Deepika padukone: చౌమహల్లా ప్యాలెస్ స్ఫూర్తితో దీపికా చీర డిజైన్.. ధర ఊహించలేరు
Deepika padukone: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత్‌కు దీపిక పదుకోణ్ కట్టుకున్న పర్పుల్ రంగు చీర తయారీకి 3,400 గంటల సమయం పట్టిందట. దాని ధర తెలిస్తే షాకవుతారు. ఈ లుక్ వివరాలు చూడండి.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ సంగీత్ వేడుకలకు హాజరైన దీపికా పదుకొణె పర్పుల్ రంగు చీరను ధరించింది. తొరానీ అనే క్లాతింగ్ లేబుల్ ఈ చీరను డిజైన్ చేసింది. ఈ చీర ధర, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెల్సుకోండి.
చీర తయారీకి 3,400 గంటలు:
తొందరలో రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోణ్ తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. అంబానీ సంగీత్ వేడుకలో దీపికా పర్పుల్ రంగు చీర కట్టుకుని తన బేబీ బంప్‌తో ప్రత్యేకంగా కనిపించింది. ఈ చీర తయారు చేయడానికి 3400 గంటల సమయం పట్టిందట. ఈ చీరను 16 వ శతాబ్దపు హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్, కరాచీలోని చౌఖండీ టోంబ్స్ వాస్తుకళను స్పూర్తిగా తీసుకుని తయారు చేశారు. ఈ చీర మీద చేతి ఎంబ్రాయిడరీ, ముత్యాలు, డోరీలు పొదిగి ఉన్నాయి. ఈ తొమ్మిది గజాల చీర.. దీపికకు భారత హస్తకళలు, వారసత్వ సంపద మీదున్న అభిమానాన్ని తెలియజేస్తోంది.
ఈ తోరానీ చీరను హుకుం కీ రాణీ చీర సెట్ అంటారు. లీలా అనే కలెక్షన్‌లో ఈ చీరను డిజైన్ చేశారు. దీని ధర అక్షరాలా 1,92,000 రూపాయలు.
దీపికా లుక్ వివరాలు:
సాంప్రదాయ విధానంలో దీపికా చీర కట్టుకున్నారు. పల్లు అంచు భూమిని తాకేంతా పొడవుగా ఉంచారు. జతగా మ్యాచింగ్ బ్లవుజు వేసుకున్నారు. దానిమీద చేతి ఎంబ్రాయిడరీతో పాటూ జరీ వర్క్ మేళవింపు ఉంది. డీప్ నెక్ లైన్, హాఫ్ లెంగ్త్ స్లీవ్స్ తో ఉంది బ్లవుజు. దీనికి జతగా ముత్యాల చోకర్, మ్యాచింగ్ కమ్మలు పెట్టుకుని లుక్ పూర్తి చేశారు.
మేకప్ విషయానికొస్తే వింగ్డ్ ఐ లైనర్, స్మోకీ ఐస్, బుగ్గల మీద టింట్, మస్కారా, ఐల్యాషెస్ పెట్టుకున్నారు. జుట్టు కోసం మధ్య పాపిట తీసి సిగ వేసుకున్నారు.
దాదాపు ఆరేళ్ల వైవాహిక జీవితం గడిపిన ఈ జంట.. 2024 సెప్టెంబర్ లో మొదటి బిడ్డను కనబోతున్నారు... 2018 నవంబర్ 14న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.