NNS September 10th Episode: రణ్​వీర్​ ఇంట్లో మనోహరి.. అమర్‌ను హగ్ చేసుకున్న అరుంధతి.. భాగీకి సారీ.. తప్పించుకున్న ఆత్మ-nindu noorella saavasam serial september 10th episode arundhathi hug to amar nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 10th Episode: రణ్​వీర్​ ఇంట్లో మనోహరి.. అమర్‌ను హగ్ చేసుకున్న అరుంధతి.. భాగీకి సారీ.. తప్పించుకున్న ఆత్మ

NNS September 10th Episode: రణ్​వీర్​ ఇంట్లో మనోహరి.. అమర్‌ను హగ్ చేసుకున్న అరుంధతి.. భాగీకి సారీ.. తప్పించుకున్న ఆత్మ

Sanjiv Kumar HT Telugu
Sep 10, 2024 11:35 AM IST

Nindu Noorella Saavasam September 10th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌‌లోను రణ్‌వీర్ ఇంట్లోకి మనోహరి వెళ్తుంది. తన కూతురుని ఎక్కడ వదిలేసానో చెబితే నువ్ కనుక్కోగలవ్, రణ్‌వీర్‌ను పంపించేయగలవు అని బాబ్జీతో అంటుంది మనోహరి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 10th September Episode) అంజు దత్తత సర్టిఫికెట్​ బయటకు తీసినందుకు అమర్​ కోప్పడటంతో భాగీ ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. రాథోడ్‌ వచ్చి పలకరించినా పలకదు. దీంతో రాథోడ్‌ తట్టి ఏమైందని అడుగుతాడు. దత్తత సర్టిఫికెట్‌ గురించి భాగీ చెప్పగానే రాథోడ్‌ టెన్షన్‌ పడుతుంటాడు.

ఎక్కువగా ఆలోచిస్తున్నావ్

సార్‌ రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే అంజలి గురించి నిజం అందరికీ తెలిసిపోయేదని అనుకుంటాడు రాథోడ్. ఇంతకీ ఇవాళ కూడా అనుకోకుండా అనాథ శరణాలయానికి ఎందుకు తీసుకెళ్లారు. నాకెందుకో ఆయన ఏదో దాస్తున్నట్లున్నారు అని భాగీ అడగ్గానే నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు వెళ్లి పడుకో అని రాథోడ్‌ చెప్తాడు. దాంతో మిస్సమ్మ వెళ్లిపోతుంది.

బాబ్జీతో కలిసి రణ్‌వీర్ ఇంటికి వెళ్లిన మనోహరి కూతురు కోసం బాధపడుతున్న రణ్‌వీర్‌ను చూస్తుంది. ఏంటి మేడం మీకో కూతురు ఉందా అని అడుగుతాడు బాబ్జి. ఉండేది అంటుంది మనోహరి. వదిలేసి వచ్చారా? మేడం అనగానే వదిలించుకుని వచ్చేశా.. అంటుంది. మేడం మనిషి ప్రాణం తీసేంత క్రూరత్వం ఉంటే అవసరం అనుకున్నాను. కానీ, తల్లి అయ్యి ఉండి నెలల బిడ్డను వదిలించుకుని వచ్చానని కొంచెం కూడా పశ్చాతాపం లేదు మీకు అంటాడు బాబ్జి.

అరుంధతి ప్రాణం తీసి నువ్వు కూడా పిల్లలకు తల్లిని దూరం చేశావు. నువ్వు నేను మంచి గురించి మనుసు గురించి మాట్లాడుకోకూడదు బాబ్జీ అని మనోహరి అంటుంది. బాబ్జీ నాది అవసరం మేడం అంటే నాది పంతం, పగ అందుకే ఇలా చేశాను. రాజు ప్రాణం చిలకలో ఉన్నట్లు నా ప్రాణాలు ఆ బిడ్డలో ఉన్నాయి రణ్‌వీర్‌. అదెక్కడ ఉందో నాకు తెలియదు. కానీ, ఎక్కడ వదిలేశానో చెబితే నువ్వు ఎలాగైనా పట్టుకుంటావు అని రణవీర్‌ను హైదరాబాద్‌‌లో లేకుండా చేయమని బాబ్జీకి చెప్తుంది మనోహరి.

నిజాన్ని నాలోనే దాచుకుంటాను

లోపల పడుకున్న రణవీర్‌ నిద్రలో కూడా కూతురుని తలుచుకుంటూ ఉంటాడు. మరోవైపు మిస్సమ్మ లేని టైం చూసి అరుంధతి అమర్‌ రూంలోకి వెళ్తుంది. అమర్‌ డైరీ రాస్తుంటాడు. అందులో అరుంధతి గతం గురించి కన్నవాళ్ల గురించి తెలుసుకున్నట్లు డైరీలో రాస్తుంటాడు. అయితే అందరికీ కన్నీళ్లను మిగిల్చే ఆ చేదు నిజాన్ని నాలోనే దాచుకుంటాను అని రాయడంతో అరుంధతి భాదపడుతుంది.

నా కన్నవాళ్ల గురించి నాకు తెలుసుకోవాలని ఉందండి. కానీ, దాని వల్ల మీరు బాధపడుతుంటే నాకు చాలా భయంగా ఉందండి అంటుంది అరుంధతి. అంజలి నా కూతురు కాదని ప్రపంచానికి, అంజలికి చెప్పే ధైర్యం నాకు ఉందో లేదో తెలియడం లేదు అరుంధతి. కానీ, తను నా కూతురు. తన కన్నవాళ్లను కనిపెట్టి తనను దూరం చేసుకోలేను. అలా అని అంజలికి నిజం దాచిపెట్టి నేను తప్పు చేయలేను అంటూ అమర్‌ ఏడుస్తేంటే అరుంధతి వెళ్లి హగ్‌ చేసుకుంటుంది.

అమర్‌ కూడా తనను ఎవరో తాకినట్లు ఫీలవుతాడు. ఇంతలో మిస్సమ్మ పైకి వచ్చి ఏడుస్తున్న అమర్‌‌ను చూస్తుంది. అప్పటికే మిస్సమ్మ అలికిడి విన్న అరుంధతి తలుపు చాటున దాక్కుంటుంది. మిస్సమ్మ చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ నిన్న ఏదో అరిచాను సారీ అంటాడు అమర్. లేదండి నేనే మీకు సారీ చెప్పాలి. మీ పర్మిషన్‌ లేకుండా ముట్టుకున్నాను. ఇంకోసారి మీ పర్మిషన్‌ లేకుండా ముట్టుకోనండి అంటుంది.

నీకు పూర్తి అధికారం ఉంది

ఈ రూమ్‌లో నీకు ఏం ముట్టుకోవడానికైనా.. ఈ ఇంట్లో నువ్వు ఏం చేయడానికైనా నీకు పూర్తిగా అధికారం ఉంది. కానీ, ఈ కప్‌బోర్డులో ఉన్నవన్నీ నా అరుంధతి జ్ఞాపకాలు. నాకు మిగిలినవి అవి మాత్రమే. ఏమీ అనుకోకు మిస్సమ్మ అంటాడు అమర్​. అయ్యో పర్లేదండి అక్క విషయంలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని భాగీ వెళ్లిపోతుంది. అమర్‌ డైరీ చూస్తూ ఉండిపోతాడు.

తర్వాత పిల్లలు అందరూ గార్డెన్‌‌లో క్రికెట్‌ అడుతుంటారు. బాల్‌ వెళ్లి మనోహరికి తాకుతుంది. అంజు వెళ్లి మనోహరిని బాల్‌ అడుగుతుంది. కోపంగా మనోహరి అంజును కొట్టబోతుంటే రణ్‌వీర్ వస్తాడు. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు మనమే చూసుకుని నడవాలి అని అంజుకు సారీ చెప్పిస్తాడు. దీంతో అంజు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి థాంక్స్‌ అని చెప్పగానే రణ్‌వీర్‌కు తన కూతురు గుర్తుకువస్తుంది.

నా కూతురుని చూసినట్లే

నిన్ను చూస్తుంటే నా దుర్గను చూస్తున్నట్లు ఉందమ్మా అని రణ్‌వీర్ చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. అంజు తన కూతురేనని రణ్​వీర్​కి తెలిసిపోతుందా? మనోహరి ఏం చేయబోతోంది? మిస్సమ్మకు నిజం తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్​ 11న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner