Ranveer Singh: అల్లు అర్జున్ పాటకు స్టెప్స్ వేసిన రణ్‍వీర్ సింగ్.. వీడియో షేర్ చేసిన దేవీ శ్రీప్రసాద్
Ranveer Singh - Devi Sri Prasad: పుష్ప సినిమాలోని పాటకు బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్ డ్యాన్స్ వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్‍తో కలిసి చిందేశారు. ఈ దేవీ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్ ఎప్పుడూ ఫుల్ జోష్‍తో ఉంటారు. ఏవైనా ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రామ్‍లలో పాల్గొంటే హంగామా చేస్తుంటారు. డ్యాన్స్‌లతో దుమ్మురేపుతుంటారు. ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహ రిసెప్షన్‍లోనూ రణ్‍వీర్ సింగ్ తన మార్క్ డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. ఈ వీడియోను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ నేడు (ఏప్రిల్ 29) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాలివే..
పుష్ప పాటకు రణ్‍వీర్ స్టెప్‍లు
అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా బ్లాక్‍బస్టర్ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా’ పాటకు రణ్‍వీర్ సింగ్ డ్యాన్స్ చేశారు. ఐశ్వర్య శంకర్ వివాహ రిసెప్షన్ వేడుకల్లో ఈ సాంగ్‍కు చిందేశారు. ఈ పాటకు సంగీతం అందించిన దేవీ శ్రీప్రసాద్‍తో కలిసే రణ్‍వీర్ డ్యాన్స్ చేశారు.
రణ్‍వీర్ ఈ సాంగ్‍కు గ్రేస్‍తో చిందేశారు. దేవీని గిల్లుతూ సరదాగా చిందేశారు. మొత్తంగా ఫుల్ జోష్‍తో ఉన్న ఈ పాటకు తన మార్క్ స్టెప్‍లతో మెప్పించారు రణ్‍వీర్ సింగ్.
వీడియో షేర్ చేసిన దేవీ
‘ఊ అంటావా’ పాటకు రణ్‍వీర్ సింగ్ డ్యాన్స్ చేసిన వీడియోను దేవీ శ్రీప్రసాద్ నేడు (ఏప్రిల్ 29) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. అంతర్జాతీయ డ్యాన్స్ డే సందర్భంగా ఈ వీడియో షేర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. “అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంతోషంలో ఉన్నా.. బాధలో ఉన్నా డ్యాన్స్ చేయాలని నేను నమ్ముతా. డైరెక్టర్ శంకర్ కూతురు రిసెప్షన్‍లో నాకు ఈ అద్భుతమైన డ్యాన్స్ జ్ఞాపకాన్ని ఇచ్చిన బ్రదర్ రణ్‍వీర్ సింగ్ నీకు థ్యాంక్స్” అని దేవీ శ్రీప్రసాద్ క్యాప్షన్ రాశారు. తనకు లిరిక్స్ అర్థం కాకపోయినా.. ఊ అంటావా పాట తెలుగు వెర్షన్ తనకు చాలా ఇష్టమని గతంలో ఓ ఇంటర్య్వూలోనూ రణ్‍వీర్ చెప్పారు.
రణ్‍వీర్ సింగ్ డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ డ్యాన్స్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. రణ్‍వీర్ డ్యాన్స్ ఇరగదీశారంటూ అభిప్రాయపడుతున్నారు. కాగా, డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం ఏప్రిల్ 15న జరిగింది.
2021లో వచ్చిన పుష్ప 1: ది రైజ్ చిత్రంలోని ఊ అంటావా పాట చాలా పాపులర్ అయింది. ఈ స్పెషల్ సాంగ్‍లో సమంత డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దుమ్మురేపారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట.. అందరినీ ఊపేసింది. తెలుగులో ఇంద్రావతీ చౌహాన్ ఈ పాట పాడారు. ఇప్పటికీ ఈ సాంగ్‍కు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు దేవీ సంగీతం అందిస్తున్నారు. ఈ సీక్వెల్ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
రణ్‍వీర్ లైనప్
రణ్‍వీర్ సింగ్ ప్రస్తుతం సింగం అగైన్ సినిమాలో నటిస్తున్నారు. అజయ్ దేవ్‍గన్, అక్షయ్ కుమార్, రణ్‍వీర్‌తో మల్టీస్టారర్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇక, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో తన తదుపరి సినిమా చేయనున్నారు రణ్‍వీర్ సింగ్. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది.