Kajol Prabhudeva: మెరుపు కలలు తర్వాత కాజోల్ ప్రభుదేవా యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్లకు జోడీ రిపీట్.. టీజర్ ఎప్పుడంటే?-kajol prabhudeva reunite for action thriller movie after 27 years of merupu kalalu minsara kanavu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajol Prabhudeva: మెరుపు కలలు తర్వాత కాజోల్ ప్రభుదేవా యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్లకు జోడీ రిపీట్.. టీజర్ ఎప్పుడంటే?

Kajol Prabhudeva: మెరుపు కలలు తర్వాత కాజోల్ ప్రభుదేవా యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్లకు జోడీ రిపీట్.. టీజర్ ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu
May 25, 2024 02:17 PM IST

Kajol Prabhudeva Movie After Merupu Kalalu: ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, బాలీవుడ్ బ్యూటి కాజోల్ హీరో హీరోయిన్లుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా మెరుపు కలలు. ఇప్పుడు దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ రిపీట్ అయింది. ఆ సినిమాకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

మెరుపు కలలు తర్వాత కాజోల్ ప్రభుదేవా యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్లకు జోడీ రిపీట్.. టీజర్ ఎప్పుడంటే?
మెరుపు కలలు తర్వాత కాజోల్ ప్రభుదేవా యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్లకు జోడీ రిపీట్.. టీజర్ ఎప్పుడంటే?

Kajol Prabhudeva Reunite Movie: కొరియోగ్రాఫర్, ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ జంటగా నటించిన సినిమా మెరుపు కలలు (Merupu Kalalu Movie). తమిళంలో వచ్చిన మిన్సారా కనవు (Minsara Kanavu Movie) చిత్రాన్ని తెలుగులో మెరుపు కలలు టైటిల్‌తో విడుదల చేశారు. ఇందులో మరో హీరోగా అరవింద్ స్వామి (Arvind Swamy) కూడా నటించారు.

1997 జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలో ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) అందించిన పాటలకు, సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ప్రభుదేవా, కాజోల్ జోడీ మళ్లీ రిపీట్ కానుంది. అది కూడా పాన్ ఇండియా సినిమాతో.

ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి (Charan Tej Uppalapati) అద్భుతమైన ప్రతిభతో బాలీవుడ్‌‌లో అడుగు పెట్టాడు. కొత్త ఉత్సాహంతో బీటౌన్‌‌లో సత్తా చాటడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. తాజాగా చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లోనే బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

వీరితో పాటు ఈ . యాక్షన్ థ్రిల్లర్ లో స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్ (Samyuktha Menon), జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభుదేవా, కాజోల్ కాంబినేషన్‌లో 27 సంవత్సరాల క్రితం మెరుపు కలలు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇన్నాళ్ల తరువాత మళ్లీ వీరి కలయికలో వస్తున్న ఈ సినిమా అంటే ప్రేక్షకులకు చాలా ఉత్సాహం ఉంటుంది.

ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్ ఓ విషయాన్ని వెల్లడించారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ సైతం పూర్తయిందని తెలిపారు. అతి త్వరలోనే ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అందరూ టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shahrukh Khan) నటించిన జవాన్ (Jawan Movie) చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జీకే విష్ణు ఈ సినిమాకు పని చేస్తున్నారు. అలాగే ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్‌కు వర్క్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇంకా అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప చిత్రానికి (Pushpa Movie) ఎడిటర్‌ బాధ్యతలు చేపట్టిన నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

అంతే కాకుండా మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్ చిత్రాలతో ప్రసిద్ది గాంచిన నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ పనిచేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

టీ20 వరల్డ్ కప్ 2024