Pushpa 2 Teaser: ‘టీజర్‌లా కాదు.. గ్లింప్స్‌లా ఉంది’!-allu arjun pushpa 2 the rule teaser reactions brilliant but looking like a glimpse ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Teaser: ‘టీజర్‌లా కాదు.. గ్లింప్స్‌లా ఉంది’!

Pushpa 2 Teaser: ‘టీజర్‌లా కాదు.. గ్లింప్స్‌లా ఉంది’!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 08, 2024 02:26 PM IST

Pushpa 2 The Rule Teaser: పుష్ప 2 సినిమా టీజర్ వచ్చేసింది. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే, ఇది టీజర్‌లా కాకుండా గ్లింప్స్‌లా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణాలేంటంటే..

Pushpa 2 Teaser: ‘టీజర్‌లా కాదు.. గ్లింప్స్‌లా ఉంది’!
Pushpa 2 Teaser: ‘టీజర్‌లా కాదు.. గ్లింప్స్‌లా ఉంది’!

Pushpa 2 Teaser: అందరూ ఎంతగానో ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా టీజర్ వచ్చేసింది. ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (ఏప్రిల్ 8) టీజర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న సినిమా కావడంతో టీజర్‌ వ్యూస్‍లో దూసుకెళుతోంది. మాతాంగి (అమ్మవారి) వేషంలో అల్లు అర్జున్ అద్భుతంగా ఉన్నారు. పుష్ప స్వాగ్, స్టైల్ అదిరిపోయింది. జాతర సీక్వెన్స్ సీన్‍తో కన్నుల పండుగగా ఉంది. అయితే, ఇది టీజర్‌లా కాకుండా గ్లింప్స్‌లా అనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే..

పుష్ప 2 టీజర్ మొత్తం ఒకే సీక్వెన్స్ ఉంది. అల్లు అర్జున్ కూడా ఒకే గెటప్‍లో కనిపించారు. ఎలాంటి డైలాగ్స్ కూడా లేవు. పుష్పరాజ్ (అల్లు అర్జున్) అమ్మవారి గెటప్‍ను చూపించేందుకు రిలీజ్ చేసిన వీడియోలా అనిపించింది. దీంతో ఇది టీజర్‌లా కాకుండా గ్లింప్స్‌లా ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

కొత్త విషయాలు లేవు!

నిమిషం పాటు ఉన్న పుష్ప 2 టీజర్లో కథ గురించి ఏ మాత్రం కాస్త కూడా హింట్ ఇవ్వలేదు మేకర్స్. విలన్‍ను, కొత్త క్యారెక్టర్లు ఎవరినీ దీంట్లో చూపించలేదు. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్, స్టైల్, ఓ యాక్షన్ స్టంట్‍ను మేకర్స్ హైలైట్ చేశారు.

గతేడాది అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఓ గ్లింప్స్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇప్పుడు, ఏడాది నిరీక్షణ తర్వాత ఈ టీజర్ తీసుకొచ్చింది. అయితే, టీజర్ ఆకట్టుకునేలా ఉన్నా.. పెద్దగా కొత్త విషయాలు లేకపోవడంతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టీజర్ హైలైట్స్ ఇవే..

అయితే, పుష్ప 2 టీజర్ మాత్రం అదిరిపోయింది. పట్టుచీర కట్టుకొని, ముఖానికి రంగులతో, ఆభరణాలు, కాళ్ల గజ్జలు, మెడలో దండలతో అమ్మవారి వేషంలో అల్లు అర్జున్ గెటప్ అద్భుతంగా ఉంది. పుష్పరాజ్‍గా ఆయన మరోసారి ఆ మార్క్ స్టైల్, స్వాగ్, గ్రేస్‍ను చూపించారు. నడకతోనే మెప్పించారు. యాక్షన్ కూడా స్టైలిష్‍‍గా కుదిరింది. చివర్లో అల్లు అర్జున్.. హుప్ అని అరవగానే అందరూ భయపడి వెనక్కి వెళ్లే షాట్ కూడా అదిరిపోయింది. దర్శకుడు సుకుమార్ మార్క్ ఈ టీజర్లోనూ స్పష్టంగా కనిపించింది. ఇక, సంగీతం దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కు బలంగా నిలిచింది. ఈ టీజర్ గూజ్‍బంప్స్ తెప్పించేలా ఉందనే కామెంట్లు వస్తున్నాయి.

పుష్ప 2 సినిమాలో జాతర సీక్వెన్స్ ఏ రేంజ్‍లో ఉండనుందో ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఇది హైలైట్‍గా నిలిచేలా కనిపిస్తోంది.

బిగ్ బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా పుష్ప 2: ది రూల్ చిత్రం వస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. భారీ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తొలి భాగంతో పోలిస్తే మరింత గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 మూవీ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను షేర్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

IPL_Entry_Point