NNS September 21st Episode: మనోహరికి తాయత్తు కట్టిన ఘోరా.. చూసేందుకు వెళ్లిన రాథోడ్.. అమర్‌కు అనుమానం
Nindu Noorella Saavasam September 21st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్‌లో ఘోరా దగ్గరున్న మనోహరి తాయత్తు కట్టించుకుంటుంది. మనోహరి కారు చూసిన అమర్ తనకు కాల్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావని అమర్ అడిగితే.. మనోహరి అబద్ధం చెబుతుంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 21st September Episode) అమర్ గురించి తలుచుకుంటూ మురిసిపోతూ భాగీ కిందకు వస్తుంటే నిర్మల వచ్చి పిలుస్తుంది. అక్కడికి అరుంధతి కూడా వస్తుంది. అయ్యోయ్యో ఇన్ని మెలికలు తిరుగుతుందంటే వారిద్దరి మధ్య ఏదో జరిగే ఉంటుంది అనుకుంటుంది అరుంధతి.
పరధ్యానంలో ఉన్నా
అమ్మాయికి ఏమైందండి పిలుస్తున్నా పలకడం లేదు అంటుంది నిర్మల. అందులో ఏముందనే అమ్మాయి ప్లేటులో వేస్తుంది అంటాడు శివరామ్. ఏమోనండి నాకు ఏమీ తెలియడం లేదు అంటుంది నిర్మల. ఎప్పుడూ ఈ గవాక్షం దగ్గరకు వచ్చి అక్కడ ఏమి జరుగుతుందో చూడటమేనా బాలికా..? అంటాడు గుప్త. ఇంతలో శివరామ్ వచ్చి భాగీని గట్టిగా పిలవగానే తేరుకుని ఏదో పరధాన్యంలో ఉన్నాను అంటుంది.
ఏంటో చెప్పండి అత్తయ్యా అనగానే పౌర్ణమి వస్తుంది కదా? నువ్వు అమర్ గుడికి వెళ్లి పూజ చేస్తారని.. అంటుంది నిర్మల. తర్వాత పౌర్ణమి నాడు ఏమీ జరుగుతుంది అని గుప్తను అరుంధతి అడుగుతుంది. ఏమీ జరుగుతుంది. నీకు శక్తులు వస్తాయి. అని గుప్త చెప్పగానే ఈ పౌర్ణమికి ఏదో గందరగోళం జరగబోతుంది అనిపిస్తుంది. కానీ, ఏం జరగబోతుందో తెలియడం లేదు అంటుంది అరుంధతి.
రాథోడ్, అమర్ కారులో వెళ్తుంటారు. అమర్ డల్లుగా ఉండటాన్ని చూసిన రాథోడ్ ఏమైంది సార్ అని అడుగుతాడు. అంజు తల్లిదండ్రుల గురించి కనుక్కోవాలి అని అమర్ చెప్పగానే రాథోడ్ షాకింగ్‌గా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు సార్. కోరి మీరు సమస్యను తెచ్చుకుంటుంన్నారేమో అనిపిస్తుంది. అంజు పాప తట్టుకోలేదు అంటూ చెప్తాడు రాథోడ్. ఇంతలో రోడ్డు పక్కన మనోహరి కారు చూస్తాడు అమర్.
ఊరికే అడిగాను
మనోహరి ఘోర దగ్గర పూజలో ఉంటుంది. అమర్, మనోహరికి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. నేను నా ఫ్రెండును కలవడానికి కాఫీ షాపుకు వచ్చాను. ఎందుకు అమర్ అంటుంది మనోహరి. ఏం లేదు ఊరికే అడిగాను. సరే బాయ్ అంటాడు అమర్. ఏమైంది మనోహరి సమస్య ఏంటి ఎందుకు సతమతమవుతున్నావు అని అడుగుతాడు ఘోరా.
అమర్ సడెన్‌గా కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగాడు. ఎప్పుడూ ఇలా అడగలేదు. తెలుసుకోవడానికి అడిగాడో.. కనుక్కోవడానికి అడిగాడో నాకు అర్థం కావడం లేదు ఘోరా అంటుంది మనోహరి. తెలుసుకోవడానికి అడిగాడేమో..? అంటాడు ఘోరా. లేదు ఘోరా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అమర్ గురించి నాకు బాగా తెలుసు. కచ్చితంగా తెలుసుకోవడానికైతే కాదు. నేను ఎక్కడున్నానో తనకు ఎలా తెలుస్తుంది. నేను ఇక్కడకు వస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు కదా? అంటుంది మనోహరి.
మనోహరి కారు ఇక్కడ ఉంది. తనేమో ఫ్రెండును కలవడానికి కేఫ్‌కు వెళ్లానని చెప్పింది. కారు ఇక్కడ పెట్టి వెళ్లిందా? లేదా అబద్దం చెప్తుందా? అంటాడు అమర్. డౌటుగా ఉండటమెందుకు సార్. లోపలికి వెళ్లి చూస్తే సరిపోతుంది కదా? అంటూ కారు దిగి ఇంట్లోకి రాథోడ్ వెళ్తుంటాడు. లోపల ఘోరా మనోహరికి తాయెత్తు కడతాడు. ఇంతలో రాథోడ్‌కు అమర్ ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. రాథోడ్ ఫోన్ సౌండ్ విని బయటకు వచ్చి చూస్తారు ఘోరా, మనోహరి.
తట్టుకుని నిలబడాలని
రాథోడ్, అమర్ వెళ్లిపోతారు. పిల్లలు గార్డెన్లో ఆడుకుంటుంటారు. అరుంధతి చూసి హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత అంజు కన్నవాళ్ల గురించి నిజం నీకు తెలిసిన రోజు నువ్వు తట్టుకుని నిలబడాలని దేవుడిని కోరుకుంటున్నాను అనుకుంటుంది. బాలికా నీ పిల్ల పిచ్చుకలు ఎప్పుడూ ఇలా ఆటలు ఆడటమేనా? చదువు మీద ధ్యాస పెడతారా? అంటాడు గుప్త.
అంతటి ఆనందాన్ని, నిలువెత్తు బంగారాన్ని ఎలా వదులుకోవాలనుకున్నారు. అంజు లేని జీవితం ఊహించుకోవడమే బాధగా ఉంది. ఎవరూ మోసం చేసినా తట్టుకోగలం కానీ కన్నతల్లి మోసం చేసిందంటేనే తట్టుకోలేం అంటూ అరుంధతి ఎమోషనల్ అవుతుంది. అంజలి కన్నవాళ్లను కనిపెట్టమని నేను డైరీలో రాశాను. మా ఆయన చదివారు. ఆయన కచ్చితంగా కనిపెడతారు అంటుంది ఆరు.
నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అంటాడు గుప్త. అయితే నీకు నిజం తెలుసు కదా గుప్త గారు ఎవరో చెప్పండి అని అడుగుతుంది. దీంతో నిజం తెలిసే టైం వచ్చినప్పుడే తెలుస్తుందని చెప్తాడు గుప్త. పౌర్ణమినాడు మనోహరిలో అరుంధతి ప్రవేశిస్తుందా? రణ్వీర్ దుర్గ కోసం ఎందుకు వెతుకుతున్నాడు? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!