NNS September 1st Episode: అమర్ చేతిలో ఆరు పంచె.. రాథోడ్ వెనక మిస్సమ్మ.. నిజం చెప్పేసిన అమర్.. షాక్‌లో అరుంధతి!
Nindu Noorella Saavasam September 1st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 1వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి పంచె పట్టుకుని అమర్ కుమిలిపోతాడు. ఆ పంచె చూసిన అరుంధతి మా ఆయనకు నా కన్నవాళ్లు ఎవరో తెలిసిపోయిందా. వాళ్లెవరు నాకు చెప్పండి గుప్తాగారు అని అడుగుతుంది.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 1st September Episode) ఇవాళ నాకేదో నిజం తెలుస్తుందన్నారు ఏ నిజమో చెప్పండి గుప్త గారు అని అడుగుతుంది అరుంధతి. గుప్త తప్పించుకుని వెళ్తుంటే అరుంధతి కిటికి దగ్గరకు వస్తుంది. రూంలో అమర్ అల్మారా దగ్గర నిలబడి అరుంధతి చిన్నప్పటి వస్తువులు చూస్తూ ఉంటాడు.
ఆ వస్తువులు అరుంధతి చూస్తే నిజం తెలిసిపోతుందని గుప్త అనుకుంటాడు. ఇంతలో అమర్ పంచెను బయటకు తీస్తాడు. అది అరుంధతి చూస్తుంది. అది నన్ను అనాథ శరణాలయం ముందు పడేసినప్పుడు కట్టిన పంచె కదా? అది ఈయన చేతికి ఎలా వచ్చింది. నా కన్నవాళ్లు ఎవరో తెలిసే దాకా పుట్టినప్పటి గుర్తులు ఎవ్వరికీ ఇవ్వరు గుప్తగారు. అంటే ఆయనకు నా కన్నవాళ్లు ఎవరో తెలిసిపోయిందా? తెలిసి కూడా చెప్పడం లేదా? చెప్పండి గుప్త గారు అని అడుగుతుంది.
భారాన్ని దించేయండి
నీ నుంచి నిజాన్ని దాచాను.. ఇప్పుడు నిజం నుంచి మిమ్మల్ని దాస్తున్నాను. మీ అక్క ఈ లోకంలో లేదనే నిజాన్ని తెలుసుకుని నువ్వు తట్టుకోలేవు మిస్సమ్మ అంటూ అమర్ మనసులో అనుకుంటూ పంచెను గుండెలకు హత్తుకుని ఎమోషనల్‌గా ఫీలవుతుంటాడు. ఇంతలో రాథోడ్ వచ్చి వంద గ్రాముల బరువు కూడా లేని ఈ పంచె మీ మనసులో ఎంత భారాన్ని పెంచుతుందో నాకు అర్థం అవుతుంది. సార్. ఇప్పటికైనా ఇంట్లో వాళ్లకు నిజాన్ని చెప్పి ఆ భారాన్ని దించేయండి సార్ అంటాడు.
ఇది భారం కాదు రాథోడ్. బాధ్యత. నా అరుంధతి నాకిచ్చిన బాధ్యత. ఇది అరుంధతి పుట్టింటి నుంచి వచ్చిన సారే అంటాడు అమర్. ఎంత కాలమని మోస్తారు సార్ ఈ భారాన్ని అంటాడు రాథోడ్. కుదిరితే నా కట్టే కాలే వరకు దాస్తాను రాథోడ్. నాకు తెలిసిన ఆ నిజం నాలోనే దాచుకుంటాను అంటాడు అమర్. అసలు నా కన్నవాళ్ల గురించి తెలిస్తే ఎవరు బాధపడతారు.? ఆయన్ని అంతలా కుమిలిపోయేలా చేస్తున్న నిజమేంటి? అని అరుంధతి అడగ్గానే గుప్త అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు.
లేని బంధాల కొరకు
ఇంతలో వెనక నుంచి మిస్సమ్మ వచ్చి అమర్‌కు ఫోన్ ఇస్తుంది. మిస్సమ్మను చూసిన అమర్ షాక్ అవుతాడు. ఇంతలో అమర్‌కు ఫోన్ రావడంతో వస్తున్నానని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. ఆయన ఎందుకు నిజాన్ని దాస్తున్నారు అని గుప్తని నిలదీస్తుంది అరుంధతి. మీ అందరి బాధను నీ భర్తనే మోయుచున్నాడు, నిజం తెలిసిన మీరందరూ తట్టుకోలేరు అనుకుంటాడు గుప్త. లేని బంధములకొరకు లేని బాధలు తెచ్చుకుని కష్టాలు పడుతున్నావు అంటాడు.
నేను ఆత్మనే గుప్తగారు, గాలినే కావచ్చు. కానీ నా కన్నవారిని ఒక్కసారి చూసే భాగ్యం లేదా అని అడుగుతుంది అరుంధతి. అప్పుడే రామ్మూర్తి గేటు తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. నువ్వు చూస్తున్నది నీ తండ్రినే అని నీకు తెలియదు, ఆయన వస్తున్నది తన కూతురు ఇంటికేఅని అతనికి తెలియదు అనుకుంటాడు గుప్త.
అసూయతో మనోహరి
రామ్మూర్తిని చూసిన అరుంధతి.. ఏంటో గుప్తగారు ఎంత అలజడిగా ఉన్నా ఆయనని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటుంది. అప్పుడే రామ్మూర్తి కూడా ఎక్కడకు వెళ్లినా రాని ప్రశాంతత ఆ ఇంటి ప్రాంగణంలోనే ఉంటుంది అనడంతో ఇదే కదా రక్తసంబధం అనుకుంటాడు గుప్త.
అమర్ బయటకు వెళ్లబోతుంటే రామ్మూర్తి, మంగళ ఇంట్లోకి వస్తారు. వాళ్లను చూసిన మనోహరి వీళ్లెందుకు వచ్చారు అనుకుంటుంది. వాళ్లంతా మాట్లాడుకుంటుంటే అసూయతో రగిలిపోతుంది. అరుంధతి గురించి రామ్మూర్తికి తెలుస్తుందా? మంగళ ప్లాన్‌ని మనోహరి కనిపెడుతుందా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 02న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!