళ్లని ఆపి అబ్బాయి కాళ్లమీద కాళ్లు ఉంచి ముడుపు కట్టమని చెబుతాడు. పంతులుగారూ.. ఇలాంటి సంప్రదాయాలు నేనెప్పుడూ చూల్లేదు అంటాడు అమర్. అన్ని ఆచారాలు ఉంటాయి బాబు కట్టండి అంటాడు పంతులు. ఒప్పుకున్నాక తప్పుతుందా.. ఎక్కి కట్టు అంటాడు అమర్. భాగీ అమర్ పాదాలపై ఎక్కి ముడుపు కడుతుంది. వాళ్లని అలా చూడలేక అక్కడనుంచి దూరంగా వెళ్తుంది మనోహరి.
మనోహరిని కనిపెట్టిన రణ్‌వీర్
అప్పుడే అక్కడకు చేరుకున్న రణ్‌వీర్ మనోహరిని చూస్తాడు. డైరీ విషయం గుర్తురావడంతో కారు కీస్ రాథోడ్ దగ్గర ఉన్నాయని ఎలాగైనా డైరీని ఎవరికీ తెలియకుండా తీసుకోవాలి అనుకుంటుంది మనోహరి. కారు డోర్ తీయడానికి మనోహరి చేస్తున్న ప్రయత్నాలు చూసి ఏదో సాక్ష్యం ఆ కార్లో ఉండి ఉండాలి అనుకుంటారు రణ్‌వీర్, అతని అనుచరులు.
పూజ అయిపోయింది కదా నేను బయట ఉంటాను మీరు వచ్చేయండి అని బయల్దేరబోతాడు అమర్. పూజ అప్పుడే అవలేదు ఇంకా రెండు ఘట్టాలు ఉన్నాయి అంటాడు పంతులు. నిర్మల నచ్చజెప్పడంతో చేసేదేం లేక ఒప్పుకుంటాడు అమర్. పాపం మామయ్య.. ఆయన ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నారు అంటుంది మిస్సమ్మ.
వాడి మనస్సులో ప్రేమ పుట్టాలంటే ఈమాత్రం పాట్లు పడాలి.. నువ్వు సైలెంట్‌గా ఉండు అంతా నేను చూసుకుంటాను అంటాడు శివరామ్. మనోహరి కనపడకపోవడంతో వెళ్లి ఎక్కడున్నా తనని తీసుకురమ్మని రాథోడ్‌కి చెబుతుంది భాగీ. కార్ డోర్ తియ్యడానికి ప్రయత్నిస్తున్న మనోహరిని చూసి అక్కడేం చేస్తున్నారు మేడమ్ అని అడుగుతాడు రాథోడ్.
ఏం లేదు అని కంగారు పడుతున్న మనోహరిని చూసి కీస్‌తో డోర్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. ఏం లేదు మీరు రండి వెళ్దాం అంటాడు రాథోడ్. నేను రానని మొండికేస్తుంది మనోహరి. రమ్మని బలవంతంగా మనోహరిని గుడి లోపలకి తీసుకెళ్తాడు రాథోడ్. రణ్‌వీర్ ఏం చేస్తాడు? అమర్‌కి నిజం తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జులై 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్