Brahmamudi: బ్రహ్మముడి-కావ్యలాగే బొమ్మలకు రంగులేసుకుంటానన్న అపర్ణ- రాజ్‌ను గట్టిగా ఇరికించిన తల్లి- అత్తింటికి కళావతి?-brahmamudi serial latest episode aparna demands to raj take kavya to duggirala home star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: బ్రహ్మముడి-కావ్యలాగే బొమ్మలకు రంగులేసుకుంటానన్న అపర్ణ- రాజ్‌ను గట్టిగా ఇరికించిన తల్లి- అత్తింటికి కళావతి?

Brahmamudi: బ్రహ్మముడి-కావ్యలాగే బొమ్మలకు రంగులేసుకుంటానన్న అపర్ణ- రాజ్‌ను గట్టిగా ఇరికించిన తల్లి- అత్తింటికి కళావతి?

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కావ్య ఇంటికి రమ్మని రాజ్‌తో అపర్ణ అంటుంది. దాంతో రాజ్‌ను ఆపేందుకు రుద్రాణి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ, రాజ్ మాత్రం కావ్య ఇంటికి వెళ్లి అపర్ణను బుజ్జగిస్తాడు. కావ్య ఇంట్లోనే శేష జీవితం గడిపేస్తాను అని అపర్ణ తేల్చి చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్

Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌లో కావ్య పుట్టింట్లో ఉన్న అపర్ణతో రాజ్ ఫోన్‌లో మాట్లాడతాడు. ముందుగా తను రాజ్‌తో మాట్లాడనని అపర్ణ చెబుతుంది. రాజ్, అపర్ణకు మధ్యలో కనకం మాటలు అందిస్తుంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని రాజ్ అంటాడు.

రాజ్‌కు షాక్

దాంతో సంతోషంగా అపర్ణకు ఫోన్ ఇస్తుంది కనకం. నాతో ఎవరు మాట్లాడాలన్న, నేను మాట్లాడాలన్న ఇక్కడికి వచ్చి మాట్లాడమను. ఇలా ఫోన్‌లో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని చెప్పు కనకం అని అపర్ణ అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ అల్లుడు గారు మీ అమ్మగారు ఏం చెబుతున్నారంటే అని కనకం అంటుంటే.. వినిపించింది అని గట్టిగా అంటాడు రాజ్.

కావ్య ఇంటికి రాజ్

అపర్ణతో కాల్ మాట్లాడిన తర్వాత దుగ్గిరాల ఇంట్లో డిస్కషన్ నడుస్తుంది. కావ్య ఇంటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు రుద్రాణి ట్రై చేస్తుంది. ఇదంతా కావ్య వేసిన స్కెచ్ అని రాజ్‌కు నూరిపోస్తుంది రుద్రాణి. ఎవరు ఏం చేసినా ఆ కళావతి మాయలో పడనని రాజ్ గట్టిగా చెబుతాడు. తల్లి మీద ప్రేమతో అపర్ణను తీసుకురావడానికి మాత్రం కావ్య ఇంటికి వెళ్తాడు రాజ్.

తెలివిగా రప్పించారు కదూ

కనకం ఇంటికి రాజ్ కారు వేసుకుని వెళ్తాడు. ఇంట్లోకి రాజ్ నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి ఎదురుగా కావ్య వస్తుంది. దాంతో కావ్యపై కోప్పడతాడు రాజ్. కావ్యతో గొడవ పడతాడు. నేను దిగి రావాలని, మీ ఇంటికి రావాలని, నిన్ను తీసుకెళ్లాలని మా అమ్మను తెలివిగా ఇక్కడికి రప్పించారు కదూ అని రాజ్ కావ్యను నిందిస్తూ మాటలు అంటాడు.

కనకం క్యాన్సర్ నాటకం

ఆవిడ అంతట ఆవిడే వచ్చారు అని కావ్య సమాధానం ఇస్తుంది. కానీ, దాన్ని రాజ్ నమ్మడు. మా అమ్మ తనంతట తానే మీ ఇంటికి వచ్చిందని నమ్మేస్తాను అనుకుంటున్నావా అని రాజ్ అంటాడు. తాము ఎలాంటి ప్లాన్స్ చేయాలని కావ్య చెప్పడానికి ట్రై చేస్తుంది. అయినా రాజ్ ఎంతకీ వినడు. ఇదివరకు కనకం ఆడిన క్యాన్సర్ నాటకాన్ని గుర్తు చేస్తూ మాటలు అంటాడు రాజ్.

చిన్నపిల్లాడిలా బుజ్జగిస్తూ

తాను ఎంత చెప్పిన వినకపోయే సరికి ఆవిడ వస్తానంటే తీసుకెళ్లండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కావ్య చెబుతుంది. దాంతో రాజ్ కావ్యను ఏం అనలేక లోపలికి వెళ్తాడు. కావ్య బయటకు వెళ్తుంది. కనకం ఇంట్లో కూర్చున్న అపర్ణను బతిమిలాడుకుంటాడు రాజ్. రా మమ్మీ మన ఇంటికి వెళ్లిపోదాం పదా అని అపర్ణను పట్టుకుని చిన్నపిల్లాడిలి బుజ్జగిస్తాడు రాజ్.

బొమ్మలకు రంగులు వేసుకుంటూ

వస్తే కావ్యతోపాటే నేనే వస్తాను. లేదు అంటే కావ్యతోపాటు నేను ఇదే ఇంట్లో మట్టి బొమ్మలకు రంగులు వేసుకుంటూ నా శేష జీవితం గడిపేస్తూ ఉంటాను అని అపర్ణ అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. పక్కనే అదంతా కనకం వింటూ ఉంటుంది. ఇదంతా మీరు చేయడం వల్లే అని కనకంపై కోప్పడతాడు రాజ్. తానేం చేయలేదని, మీ ఇద్దరిని కలపడానికే వదిన ఇలా చేస్తున్నారని కనకం అంటుంది.

గట్టిగా ఇరికించిన అపర్ణ

కానీ, రాజ్ మాత్రం ఎవరినీ నమ్మడు. కావ్య లేకుండా తల్లి అపర్ణను ఇంటికి ఎలా తీసుకెళ్లాలో అర్థంకాకా సతమతం అవుతుంటాడు రాజ్. దాంతో ఎటు తేల్చుకోలేకుండా కొడుకును అపర్ణ గట్టిగా ఇరికించినట్లు అయింది.

అత్తింటికి కావ్య?

మరి రాజ్ తల్లి అపర్ణ ఒక్కరినే దుగ్గిరాల ఇంటికి తీసుకెళ్తాడా.. కావ్యను కూడా కాపురానికి తీసుకెళ్లేందుకు ఒప్పుకుంటాడో చూడాలి. అలాగే, రాజ్‌తో వెళ్లేందుకు కావ్య ఒప్పుకుంటుందా, ఆఖరుకి అత్తింటికి కావ్య వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.