Horror Movie: ట్విస్ట్‌లతో సాగే మలయాళం హారర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎక్కడ చూడాలంటే?
Horror Movie: టోవినో థామస్ హీరోగా నటించిన హారర్ మూవీ భార్గవి నిలయం యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ మూవీలో రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో నీలవెలిచామ్ పేరుతో ఈ మూవీ రూపొందింది.
Horror Movie: టోవినో థామస్ హీరోగా నటించిన హారర్ మూవీ భార్గవి నిలయం యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో శనివారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళంలో నీలవెలిచామ్ పేరుతో రూపొందిన ఈ మూవీ తెలుగులో భార్గవి నిలయం పేరుతో అనువాదమైంది. భార్గవి నిలయం మూవీకి ఆషిక్ అబూ దర్శకత్వం వహించాడు.
మోస్తారు వసూళ్లు...
ఈ హారర్ మూవీలో టోవినో థామస్‌తో పాటు రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గత ఏడాది ఏప్రిల్‌లో మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ హారర్ మూవీ మోస్తారు వసూళ్లను రాబట్టింది.
డైరెక్ట్‌గా ఓటీటీలో...
భార్గవి నిలయం తెలుగులో మాత్రం థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ వైపు ఓటీటీలో ఉండగానే తాజాగా యూట్యూబ్‌లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.
భార్గవి నిలయం కథ...
భార్గవి నిలయం బంగళా పేరు వింటనే ఊరివాళ్లు వణికిపోతుంటారు. భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లో తిరుగుతుందని, అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి. బషీర్ (టోవినో థామస్) అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులో అద్దెకు దిగుతాడు.
మరో ఇంటికి మారడానికి అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో భార్గవి ఆత్మతో స్నేహం చేస్తూ అదే పాడుబడ్డ ఇంటిలో ఒంటరిగా ఉంటుంటాడు బషీర్. భార్గవి గురించి కథ రాయాలని ఫిక్సవుతాడు బషీర్. ప్రేమలో విఫలమై భార్గవి ఆత్మహత్య చేసుకుందని ఊరివాళ్లు బషీర్‌తో చెబుతారు.
వారు చెప్పింది నిజమేనా? భార్గవిని ప్రాణంగా ప్రేమించిన శివకుమార్ (రోషన్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? భార్గవి, శివకుమార్ ప్రేమ విఫలం కావడానికి నారాయణన్ అలియాస్ నాన్ కుట్టీకి ఏ విధమైన సంబంధం ఉంది? తనకు జరిగిన అన్యాయంపై భార్గవి ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్నదే భార్గవి నిలయం కథ.
బ్లాక్‌బస్టర్స్...
మలయాళంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ విజయాల్ని అందుకుంటున్నాడు టోవినో థామస్. ఈ ఏడాది అతడు హీరోగా నటించిన అన్వేషిప్పిమ్ కండేతుమ్, ఏఆర్ఎమ్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ముప్పై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఏఆర్ఎమ్ వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
టాపిక్