Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 11th September Episode) అంజుని కొట్టబోయిన మనోహరిని ఆపుతాడు రణ్‌వీర్. థాంక్స్ చెప్పిన అంజుకి షేక్ హ్యాండ్ ఇవ్వగానే రణవీర్‌కు తన కూతురు గుర్తుకు వస్తుంది. నిన్ను చూస్తుంటే నా దుర్గను చూస్తున్నట్లు ఉందమ్మా అని రణవీర్ చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది.
తను ఇప్పుడు ఎక్కుడుంది. తన ఫోటో ఉందా? మీ దగ్గర అని అంజు అడగడంతో మనోహరి ఇంకా టెన్షన్ పడుతుంది. ఇంతలో మీ అమ్మాయి కూడా మాలాగే తల్లి లేకుండా పెరుగుతుందా? అని అంజు అడగ్గానే మీ అమ్మతో నా భార్యను పోల్చోద్దని, మీ అమ్మా చాలా మంచిదని, నా భార్య అలాంటిది కాదని చెప్తాడు రణవీర్. దీంతో పిల్లలు అందరూ కలిసి రణవీర్‌ను లోపలికి తీసుకెళ్తారు.
అమర్ నీకోసం రణవీర్ గారు వచ్చారు అని చెబుతాడు శివరామ్. ఆ వస్తున్నా నాన్నా.. అంటూ వచ్చిన అమర్‌ని చూసి నమస్తే అమరేంద్ర గారు అంటాడు రణ్‌వీర్. నమస్తే రణవీర్ గారు అని అమర్ విష్ చేయగానే ఇలా మళ్లీ మళ్లీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లున్నాను. పక్కనే వేరే పని ఉండి వచ్చాను. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అంటాడు రణ్‌వీర్.
ఇబ్బందేం లేదు రణవీర్ అని అంటాడు అమర్. ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను కదా సార్ ఇక్కడికి వస్తే నా వాళ్లను చూసినట్టే ఉంటుంది. అందుకే కారణం దొరకగానే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అంటాడు రణ్‌వీర్. నీ భార్య ఇంకా దొరకలేదా? బాబు అని అడుగుతుంది నిర్మల. లేదమ్మా.. రోజులు గడిచే కొద్దీ నాకు కావాల్సింది నాకు దొరుకుతుందన్న నమ్మకం చచ్చిపోతుంది అంటూ రణవీర్ ఎమోషనల్‌గా ఫీలవుతుంటాడు.
దీంతో రణవీర్‌ను భాగమతి ఓదారుస్తుంది. రణవీర్‌ను మీది కోల్‌కతా అన్నారు కదా? అక్కడ మథర్ థెరిస్సా ఆశ్రమం గురించి తెలుసా? అని అమర్ అడగ్గానే రణవీర్ తెలుసని ఆ ఆశ్రమానికి ప్రతి సంవత్సరం డొనేట్ చేస్తుంటాను అంటాడు. దీంతో అమర్ మౌనంగా ఉండిపోతాడు. అమర్, రణవీర్‌తో పర్సనల్‌గా మాట్లాడాలని బయటకు వెళ్తాడు. అమరేంద్రజీ చెప్పండి అంటాడు రణ్‌వీర్.
నాకు కోల్‌కత్తాలో ఒక చిన్న పని ఉంది రణవీర్ అది చాలా ముఖ్యమైనది అంటాడు అమర్. చెప్పండి జీ అక్కడ మన వాళ్లు ఉన్నారు అంటున్న రణ్‌వీర్‌తో ఒకరి గురించి సమాచారం తెలుసుకోవాలి అంటాడు అమర్. పైనుంచి వాళ్లిద్దరి మాటలు చాటుగా వింటున్న మనోహరి టెన్షన్ పడుతుంది. అమర్ నా గురించే అడగబోతున్నాడా? అని భయపడుతుంది.
చెప్పండి సాయంత్రం కల్లా కనుక్కుని చెప్తాను అంటాడు రణ్‌వీర్. అయితే మీరు మీ పనిలో ఉన్నారు. అక్కడి ఎవరితోనైనా నాకు కనెక్ట్ చేయండి అని అమర్ అడగ్గానే రణవీర్ సరే అంటాడు. తర్వాత వెళ్లబోతూ.. అంజును పిలిచి డబ్బులు ఇచ్చి హగ్ చేసుకుని వెళ్లిపోతాడు రణ్‌వీర్. బయటకు వెళ్లిన రణవీర్ ఎమోషనల్ అవుతుంటాడు. ఏమైంది రణవీర్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు లాయర్.
ఆ పాపను చూస్తుంటే నా దుర్గ గుర్తుకు వస్తుంది. నా దుర్గను నాకు దూరం చేసిన ఆ మనోహరిని వదిలిపెట్టను అంటూ ఆవేశంగా వెళ్లిపోతాడు రణ్‌వీర్. అమర్ రాసిన డైరీ గురించి అరుంధతి ఆలోచిస్తుంది. ఇంతలో గుప్త రాగానే నా కన్నవాళ్ల గురించి తెలుసుకోవాలి. మిస్సమ్మ అక్క గురించి తెలుసుకోవాలి. అంజు కన్నవాళ్ల గురించి తెలుసుకోవాలని అంటుంది అరుంధతి.
దీంతో ఫ్లోలో గుప్త ఒక్కటి తెలిస్తే అన్ని తెలిసినట్లే అంటాడు. దీంతో అరుంధతి ఏమన్నారు అని అడగ్గానే తేరుకున్న గుప్త నేనేమీ అనలేదు అంటాడు. ఇంతలో అరుంధతి కిచెన్‌లోకి వెళ్లి కిచెన్‌లో ఇవన్నీ ఎవరు సర్దారు అని అడుగుతుంది. దీంతో భాగీ నువ్వు ఇంటి కోడలిగా మాట్లాడుతున్నావేటి? అని అడగ్గానే అరుంధతి తేరుకుని మాట మారుస్తుంది.
నీ కూరలు బాగా స్మెల్ వస్తున్నాయని అని భాగీని మాటల్లో పెట్టి అరుంధతి గురించి మీ ఆయన తెలుసుకున్నారా? అని అడుగుతుంది. అరుంధతి ఎవరో భాగీకి తెలిసిపోతుందా? రణ్‌వీర్ ద్వారా అమర్ మనోహరి గతం తెలుసుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!