Samyukta Menon: సంయుక్త మీనన్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ గ్లింప్స్ వచ్చేసింది: కొరడాతో కాజోల్ వీరంగం-samyukta menon bollywood debut movie maharagni glimpse release kajol in action mode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samyukta Menon: సంయుక్త మీనన్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ గ్లింప్స్ వచ్చేసింది: కొరడాతో కాజోల్ వీరంగం

Samyukta Menon: సంయుక్త మీనన్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ గ్లింప్స్ వచ్చేసింది: కొరడాతో కాజోల్ వీరంగం

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2024 05:59 PM IST

Maharagni Glimpse- Samyukta Menon: మహారాగ్ని సినిమా గ్లింప్స్ వచ్చేసింది. ప్రభుదేవా, కాజోల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్‍తో ఈ గ్లింప్స్ అదిరిపోయింది. సంయుక్త మీనన్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

Samyukta Menon: సంయుక్త మీనన్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ గ్లింప్స్ వచ్చేసింది: కొరడాతో కాజోల్ వీరంగం
Samyukta Menon: సంయుక్త మీనన్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ గ్లింప్స్ వచ్చేసింది: కొరడాతో కాజోల్ వీరంగం

Samyukta Menon: తెలుగు, మలయాళం, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‍లో ఉన్నారు హీరోయిన్ సంయుక్త మీనన్. బిజీబిజీగా చిత్రాలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్‍లోనూ సంయుక్త ఎంట్రీ ఇస్తున్నారు. మహారాగ్ని మూవీలో ఓ కీలకపాత్రలో ఆమె నటిస్తున్నారు. ‘స్పై’ ఫేమ్ చరణ్ తేజ్ ఉప్పాలపాటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ తేజ్‍ కూడా ఈ మూవీతోనే బాలీవుడ్‍లో అడుగుపెడుతున్నారు. ఇక, 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ మళ్లీ జత కడుతుండడం కూడా మహారాగ్ని చిత్రానికి హైలైట్‍గా ఉంది. ఈ సినిమా గ్లింప్స్ నేడు (మే 28) రిలీజ్ అయింది.

గ్లింప్స్ ఇలా..

మహారాగ్ని గ్లింప్స్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది. విమానం నుంచి ప్రభుదేవా స్టైలిష్‍గా దిగి.. నోట్లో చుట్ట.. చేతిలో బేస్ బాల్ స్టిక్‍ పట్టుకొని నడవటంతో ఈ గ్లింప్స్ మొదలైంది. ఆ తర్వాత కారు రేసింగ్‍లో గ్లామరస్ డ్రెస్‍లో సంయుక్త మీనన్ ఎంట్రీ ఉంది. యమస్పీడ్‍గా కారు నడుపుతూ.. సంయుక్త డైలాగ్ ఉంది.

కాజోల్ యాక్షన్ ఎపిసోడ్ ఈ మహారాగ్ని గ్లింప్స్‌లో హైలైట్‍గా ఉంది. కొరడాతో విలన్లను బాదేశారు కాజోల్. పవర్ యాక్షన్, డైలాగ్‍తో ఎండ్ అయింది. ఈ చిత్రం యాక్షన్, ఇంటెన్స్ డ్రామాతో ఉండేలా కనిపిస్తోంది. ఈ మూవీలో కాజోల్ చెల్లి పాత్రలో సంయుక్త నటిస్తున్నారు.

మహారాగ్ని చిత్రంలో ప్రభుదేవ, కాజోల్, సంయుక్తతో పాటు నసీరుద్దీన్ షా, జిషు సెంగుప్త, ఆదిత్య సీల్, చాయా కదమ్, ప్రమోద్ పాఠక్ కీరోల్స్ చేశారు. మళ్లీ మొదలైంది, స్పై తెలుగు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు చరణ్ తేజ్ ఉప్పాలపాటి ఈ మూవీతో బాలీవుడ్‍లో డెబ్యూ చేస్తున్నారు.

మహారాగ్ని మూవీకి యానిమల్ ఫేమ్ హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. వెంకట అనిశ్, హర్మన్ బేవేజా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నవీన్ నూలీ ఈ మూవీకి ఎడిటర్‌గా ఉన్నారు.

27ఏళ్ల తర్వాత ప్రభుదేవ - కాజోల్ కాంబో

ప్రభుదేవా, కాజోల్ కాంబినేషన్ మళ్లీ 27 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. 1997లో వచ్చిన మిన్సారా కనవు (మెరుపు కలలు) తర్వాత వీరిద్దరు ఇప్పుడు కలిసి నటిస్తున్నారు. మహారాగ్ని చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీలో ఇద్దరూ గ్యాంగ్‍స్టర్లుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

మహారాగ్ని చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే, రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.

సంయుక్త లైనప్

సంయుక్త మీనన్ నటించిన సార్, విరూపాక్ష చిత్రాలు గతేడాది బ్లాక్‍బస్టర్ హిట్ అయ్యాయి. తెలుగులో ప్రస్తుతం స్వయంభు చిత్రం చేస్తున్నారు సంయుక్త. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సంయుక్త ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. స్వయంభు కోసం గుర్రపు స్వారీ కూడా సంయుక్త నేర్చుకున్నారు. ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ మూవీ రామ్‍లో ఓ కీలకపాత్ర చేస్తున్నారు సంయుక్త.

టీ20 వరల్డ్ కప్ 2024