Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్-pushpa 2 first song release date time first single to out in six languages allu arjun new look revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 30, 2024 06:02 PM IST

Pushpa 2 First Song Release: పుష్ప 2 సినిమా నుంచి తొలి పాట వచ్చేస్తోంది. అయితే, ముందుగా చెప్పిన రిలీజ్ టైమింగ్‍లో కాస్త మార్పులు చేసింది మూవీ టీమ్. అలాగే, నేడు అల్లు అర్జున్ కొత్త లుక్‍ను కూడా రివీల్ చేసింది.

Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్
Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

Pushpa 2 First Song Release: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంపై సినీ ప్రేక్షకుల దృష్టి అంతా ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఫుల్ బజ్ ఉంది. ఈ మూవీ కోసం అందరూ నిరీక్షిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చి దేశవ్యాప్తంగా బంపర్ హిట్ అయిన పుష్ప: ది రైజ్‍కు సీక్వెల్‍గా వస్తున్న ఈ పుష్ప 2: ది రూల్‍పై అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తొలి పాటకు సంబంధించిన ప్రోమో ఇటీవలే వచ్చింది. అయితే, తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ టైమ్ విషయంలో మూవీ టీమ్ మార్పులు చేసింది. ఈ విషయాన్ని నేడు (ఏప్రిల్ 30) వెల్లడించింది.

ఫస్ట్ సాంగ్ డేట్, టైమ్ ఇవే

పుష్ప 2: ది రూల్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో ఇటీవల వచ్చింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ వచ్చిన ఈ ప్రోమో మెతెక్కిపోయింది. ఈ పాట రేపు (మే 1) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది.

పుష్ప 2 ఫస్ట్ సాంగ్‍ను మే 1న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రోమోలో మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే, ఇప్పుడు టైమింగ్‍లో మార్పులు చేసింది. సాయంత్రం 5:04 గంటలకు తీసుకురానున్నట్టు వెల్లడించింది.

ఆరు భాషల్లో..

పుష్ప 2 సినిమా నుంచి ఈ ఫస్ట్ సాంగ్ ఆరు భాషల్లో వస్తుందని మూవీ టీమ్ కన్ఫర్మ్ చేసింది. “సెన్సేషనల్ సర్‌ప్రైజ్.. సెన్సేషనల్ సాంగ్. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ రేపు (మే 1) సాయంత్రం 5:04 గంటలకు రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో వస్తుంది. పుష్ప.. పుష్ప నామస్మరణ వచ్చేస్తోంది” అని మైత్రీ మూవీ మేకర్స్ నేడు (ఏప్రిల్ 30) ట్వీట్ చేసింది.

అల్లు అర్జున్ కొత్త లుక్

పుష్ప 2: ది రూల్ మూవీ నుంచి హీరో అల్లు అర్జున్ కొత్త లుక్‍ను కూడా మూవీ టీమ్ రివీల్ చేసింది. టక్ చేసుకున్న పుష్ప రాజ్ (అల్లు అర్జున్) స్టైలిష్‍గా సిగరెట్ కాలుస్తున్నట్టు ఈ పోస్టర్‌లో ఉంది. పుష్ప మార్క్ మేనరిజం ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన తెలుగు, హిందీ సహా ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే థియేట్రికల్, డిజిటల్ హక్కులు ఇలా ప్రీ-రిలీజ్ బిజినెస్‍లో ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో హిందీ జనాలు ఈ చిత్రం కోసం చాలా ఎదురుచూస్తున్నారు. పుష్పలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, యాక్షన్, స్టైల్ ఉత్తరాది జనాలను కూడా విపరీతంగా ఊపేశాయి. దీంతో సీక్వెల్‍పై భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప 2లో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

IPL_Entry_Point