Biggest Flop Movie: అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్టర్ ఫ్లాప్.. మొత్తం బాలీవుడ్‌నే అప్పుల్లో ముంచేసిన సినిమా ఇదే-biggest flop movie razia sultan made on a budget of 10 crores made only 2 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop Movie: అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్టర్ ఫ్లాప్.. మొత్తం బాలీవుడ్‌నే అప్పుల్లో ముంచేసిన సినిమా ఇదే

Biggest Flop Movie: అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్టర్ ఫ్లాప్.. మొత్తం బాలీవుడ్‌నే అప్పుల్లో ముంచేసిన సినిమా ఇదే

Hari Prasad S HT Telugu
May 29, 2024 08:55 AM IST

Biggest Flop Movie: అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు అతిపెద్ద ఫ్లాప్ మూవీస్ గా నిలవడం చూస్తూనే ఉంటాం. అయితే 40 ఏళ్ల కిందట వచ్చిన ఓ సినిమా మొత్తం బాలీవుడ్ నే చిక్కుల్లో పడేసిందంటే నమ్మగలరా?

అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్టర్ ఫ్లాప్.. మొత్తం బాలీవుడ్‌నే అప్పుల్లో ముంచేసిన సినిమా ఇదే
అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్టర్ ఫ్లాప్.. మొత్తం బాలీవుడ్‌నే అప్పుల్లో ముంచేసిన సినిమా ఇదే

Biggest Flop Movie: ఎంత భారీ బడ్జెట్ పెట్టినా సినిమాలో కంటెంట్ ప్రేక్షకులకు నచ్చకపోతే తీసి అవతల పారేస్తారని చాలా సందర్భాల్లో రుజువైంది. బాలీవుడ్ లోనూ ఓ సినిమా విషయంలో అదే జరిగింది. అప్పట్లో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ అది. కానీ పెట్టిన ఖర్చులో వెనక్కి వచ్చింది కేవలం 20 శాతమే. ఇది మొత్తం బాలీవుడ్ నే చిక్కుల్లో పడేసింది.

రజియా సుల్తాన్ అట్టర్ ఫ్లాప్

ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు కామనైపోయాయి. కానీ 40 ఏళ్ల కిందటే రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ రజియా సుల్తాన్. అప్పట్లో ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే.. తిరిగి వచ్చింది మాత్రం కేవలం రూ.2 కోట్లే.

ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆ సింహాసనంపై కూర్చొన్న ఏకైక మహిళ రజియా సుల్తానా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు శంకర్, సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళిలాగా అప్పట్లో భారీ సినిమాలను తెరకెక్కిస్తాడన్న పేరున్న డైరెక్టర్ కమల్ అమ్రోహి. ఈ రజియా సుల్తాన్ సినిమాకు కూడా అతడే డైరెక్టర్. హేమా మాలిని, ధర్మేంద్రలాంటి స్టార్లతో ఈ సినిమా తీశాడు.

మొత్తం బాలీవుడ్ అప్పుల్లో..

ఈ రజియా సుల్తాన్ మూవీని కమల్ 8 ఏళ్ల పాటు తీయడం గమనార్హం. మొత్తానికి 1983లో ఈ మూవీని రిలీజ్ చేశాడు. అప్పట్లోనే రూ.10 కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. కానీ తీరా చూస్తే ఈ సినిమా వసూలు చేసింది కేవలం రూ.2 కోట్లు మాత్రమే. ఈ సినిమాలో ఉపయోగించిన ఉర్దూ భాష నాసిరకంగా ఉండడం, ఓ పాటలో ఇద్దరు ఫిమేల్ యాక్టర్స్ మధ్య రొమాన్స్ చూపించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

ఈ వివాదంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా జోలికి వెళ్లలేదు. ఫలితంగా సినిమా అట్లర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. రజియా సుల్తాన్ సినిమా తీయడానికి కమల్ అమ్రోహి భారీగా అప్పు చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది ఫైనాన్షియర్లు ఇందులో తమ డబ్బు పెట్టారు. కానీ సినిమా ఫెయిలవడంతో చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూశారు.

ఇది మొత్తం ఇండస్ట్రీని కుదిపేసింది. ఈ సినిమా బాలీవుడ్ ను అప్పుల్లోకి నెట్టేసిందంటూ అప్పట్లో ఓ మ్యాగజైన్ ఆర్టికల్లో రావడం విశేషం. కమల్ కెరీర్లోనూ ఇదే చివరి సినిమాగా మిగిలిపోయింది. తన చరమాంకంలో ఆఖ్రీ మొఘల్ పేరుతో మరో సినిమా తీయాలని భావించినా అది సాధ్యం కాలేదు. 1993లో కమల్ కన్నుమూశాడు. తర్వాత ఆ సినిమా స్క్రిప్ట్ మళ్లీ కనిపించలేదు.

ఈ రజియా సుల్తాన్ సినిమా 8 ఏళ్ల పాటు ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రికార్డుల్లో నిలిచింది. 1991లో నాగార్జున నటించిన శాంతి క్రాంతి మూవీ ఆ రికార్డును బ్రేక్ చేసింది.

Whats_app_banner