Allu Arjun: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా.. నయా అనౌన్స్‌మెంట్ పోస్టర్.. అట్లీతో మూవీ కంటే ముందే!-allu arjun and trivikram combination for the fourth time announcement out on icon star birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా.. నయా అనౌన్స్‌మెంట్ పోస్టర్.. అట్లీతో మూవీ కంటే ముందే!

Allu Arjun: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా.. నయా అనౌన్స్‌మెంట్ పోస్టర్.. అట్లీతో మూవీ కంటే ముందే!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 08, 2024 04:08 PM IST

Allu Arjun - Trivikram Movie: స్టార్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‍లో మరో సినిమా తెరకెక్కనుంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

Allu Arjun: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా.. నయా అనౌన్స్‌మెంట్ పోస్టర్.. అట్లీతో మూవీ కంటే ముందే!
Allu Arjun: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా.. నయా అనౌన్స్‌మెంట్ పోస్టర్.. అట్లీతో మూవీ కంటే ముందే!

Allu Arjun - Trivikram Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప '2: ది రూల్’ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (ఏప్రిల్ 8) పుష్ప 2 టీజర్ కూడా వచ్చింది. అయితే, పుష్ప 2 చిత్రం తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే, ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో ఐకాన్ తర్వాత తర్వాతి చిత్రం ఉండనుంది. ఈ విషయంపై తాజాగా మరో అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

నాలుగోసారి సూపర్ హిట్ కాంబో..

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా నేడు (ఏప్రిల్ 8) అధికారికంగా ప్రకటన వచ్చింది. నేడు ఐకాన్ స్టార్ పుట్టిన రోజు కావడంతో అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది హారిక, హాసినీ క్రియేషన్స్. మరోసారి కలిసి పని చేసేందుకు వేచి ఉండలేకున్నామంటూ ట్వీట్ చేసింది.

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ - హారిక, హాసినీ క్రియేషన్స్ కాంబినేషన్‍లో ఇది నాలుగో చిత్రంగా ఉండనుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటి వరకు జులాయ్ (2012), సన్నాఫ్ సత్యమూర్తి (2015), అల వైకుంఠపురములో (2020)లో సినిమాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. రూ.250కోట్లకు పైగా కలెక్షన్లతో అప్పట్లో రికార్డులను తిరగరాసింది. కాగా, ఈ మూడు చిత్రాలను నిర్మించింది కూడా హారిక, హాసినీ క్రియేషన్స్ బ్యానరే. ఇప్పుడు వీరి కాంబోలో నాలుగో చిత్రం తెరకెక్కనుంది.

అట్లీతో కంటే ముందే..!

పుష్ప 2 తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేస్తారని బజ్ బాగా నడిచింది. స్టోరీ సిట్టింగ్స్ కూడా అయ్యాయని సమాచారం బయటికి వచ్చింది. కొన్ని ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై పెద్దగా అప్‍డేట్లు రాలేదు. అయితే, అట్లీతో మూవీ కంటే ముందే త్రివిక్రమ్ సినిమాను అల్లు అర్జున్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పుష్పతో అల్లు అర్జున్ రేంజ్.. పాన్ ఇండియా స్థాయికి చేరింది. గ్లోబల్ రేంజ్‍లో క్రేజ్ వచ్చింది. దీంతో ఆయనతో త్రివిక్రమ్ చేసే తదుపరి మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‍లోనే భారీ ఉండే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు కారంతో కాస్త నిరాశపరిచిన త్రివిక్రమ్.. బన్నీతో ఏ కథాంశంతో మూవీ చేస్తారో చూడాలి. గతంలో మూడు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉంటాయి.

కాగా, పుష్ప 2 ది రైజ్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అమ్మవారి గెటప్‍లో అల్లు అర్జున్ అద్భుతంగా కనిపించారు. స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సీక్వెల్ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

IPL_Entry_Point