NNS October 1st Episode: రణ్‌వీర్ ఇంటికి మనోహరిలోని అరుంధతి- తాయత్తు కట్టే పనిలో అంజు- బతిమిలాడిన గుప్తా- కాపాడేదెవరు?-nindu noorella saavasam serial october 1st episode arundhathi going ranveer home nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns October 1st Episode: రణ్‌వీర్ ఇంటికి మనోహరిలోని అరుంధతి- తాయత్తు కట్టే పనిలో అంజు- బతిమిలాడిన గుప్తా- కాపాడేదెవరు?

NNS October 1st Episode: రణ్‌వీర్ ఇంటికి మనోహరిలోని అరుంధతి- తాయత్తు కట్టే పనిలో అంజు- బతిమిలాడిన గుప్తా- కాపాడేదెవరు?

Sanjiv Kumar HT Telugu
Oct 01, 2024 11:30 AM IST

Nindu Noorella Saavasam October 1st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌‌లో గుప్తా నుంచి తప్పించుకున్న అరుంధతి మనోహరి శరీరంలో దూరుతుంది. ఇంట్లో సమస్యలకు పరిష్కారం రణ్‌వీర్ దగ్గర ఉంటుందని అతని ఇంటికి వెళ్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌ (NNS 1st October Episode)లో అరుంధతి కనిపించకపోవడంతో వెతుకుతుంటాడు గుప్త. ఇంతలో యముడు వచ్చి ఇంకా ఆ బాలికను తీసుకురాలేదేంటి అని ప్రశ్నిస్తాడు. పౌర్ణమి గడియలు ముగిసే లోపు ఆ బాలికను తీసుకుని వస్తాను అని గుప్త చెప్తాడు.

గుప్త మాటలు అరుంధతి వింటుంది. అరుంధతిని చూసిన గుప్త షాక్‌ అవుతాడు. దాంతో అరుంధతి ఏడుస్తుంది. నేను చెప్పేది ఒక్కసారి వినుము.. అని గుప్త నచ్చజెప్పబోతుంటే నన్ను ఎలా మెసం చేయాలనిపించింది అని అడుగుతుంది. దీంతో ఇది మోసం కాదని ఇందులో నా వ్యక్తిగతం ఏమీ లేదని చెప్తాడు గుప్త.

మనోహరి చెప్పిన విషయం

మీరు నన్ను ఎప్పటికీ మోసం చేయరని అనుకున్నాను కదా. అది నా తప్పే అంటుంది అరుంధతి. నీకు ఒక సోదరుడిగా చెప్తున్నాను. ఇక్కడ అన్ని వదిలేసి ఇక వచ్చేయ్‌. నీకు ఈ ఇంటికి రుణం తీరింది బాలిక. మనం మా లోకానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది అని గుప్త మంత్రాలు చదువుతుంటే అరుంధతికి మనోహరి చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే లోపలికి పరుగెత్తుకెళ్తుంది.

వెనకాలే గుప్త బాలికా ఆగుము అంటూ వెళ్తాడు. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. అరుంధతి కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్లను అందరినీ పరీక్షగా చూస్తుంటాడు గుప్త. ఎవరిలోనూ అరుంధతి లేదని నిర్ధారించుకుంటాడు. ఆ తర్వాత మనోహరి రూంలోకి వెళ్లి చూస్తాడు గుప్త. బాలికా ఇచ్చట ఉన్నది నీవేనని నాకు తెలుయును ఎందుకు ఇటుల చేయుచుంటివి. బాలికా నీవు ఈ శరీరంలో ఉండరాదు. వెంటను బయటకు రమ్ము అంటాడు.

సారీ గుప్త గారు నేను రాలేను అంటుంది మనోహరి శరీరంలో ఉన్న అరుంధతి ఆత్మ. బాలికా నువ్వు ఈ బాలిక శరీరం నందు ఉండుట వలన నీకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో నీకు తెలియుట లేదు. రమ్ము బయటకు రమ్ము బాలిక. నీవు తన శరీరం నందు ప్రవేశించాలనే ఆ బాలిక అలా మాట్లాడింది అంటాడు గుప్త.

మనోహరి ప్లాన్ చేస్తే రాలేదు

నేను మనోహరి ప్లాన్‌ చేస్తే మను బాడీలోకి రాలేదు గుప్త గారు. నేను నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వచ్చాను. నా ఇంటికి వచ్చిన సమస్య కోల్‌కతాలో మొదలైంది అనిపిస్తుంది. రణవీర్‌ మనోహరితో మొదలైంది అనిపిస్తుంది. అందుకే సమాధానాలు వెత్తుక్కుంటూ రణవీర్‌ దగ్గరకు వెళ్తున్నాను అంటూ బయల్దేరుతుంది అరుంధతి.

అది కాదు బాలికా.. నేను చెప్పేది వినుము అంటాడు గుప్త. రణవీర్‌, మనోహరి తన భార్య కాదని చెప్పడం వెనక మనును ఇక్కడే ఉంచడం వెనక కారణాలు తెలుసుకుంటే మా ఇంట్లో ఉన్న సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. నా పని అయిపోగానే నేనే వస్తాను గుప్త గారు. నాకేం కాదు. నన్నెవరూ ఏమీ చేయలేరు అని చెప్పి గుప్త పిలుస్తున్నా వెళ్లిపోతుంది అరుంధతి.

స్కూల్‌‌కు వెళ్తున్న అంజుకు మనోహరి చెప్పింది గుర్తుకు వచ్చి కారు ఆపమని చెప్తుంది. ఎందుకని రాథోడ్‌ అడగ్గానే తాయెత్తు చూపిస్తుంది. మనోహరి ఆంటీ ఇది కట్టమని చెప్పింది నేను మర్చిపోయాను అంటుంది అంజు. సాయంత్రం కడుదువులే రాథోడ్‌ వెళ్దాం పద అంటుంది అమ్ము. అంజు అది కాదు రాథోడ్‌ అని కారు దిగి పోతుంది. మీరు వెళ్లండి నేను వెళ్తాను అంటుంది. రాథోడ్‌ కూడా కారు దిగి అంజును పిలుస్తాడు. అయినా ఆగకుండా వెళ్లిపోతుంది.

ఒక్కరోజు ఏం చేయకు

అంజు తాయోత్తు తీసుకుని ఇంటికి వెళ్తుంది. బాలిక నువ్వు పెద్ద తప్పు చేయబోతున్నావు. నీవు పెద్ద ప్రమాదంలో పడిపోతున్నావు. నా మాట వినుము బాలిక. ఆగుము బాలిక. ఈ ఒక్కమారు నా మాట వినుము అని బతిమాలతాడు గుప్త. విని మళ్లీ మోసపోలేను గుప్తగారు అంటుంది అరుంధతి. బాలిక ఈసారి నేను నీకు నిజం చెప్తున్నాను. ఈ ఒక్క రోజు ఏమీ చేయకు అంటాడు గుప్త.

మీరు ఏ క్షణమైనా నన్ను తీసుకెళ్లిపోతారని నాకు అర్థం అయింది గుప్తగారు అంటున్న అరుంధితో నీవు ఏ నిజం తెలుసుకున్నా ఎంత ప్రయత్నించినా జరగబోయేది ఆపలేవు. జరగాల్సింది మార్చలేవు అంటాడు గుప్త. అవునా సరే అంటూ కారు తీసుకుని వెళ్లిపోతుంది. ఇంతలో అంజు పరుగెత్తుకొస్తుంది. నేను ఈవిడ కోసం వస్తే ఈవిడేంటి పట్టించుకోకుండా పోతుంది అనుకుంటుంది అంజు.

ఇంతలో గుప్త వచ్చి తాయత్తు చూసి భయపడతాడు. ఇంతలో యముడు వచ్చి గుప్తను తిడతాడు. నీకు ఏమి చెప్తే ఏమీ చేస్తున్నావు అంటాడు. మరోవైపు అమర్‌ బాధగా ఉంటాడు టిఫిన్‌ చేయకుండా ఆలోచిస్తుంటాడు. మనోహరిని చూసిన రణ్​వీర్​ ఏం చేస్తాడు? రణ్​వీర్​ని కలిసిన అరుంధతి ఏం తెలుసుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 01న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!