NNS September 5th Episode: పిక్నిక్​‌ చెడగొట్టబోయి కిందపడిపోయిన మనోహరి​.. అరుంధతికి గుప్త వార్నింగ్.. అడ్డుపడిన రాథోడ్-nindu noorella saavasam serial september 5th episode manohari fall down nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 5th Episode: పిక్నిక్​‌ చెడగొట్టబోయి కిందపడిపోయిన మనోహరి​.. అరుంధతికి గుప్త వార్నింగ్.. అడ్డుపడిన రాథోడ్

NNS September 5th Episode: పిక్నిక్​‌ చెడగొట్టబోయి కిందపడిపోయిన మనోహరి​.. అరుంధతికి గుప్త వార్నింగ్.. అడ్డుపడిన రాథోడ్

Sanjiv Kumar HT Telugu
Sep 05, 2024 12:24 PM IST

Nindu Noorella Saavasam September 5th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‌‌లో శివారమ్ కుటుంబం అంతా పిక్నిక్‌కు రెడీ అవుతుంది. మాయా దర్పణంలో భవిష్యత్ చూసిన గుప్తా భయపడతాడు. పిక్నిక్ వెళ్లకుండా ఆపమని ఆరును హెచ్చరిస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 5th September Episode) పిక్నిక్​లో ఏదో జరగబోతుందని అనుమానంతో ఒకసారి మాయ దర్పణంలో చూద్దామని గుప్త దర్పణం తీసుకుని చూసి షాక్‌ అవుతాడు. అలా జరిగితే కథ మొత్తం మొదటికి వస్తుందని బాధపడుతుంటాడు. ఇంతలో ఆరు వస్తుంది.

ఎంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూనే మాయా దర్పణం అంటూ తెరచి చూడబోతుంటే గుప్త గట్టిగా అరుస్తాడు. దీంతో అరుంధతి ఉలిక్కిపడుతుంది. అద్దంలో ఏం చూశారని అడుగుతుంది. మీ గురించి చూడటానికే ఉన్నానా? అనగానే మీ దొంగ చూపుల్లోనే ఏదో ఉంది. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా ప్రమాదం జరిగితే నేను నీతో మాట్లాడను అంటుంది.

ఆత్మగా ఉన్నన్ని రోజులు

నీవు వెంటనే వెళ్లి నీ కుటుంబం బయటకు వెళ్లకుండా ఆపు.. అంటాడు గుప్తా. ఎందుకు అని అడిగిన అరుంధతి ఇది ప్రశ్నలు అడిగే సమయం కాదు బాలిక. వెళ్లి త్వరగా వాళ్లను వెళ్లకుండా ఆపు.. అని హెచ్చరిస్తాడు గుప్తా. పాపం గుప్తగారు పిల్లలు పిక్నిక్‌ వెళ్లాలనుకుంటున్నారు అని అరుంధతి అనగానే ఈరోజు వాళ్లు బయటకు వెళితే ప్రమాదం. తర్వాత నువ్వు ఆత్మగా ఉన్నన్ని రోజులు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు గుప్త.

దాంతో అరుంధతి ఆలోచిస్తుంది. పిక్నిక్​ వెళ్లేందుకు అమర్‌ రెడీ అవుతుంటే మిస్సమ్మ తదేకంగా చూస్తుంది. అమర్‌ వెళ్లిపోతాడు. ఇంతలో అరుంధతి రూంలోకి వస్తుంది. వెంటనే మిస్సమ్మ వేసిన డోర్‌ వేసినట్టే ఉంది. మీరెలా లోపలికి వచ్చారేంటి అని డౌట్‌గా అడుగుతుంది. అయ్యో మిస్సమ్మకు ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడెలా? అనుకుంటుంది అరుంధతి.

డోర్ ఒక్కటే వేశావ్

నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? అంటుంది మిస్సమ్మ. ఏం లేదు మిస్సమ్మ ఏం లేదు.. అని కవర్​ చేసేందుకు ప్రయత్నిస్తుంది అరుంధతి. సరే ఇప్పుడు చెప్పండి ఎలా లోపలికి వచ్చారు..? అంటుంది మిస్సమ్మ. డోర్‌ లోంచి.. అనగానే అదే అక్కా వేసిన డోర్‌ లోంచి ఎలా వచ్చారు అని మిస్సమ్మ అడగ్గానే డోర్‌ ఒక్కటే వేశావు తీసుకుని వచ్చాను అంటుంది అరుంధతి.

దీంతో ఏంటో అక్కా ఆయన ఏదేదో చేస్తుంటే నేను ఏం చేస్తున్నానో మర్చిపోతున్నాను. అంటూ మెలికలు తిరిగుతుంది మిస్సమ్మ. దీంతో అరుంధతి షాక్ అయి తర్వాత పిక్నిక్‌‌కు వెళ్లకండి అని చెప్తుంది. ఎలాగైనా పిక్నిక్‌ క్యాన్సిల్‌ చేయాలని అరుంధతి ప్రయత్నిస్తుంది. కానీ, టైం అయిపోతుందని.. అరుంధతిని బయటకు పంపిస్తుంది మిస్సమ్మ. గుప్త దగ్గరకు అరుంధతి పరుగెడుతుంది.

మిస్సమ్మ పిక్నిక్‌‌‌కు అంతా రెడీ చేస్తుంటుంది. శివరాం, నిర్మల మోడ్రన్‌‌గా రెడీ అయి వస్తారు. వాళ్లను చూసిన రాథోడ్‌ షాక్‌ అవుతాడు. ఏయ్‌ రాథోడ్‌ ఏమైంది అంటాడు అమర్. ఏంటి సార్‌ ఆ గెటప్పులు.. అంటున్న రాథోడ్​తో మరి పిక్నిక్‌‌‌కు వెళ్తున్నాం కదా రాథోడ్‌ ఈ మాత్రం లేకపోతే ఎలా.. అందుకే ఇలా సెట్‌ చేశా అంటాడు శివరామ్.

ఏదో ఒకటి చేస్తుంది కదా

అమ్మో మీ ఆనందం కోసం ఎదుటోడి ప్రాణం పోయినా పర్వాలేదా? అంటాడు రాథోడ్​. ప్యాషన్ తెలియని బూచోడితో మాట్లాడటమే వేస్ట్‌.. ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి మా గెటప్స్‌ అంటాడు శివరామ్. మీరైనా ఈ పడుచు పిల్లాడికి చెప్పండి నాన్నా.. ఆయన వేసుకున్నదే కాకుండా నన్ను కూడా వేసుకోమని ఒకటే గొడవ. ఈయన గొడవ కంటే వేసుకోవడమే బెటర్‌ అనుకుని వేసుకున్నాను అంటుంది నిర్మల.

లేదు అత్తయ్యా మామయ్య చెప్పింది కరెక్టే.. అని భాగీ ఇద్దరినీ సమర్థిస్తుంది. గుప్త దగ్గరకు వెళ్లిన ఆరు.. మిస్సమ్మకు ఎంత చెప్పినా వినడం లేదని చెప్తుంది. దీంతో గుప్త కంగారుగా టెన్షన్‌ పడుతుంటే అసలు ఆ మాయా పెట్టెలో ఏముందని అడుగుతుంది. ఇంతలో గుప్త ఆ మనోహరి వీళ్లందరూ బయటకు వెళ్లకుండా ఏదో ఒకటి చేస్తుంది కదా? చూద్దాం అనుకుని కిటికి దగ్గరకు వెళ్తాడు గుప్త.

అడ్డుపడిన రాథోడ్

లోపల పిల్లలు పై నుంచి కిందకు వస్తుంటే మనోహరి వాళ్లను తోసేయ్యబోయి కింద పడుతుంది. దీంతో అమర్‌ పిక్నిక్‌ క్యాన్సిల్‌ అని మనోహరిని హాస్పిటల్‌‌కు తీసుకెళ్లబోతుంటే రాథోడ్‌ అడ్డుపడతాడు. మనోహరి ప్లాన్ ఏంటి? గతంలో ఏం జరిగింది? మనోహరి తన గొయ్యి తానే తీసుకుంటోందా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్​ 06న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!