NNS October 3rd Episode: ఘోరాను చితక్కొట్టిన అమర్- అరుంధతి సేఫ్- సంతోషంలో మనోహరి- భాగీకి డౌట్- విధికి ఎదురెళ్తున్న ఆరు
Nindu Noorella Saavasam October 3rd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌లో ఘోరా దగ్గరకు స్పీడ్‌గా మనోహరి వెళ్లడం చూసిన అమర్ ఫాలో అవుతాడు. ఘోరా దగ్గరకు వెళ్లిన అమర్ అతన్ని చితక్కొడతాడు. దాంతో ఘోరా పారిపోతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్ (NNS 3rd October Episode)లో అంజు తాయత్తు కట్టగానే మనోహరి లేచి బయటకు వెళ్లిపోతుంది. మనోహరి అలా వెళ్లిందేంటి అని శివరామ్ అడుగుతాడు. ఏంటోనండి ప్రతి పౌర్ణమికి ఏదో జరుగుతుంది అంటుంది నిర్మల.
ఘోరా దగ్గరికి అమర్
మరోవైపు భాగీకి తన పెళ్లి జరిగిన విషయం. అమ్ము మాట్లాడిన విషయం గుర్తుకు వస్తుంది. టెన్షన్ పడుతుంది. మనోహరి కారులో వెళ్తుంటే అమర్ చూసి మనోహరి ఏంటి అంత స్పీడ్‌గా వెళ్తుంది అని ఫాలో అవుతాడు. మనోహరి కారు దిగి ఘోరా దగ్గరకు ఆత్మ వచ్చింది అని దేవకు చెప్పి.. ఆత్మ కూర్చో అని ఘోరా అనగానే అరుంధతి కూర్చుంటుంది. మరోవైపు అమర్ కూడా ఘోర ఉన్న దగ్గరకు వస్తాడు.
అక్కడ మనోహరిని చూసి కోపంగా ఘోరాను కొడతాడు అమర్. ఇంతలో ఘోరా తప్పించుకుని పారిపోతాడు. మనోహరిని అమర్ తిడుతుంటే చేతికి ఉన్న తాయత్తు ఊడిపోతుంది. మరోవైపు అరుంధతి గార్డెన్‌లో కూర్చుని రణవీర్ మాటలు గుర్తు చేసుకుంటుంది. మనోహరి తన రూంలో పడుకుని ఉంటుంది. చుట్టు అందరూ ఉంటారు.
బహు చక్కగా మా నరక నగర సొగసుల మధ్య జలపాతముల వద్దకు వెళ్లి జలకాళాటలలో అంటూ పాటలు పాడుకుంటూ ఉండాల్సిన నేను నా కెందుకు ఈ గోల. అసలు ఈ పరిస్థితి ఆ శత్రువుకు కూడా రాకూడదు. ఈ సైనిక దళం మొత్తం ఆ బాలిక మేల్కోనుటకు నా వలే వేచి చూస్తున్నారు అనుకుంటాడు గుప్త. అసలు మన చుట్టు ఏం జరుగుతుంది అమర్. నాకేమీ అర్థం కావడం లేదు అంటుంది నిర్మల.
బాలిక పసిగట్టెలా ఉంది
అవును అమర్. అరుంధతిని చంపిన వాడు మళ్లీ మన చుట్టు ఎందుకు తిరుగుతున్నాడు. ఈ మంత్రాలు తంత్రాలు చేసుకునే వాడు మన కుటుంబంలోని మనుషులనే ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటాడు శివరామ్. మొన్నేమో అమ్మును ఇలానే ఎత్తుకెళ్లి ఏదో పూజ చేయబోయాడు. ఇవాళేమో మనోహరితో ఏదో పూజ చేస్తున్నాడని చెప్పావు. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నాన్నా అంటాడు అమర్.
పోనీ డబ్బుల కొరకు చేస్తున్నాడు అనుకుంటే ఇలాంటి వాళ్లకు డబ్బుల మీద ఆశ ఉండదు అమర్ అని శివరామ్ అంటాడు. మామయ్యగారు అంటే వాడు దేనికోసమో మన ఇంటికి వస్తున్నాడు అంటున్నారా? అతనికి కావాల్సింది ఈ ఇంట్లో ఏదైనా ఉండి ఉంటుందా? అందుకోసమే ఇన్నిసార్లు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడా? అంటుంది భాగీ. ఈ బాలిక ఆత్మ గురించి పసిగట్టేలా ఉంది అనుకుంటాడు గుప్త.
వాడికి ఈ ఇంటి నుంచి ఏం కావాలి. ఎందుకు మళ్లీ మళ్లీ వస్తున్నాడు అంటుంది భాగీ. చావు చూసి కన్నీళ్లు మిగిలిన ఇల్లు మిస్సమ్మ. వాడికి ఇక్కడేం ఉంటుంది అని అమర్ అనగానే ఇంతలో మనోహరి ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. బాలిక నేను ఇచట ఉన్నాను అంటాడు గుప్త. మనోహరి పలకదు. అరుంధతి ఇక్కడ లేదని గుప్త వెళ్లిపోతాడు.
విధికి ఎదురెళ్తున్న ఆరు
ఏం జరిగింది మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు? అని అడుగుతుంది మనోహరి. దీంతో జరిగిందంతా అమర్ చెప్తాడు. దీంతో మనోహరి సంతోషంగా ఘోర, అరుంధతిని బంధించాడనుకుంటా అని మనసులో అనుకుంటుంది. గార్డెన్‌లో ఏడుస్తూ కూర్చున్న అరుంధతిని చూసి తాను తెలుసుకున్న నిజమే తనను బాధిస్తుంది అనుకుంటాడు.
దగ్గరకు వెళ్లిన గుప్తకు అంజు, మనోహరి కూతురు అంటే నమ్మలేకపోతున్నాను అంటుంది అరుంధతి. అంజలి వాళ్ల కూతురు అన్న నిజం ఎవ్వరికీ తెలియకుండా చేయాలని డిసైడ్ అవుతుంది. మళ్లీ విధికి ఎదురు వెళ్తున్నావు అని హెచ్చరిస్తాడు గుప్త. అంజుని కాపాడటానికి అరుంధతి ఏం చేయబోతుంది? ఆత్మ రహస్యాన్ని భాగీ కనిపెడుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్ 03న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్