Hema Malini on Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ హీరోలకు క్లాస్ పీకిన హేమా మాలిని
Hema Malini on Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి నేర్చుకోండి అంటూ బాలీవుడ్ హీరోలకు క్లాస్ పీకింది హేమా మాలిని. పుష్ప మూవీ చూసి ఈ డ్రీమ్ గర్ల్ ఫిదా అయిపోయిందట.
Hema Malini on Allu Arjun: పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ కు నార్త్ లోనూ అభిమానులు పెరిగిపోతున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి, డ్రీమ్ గర్ల్‌గా పేరుగాంచిన హేమా మాలిని కూడా స్టైలిష్ స్టార్ అభిమానిగా మారిపోయింది. ఈ మధ్య అతని గురించి హేమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పుష్ప కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి షాక్ తిన్న ఆమె.. బాలీవుడ్ హీరోలు ఎప్పటికీ ఇలా చేయరని అనడం విశేషం. "నేను కూడా పుష్ప: ది రైజ్ చూశారు. చాలా బాగా అనిపించింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్స్ ను చాలా మంది అనుకరించారు.
అతని నటన బాగా నచ్చింది. అతనిదే మరో సినిమా కూడా చూశాను. ఎంతో అందంగా కనిపించాడు. అదే పుష్ప కోసం అతడు పూర్తిగా మాస్ లుక్ లో లుంగీ కట్టుకొని నటించాడు. అలాంటి క్యారెక్టర్ వేసినా కూడా అతడు హీరోనే. అలాంటి లుక్, రోల్ పోషించడానికి అతడు అంగీకరించడం అభినందనీయం.
మన హిందీ సినిమాల హీరోలు ఇలా చేయలేరు. రజియా సుల్తాన్ సినిమా కోసం కాస్త నల్లగా కనిపించాలంటే ధర్మేంద్ర వెనుకాడారు" అని హేమమాలిని అనడం విశేషం.
నిజానికి పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయినా.. అంతకుముందు నుంచే అతని హిందీ డబ్ సినిమాలకు నార్త్ లో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్ ప్రతి సినిమా హిందీలో డబ్ అయింది. అయితే పుష్ప మూవీతో అతని రేంజ్ మరో లెవల్ కు వెళ్లింది. ఇప్పుడు సాక్షాత్తూ హేమా మాలినిలాంటి నటే అతనిపై ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం అల్లు అర్జున్ ఎప్పటికీ మరవలేనిదే.
ప్రస్తుతం అతడు పుష్ప: ది రూల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేశాయి. సీక్వెల్ మరింత గొప్పగా ఉండబోతోందని నిరూపించాయి. ఈ సీక్వెల్ తోపాటు అతడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లోనూ మరో సినిమా ఈ మధ్యే అనౌన్స్ చేశాడు.
సంబంధిత కథనం