Janhvi Kapoor : జాన్వీకి తెలుగులో క్రేజ్.. మరి బాలీవుడ్​లో ఎందుకు అలా?-telugu makers running behind janhvi kapoor bollywood is not ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor : జాన్వీకి తెలుగులో క్రేజ్.. మరి బాలీవుడ్​లో ఎందుకు అలా?

Janhvi Kapoor : జాన్వీకి తెలుగులో క్రేజ్.. మరి బాలీవుడ్​లో ఎందుకు అలా?

Anand Sai HT Telugu
May 11, 2023 11:25 AM IST

Janhvi Kapoor : శ్రీదేవీ కుమార్తెగా జాన్వీ కపూర్ కు మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ 30 సినిమాతో తెలుగు తెరపై కనిపించనుంది. కానీ బాలీవుడ్లో మాత్రం పెద్దగా ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

తెలుగు సినిమా మేకర్స్.. బాలీవుడ్(Bollywood)లో పది ఫ్లాప్స్ ఇచ్చిన హీరోయిన్లపై కూడా మక్కువ చూపుతారు. ఈ విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ముంబయి హీరోయిన్లు(Mumbai Heroines) ఇక్కడకు వచ్చి.. సక్సెస్ అందుకుని మళ్లీ అక్కడికే వెళ్తారు. ఇప్పుడు జాన్వీ కపూర్(Janhvi Kapoor) మీద కూడా తెలుగు సినిమా మేకర్స్ ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇస్తున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం.. ఆమెకి పెద్ద సినిమాలు ఏమీ లేవు.

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 30కి సైన్ చేసింది. శ్రీదేవీ కుమార్తెగా.. తెలుగులోనూ జాన్వీకి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోలతో నటించేదుకు చర్చలు జరుగుతున్నాయి. పలు సినిమాల్లోనూ సైన్ చేసిందట. మెగా పవర్ స్టార్ రాంచరణ్(Ramcharan)తో కలిసి నటించేందుకు రెడీ అయింది. అంతేకాదు.. అక్కినేని అఖిల్(Akkineni Akhil) సరసన కూడా నటించేందుకు సైన్ చేసినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. టాలీవుడ్ టాప్ హీరోల(Tollywood Top Heros) సరసన ఛాన్సులు కొట్టేసిందీ ముద్దుగుమ్మ. కానీ బాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉంది?

ధడక్ సినిమాతో 2018లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ(Janhvi). తెలుగులోనూ తన ప్రతిభ చూపించేందుకు రెడీ అయింది. ఎన్టీఆర్ 30(NTR 30) సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. నాలుగు కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటోదని టాక్ ఉంది. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు.. అయినా జాన్వీకి వరుసగా ఆపర్లు క్యూ కడుతున్నాయి.

జాన్వీ కపూర్ ఇప్పటికీ బాలీవుడ్‌లో పెద్ద చిత్రాలను అందుకోలేకపోయింది. ఆమె తాజా హిందీ చిత్రం ఉలాజ్ కూడా పెద్దగా తెలియని నటులతోనే చేస్తుంది. బడ్జెట్ కూడా తక్కువే. ఆమె గత చిత్రాలు కూడా పెద్ద పెద్ద చిత్రాలేమీ కాదు. జాన్వీ కపూర్ మాత్రమే కాదు, సారా అలీ ఖాన్, అనన్య పాండేల పరిస్థితి కూడా బాలీవుడ్‌లో గొప్పగా ఏమీ లేదు. కానీ వారు తెలుగులో మాత్రం మోస్ట్ వాంటెడ్. సౌత్‌లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోతో నటిస్తే.. స్టార్‌డమ్ వస్తుంది. ఇక ఆ తర్వాత స్టార్స్ తో నటించేందుకు మళ్లీ బాలీవుడ్ లోకి వెళ్తారు.

జాన్వీకి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేనట్టే ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం.. పారితోషికం విషయంలో తగ్గడం లేదు. కోట్లలో డిమాండ్ చేస్తోంది. ఎన్టీఆర్ సినిమాకు 4 కోట్ల వరకూ తీసుకుంటుందని చర్చ జరిగింది. ఇప్పుడు మిగిలిన సినిమాల్లోనూ అంతే తీసుకుంటే.. జాన్వీకి తెలుగు నుంచే రెమ్యూనరేషన్ 20 కోట్ల వరకు వెళ్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం