Anant Ambani Wedding: ధోనీని హగ్ చేసుకున్న కొత్త పెళ్లి కూతురు.. బ్యాక్‌గ్రౌండ్‌లో రణ్‌వీర్‌కు క్లాస్ పీకుతున్న దీపిక-anant ambani wedding radhika merchant hugs ms dhoni photo gone viral deepika padukone furious over ranveer singh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anant Ambani Wedding: ధోనీని హగ్ చేసుకున్న కొత్త పెళ్లి కూతురు.. బ్యాక్‌గ్రౌండ్‌లో రణ్‌వీర్‌కు క్లాస్ పీకుతున్న దీపిక

Anant Ambani Wedding: ధోనీని హగ్ చేసుకున్న కొత్త పెళ్లి కూతురు.. బ్యాక్‌గ్రౌండ్‌లో రణ్‌వీర్‌కు క్లాస్ పీకుతున్న దీపిక

Hari Prasad S HT Telugu

Anant Ambani Wedding: మహేంద్ర సింగ్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాధికా మర్చంట్, అనంత్ అంబానీల ఫోటోను పంచుకున్నాడు. అయితే ఆ ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్లో కనిపించిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ ఫొటోనే ఎక్కువగా ఆకర్షిస్తోంది.

ధోనీని హగ్ చేసుకున్న కొత్త పెళ్లి కూతురు.. బ్యాక్‌గ్రౌండ్‌లో రణ్‌వీర్‌కు క్లాస్ పీకుతున్న దీపిక

Anant Ambani Wedding: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో కొత్త పెళ్లి కూతురు రాధికా మర్చంట్ అతన్ని హగ్ చేసుకోవడం ఓ విశేషమైతే.. అనుకోకుండా బ్యాక్‌గ్రౌండ్లో కనిపించిన రణ్‌వీర్, దీపికా జోడీ చాలా సీరియస్‌గా కనిపించడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ధోనీని హగ్ చేసుకున్న రాధికా మర్చంట్

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో జులై 12న జరిగిన సంగతి తెలిసిందే. దేశవిదేశాలకు చెందిన ప్రముఖులంతా ఈ వీవీఐపీ వివాహానికి హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తారలతో పాటు పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రపంచంలోని పలువురు ప్రముఖులు వచ్చారు.

పెళ్లి, పోస్ట్ వెడ్డింగ్ ఫంక్షన్ కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఓ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి ధోనీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ధోనీని చూడగానే రాధిక అతన్ని హగ్ చేసుకుంది. అదే సమయంలో అనంత్, సాక్షి పక్కనే నిలబడి వారిని చూస్తున్నారు. అయితే ఈ ఫోటోలో దీపికా పదుకోన్, రణ్ వీర్ సింగ్ ఈ నలుగురి వెనుక నిలబడిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది.

దీపికా, రణ్‌వీర్ కాస్త సీరియస్‌గానే..

మహేంద్ర సింగ్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాధికా మర్చంట్, అనంత్ అంబానీల ఫోటోను షేర్ చేశాడు. దీపికా పదుకోన్, రణ్ వీర్ సింగ్ కూడా ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించారు. ఆ ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే వీరిద్దరి ముఖ కవళికలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో చూస్తుంటే దీపిక ఏదో విషయంలో రణ్ వీర్ పై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు కానీ ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగానే లైక్ అవుతోంది.

మహేంద్ర సింగ్ ధోని, రాధికా మర్చంట్ ల ఈ ఫోటోపై అభిమానులు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. అభిమానులు దీపికా పదుకోన్, రణ్ వీర్ సింగ్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ల మధ్య ఏం జరిగిందో సరదాగా డీకోడ్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. దీపిక ఇతరుల భార్యను చూడొద్దని రణ్‌వీర్‌కు చెబుతోంది అని అనడం విశేషం. 'హేయ్ దీపిక.. రణవీర్ ను ఎందుకు తిడుతోంది' అని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి ఫన్నీ కామెంట్స్ మరెన్నో వస్తున్నాయి.