NNS September 17th Episode: ఇంట్లోకి బాంబ్ తీసుకొచ్చిన మనోహరి.. దీపాల వేడికి పేలేలా ప్లాన్.. అంజు అతిథిగా రణ్​వీర్​​!-nindu noorella saavasam serial september 17th episode manohari brings bomb idol nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 17th Episode: ఇంట్లోకి బాంబ్ తీసుకొచ్చిన మనోహరి.. దీపాల వేడికి పేలేలా ప్లాన్.. అంజు అతిథిగా రణ్​వీర్​​!

NNS September 17th Episode: ఇంట్లోకి బాంబ్ తీసుకొచ్చిన మనోహరి.. దీపాల వేడికి పేలేలా ప్లాన్.. అంజు అతిథిగా రణ్​వీర్​​!

Sanjiv Kumar HT Telugu
Sep 17, 2024 09:35 AM IST

Nindu Noorella Saavasam September 17th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌‌లో అమర్ విగ్రహం తీసుకొస్తానని వెళ్తుంటే.. తనను వద్దని మనోహరి వెళ్తుంది. తీవ్రవాదులు బాంబ్ పెట్టిన విగ్రహాన్ని మనోహరి ఇంటికి తీసుకొస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 17th September Episode) అమర్​ అంజు మెడలో దుర్గ లాకెట్​ ఉన్న గొలుసు వేస్తాడు. తను అందరినీ కాపాడింది కాబట్టే తనకు బహుమతిగా డాడీ గొలుసు వేశారని సంబరపడిపోతుంది అంజు.

ఫొటో చూసుకుని

మనోహరి లోపలికి రాగానే అంజు మా డాడీ లాకెట్‌ గిఫ్ట్‌‌గా ఇచ్చారని చూడండి అనగానే ఏమీ వద్దులే అంజు. అమర్‌ సెలెక్షన్‌ బాగానే ఉంటుందని చెప్తుంది. తర్వాత అమర్‌ విగ్రహం తీసుకురావడానికి మార్కెట్‌‌కు వెళ్లిపోతాడు. మరోవైపు అమర్‌ ఇంటికి రావడానికి రణవీర్‌ రెడీ అవుతాడు. తన కూతురు ఫోటో చూసుకుని ఎమోషనల్‌‌గా ఫీలవుతాడు.

మరోవైపు బయట అమర్‌ కారు ఎక్కుతుంటే మనోహరి వెళ్లి మనకు థ్రెట్‌ ఉందని నాకు తెలుసు. అందుకే నేను మార్కెట్‌‌కు వెళ్లి విగ్రహం తీసుకొస్తాను అంటుంది. విగ్రహం తీసుకురావడానికి తాను వెళ్తానని మనోహరి చెప్పడంతో వద్దని నేనే వెళ్తానని అమర్‌ చెబుతాడు. కానీ, నువ్వు ఇక్కడ ఉంటేనే మంచిది. ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా జరగొచ్చు అని మనోహరి చెప్పడంతో అమర్‌ సరేనని రాథోడ్‌ను పంపిస్తానని అంటాడు.

రాథోడ్‌ ను చూస్తే వాళ్లు గుర్తుపడతారని మనోహరి చెప్పడంతో అమర్‌ సరే అంటాడు. ప్రాణం అంటే తీపి ఉన్న మను ఎందుకు ఈ ప్లాన్‌ చేస్తుందని అరుంధతి అనుకుంటుంది. తర్వాత రణవీర్‌ రావడంతో బయటే సెక్యూరిటీ వాళ్లు ఆపేస్తారు. అది చూసిన భాగీ, అమర్‌‌కు చెప్తుంది. అవునా అతను ఇప్పుడెందుకు వచ్చాడు. సరే వెళ్దాం పద అంటూ ఇద్దరూ కలిసి గేట్​ దగ్గరకు వెళ్తారు. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు.

అంజలి పాప కాల్ చేసింది

మను ఏమైనా చేసిందా? అది అంత నంగనాచి మాటలు మాట్లాడినప్పుడే అనుకున్నా అదేదో చేస్తుందని.. ఇదేంటి కారు తీసుకెళ్లకుండా గేటు దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు అనుకుంటుంది అరుంధతి.

హలో రణవీర్‌.. వచ్చి వెళ్లిపోతున్నారు అని పిలుస్తాడు అమర్​. నిన్న అంజలి పాప కాల్ చేసి ఇంట్లో పూజ ఉంది. తప్పకుండా రమ్మంది. ఇక్కడికి వస్తే మిలటరీ వాళ్లు అలో లేదన్నారు. అందుకే వెళ్లిపోతున్నాను అంటాడు రణ్​వీర్​.

అంజు పాప రమ్మని చెప్పిందా? అంటుంది భాగీ. అవునండి వచ్చి ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. కానీ, రాకుంటే అంజలి పాప బాధపడుతుందని వచ్చాను. ఇక్కడ పరిస్థితి చూశాక రావడం కరెక్టు కాదనిపించింది. నేను వచ్చి వెళ్లానని అంజలికి చెప్పండి అని రణవీర్‌ చెప్పి వెళ్లిపోతుంటే అమర్‌, భాగీ రణవీర్‌ను లోపలికి తీసుకెళ్తారు. బయటకు వెళ్లిన మనోహరి, బాబ్జికి ఫోన్‌ చేస్తుంది.

దుర్గను నేను అంటూ డీటెయిల్స్‌ చెప్పబోతుంటే బాబ్జీ ఫోన్‌ స్విచ్చాప్‌ అవుతుంది. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌‌గా ఫీలవుతుంది. లోపలికి వెళ్లిన రణవీర్‌‌ను చూసి అంజు హ్యాపీగా ఫీలవుతూ విషెస్‌ చెప్తుంది. అంజు ఏంటి మనోహరి భర్తను చూసి ఇంత ఆనంద పడుతుంది. ఇంత దగ్గర అవుతుందేంటి? అనుకుంటుంది అరుంధతి. అంకుల్‌ మీ డ్రెస్‌ చాలా బాగుంది అంటుంది అంజు. నీ డ్రెస్‌ కూడా చాలా బాగుంది అంటాడు రణ్​వీర్​.

బాబ్జీని తిట్టి

అంజు పాప అందరితో ఇట్టే కలిసిపోతుంది అంటుంది భాగీ. ఇంట్లో ముఖ్యమైన వాళ్లు లేనట్టు ఉంది అంటాడు రణ్​వీర్​. ఎవరు అని అందరూ క్వశ్చన్‌ మార్కు ఫేస్‌ పెట్టడంతో మనోహరి గారు అంటాడు. అమర్‌ వెళ్లి జామర్‌ ఆఫ్‌ చేయమని చెప్పి మనోహరికి ఫోన్‌ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. మనోహరి సరేనని చెప్పి బాబ్జీని తిట్టి కారులో వెళ్లిపోతుంది. అరవింద్​, మనోహరి కారును ఫాలో చేస్తాడు.

ఒక దగ్గర కారు ఆపిన మనోహరి దగ్గరకు వినాయక విగ్రహం తీసుకుని వచ్చి అమర్‌ సార్‌ చెప్పారని విగ్రహం ఇచ్చి మనోహరిని మళ్లీ ఫాలో చేస్తారు. మనం బాంబు పెట్టిన పీట ఇంటి దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు అంటాడు అరవింద్​. ఇంటి వరకు రావడం ఈజీయే అన్నా. కానీ సెక్యూరిటీని దాటుకుని ఇంట్లోకి వెళ్లడం కష్టమే కదా? వాళ్లకు కానీ దొరికితే అని భయపడతాడు అతని వెంట వచ్చిన వ్యక్తి.

దొరకదు. వాళ్ల మిషన్‌‌కు మ్యాచ్‌ అవకుండా బాంబును సెట్‌ చేశాను అని చెప్తాడు. అరవింద్‌ చెప్పినట్లు మిలటరీ వాళ్లు చెక్ చేసినా బాంబు దొరకదు. దీంతో విగ్రహం తీసుకుని మనోహరి లోపలికి వెళ్తుంది. అందరూ సంతోషంగా విగ్రహం తీసుకెళ్లి పూజా మందిరంలో పెడతారు. బయటి నుంచి అరవింద్‌ రిమోట్‌ ఆన్‌ చేస్తాడు. బాంబు పేలదు. దీంతో జామర్లు ఆన్‌ చేశారు.

దీపాల హీట్‌కు పేలేలా

అందుకే పేలలేదు అని ఇది ఫెయిల్‌ అయినా దీపాలు వెలిగిస్తే వచ్చే హీట్‌‌కు బాంబు పేలేటట్లు సెట్‌ చేశాను అంటాడు అరవింద్‌. దీపాల వేడికి బాంబ్​ పేలుతుందా? పూజకు వచ్చిన రణ్​వీర్​ని చూసి మనోహరి ఏం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్​ 18న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!