Deepika Padukone: ఐఎండీబీ టాప్ 100 లిస్టులో దీపికా టాప్.. టాప్ 10లో మొత్తం వాళ్లే-deepika padukone tops the list of imdb most viewed indian stars of the decade ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone: ఐఎండీబీ టాప్ 100 లిస్టులో దీపికా టాప్.. టాప్ 10లో మొత్తం వాళ్లే

Deepika Padukone: ఐఎండీబీ టాప్ 100 లిస్టులో దీపికా టాప్.. టాప్ 10లో మొత్తం వాళ్లే

Hari Prasad S HT Telugu
May 29, 2024 12:52 PM IST

Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ గత పదేళ్లలో ఐఎండీబీ ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్ల జాబితాలో టాప్ లో నిలిచింది. అంతేకాదు టాప్ 10లో మొత్తం బాలీవుడ్ నటులే ఉండటం విశేషం.

ఐఎండీబీ టాప్ 100 లిస్టులో దీపికా టాప్.. టాప్ 10లో మొత్తం వాళ్లే
ఐఎండీబీ టాప్ 100 లిస్టులో దీపికా టాప్.. టాప్ 10లో మొత్తం వాళ్లే

Deepika Padukone: దీపికా పదుకోన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. 2014 నుంచి 2024 ఏప్రిల్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్)లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ లిస్టును బుధవారం (మే 29) ఐఎండీబీ తమ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. షారుక్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ బాలీవుడ్ హీరోలను కూడా దీపికా మించేసింది.

ఐఎండీబీ ఇండియన్ స్టార్స్ లిస్ట్

బాలీవుడ్ టాప్ నటీమణుల్లో ఒకరిగా దీపికా పదుకోన్ కు పేరుంది. రెమ్యునరేషన్ విషయంలోనూ ఆమెనే టాప్. ఇప్పుడు గత పదేళ్లలో ఐఎండీబీలో ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్స్ లిస్టులోనూ ఆమెనే టాప్ లో ఉండటం విశేషం. అంతేకాదు ఈ జాబితా టాప్ 10లో అందరూ బాలీవుడ్ స్టార్లే ఉన్నారు. తాను టాప్ లో నిలవడంపై దీపికా స్పందించింది.

"ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల సెంటిమెంట్ కు అద్దం పట్టే ఈ లిస్టులో ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఐఎండీబీ క్రెడిబిలిటీ నమ్మదగినది. ప్రేక్షకుల నిజమైన అభిరుచులు, ఆసక్తులు, ప్రాధాన్యతలను సరిగ్గా అర్థం చేసుకుంటుంది. ఈ గుర్తింపు నాకు చాలా ప్రత్యేకమైనది"అని దీపికా చెప్పంది.

ఐఎండీబీ ఇండియన్ స్టార్స్ 100 లిస్ట్

ఐఎండీబీ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ టాప్ 100 లిస్టులో బాలీవుడ్ తోపాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల స్టార్స్ ఉన్నారు. టాప్ 10 విషయానికి వస్తే దీపిక తర్వాత షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. ఇందులో సౌత్ నుంచి ఒక్కరు కూడా లేరు.

దీపికా పదుకోన్ 2007లో వచ్చిన ఓం శాంతి ఓం మూవీతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రమంగా బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదుగుతూ వస్తోంది. బాలీవుడ్ లో వివిధ జానర్ల మూవీస్ లో నటించింది. 2017లో ట్రిపుల్ ఎక్స్ మూవీతో హాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఈ మూవీలో విన్ డీజిల్ సరసన్ ఆమె నటించింది.

ఇక ఇప్పుడు తెలుగులోనూ నటించింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రణ్‌వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న దీపిక.. ఈ ఏడాది సెప్టెంబర్ లో తన తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే తన బేబీ బంప్ ను చూపించిన ఆమె.. తర్వాత చేసిన ఫొటోషూట్ కూడా వైరల్ అయింది.

జూన్ 27న కల్కి 2898 ఏడీ మూవీ రీలీజ్ అవుతోంది. ఆ తర్వాత సింగం అగైన్ మూవీలోనూ దీపికా నటించింది. ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న ఆమె.. వచ్చే ఏడాది మళ్లీ షూటింగ్ లు మొదలు పెట్టనుంది.

టీ20 వరల్డ్ కప్ 2024