Pushpa 2 Teaser Out: పుష్ప 2 టీజర్ అదుర్స్.. అమ్మవారిగా అల్లు అర్జున్ మాస్ అవతార్.. బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్-pushpa 2 teaser out now on allu arjun birthday special pushpa the rule teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Teaser Out: పుష్ప 2 టీజర్ అదుర్స్.. అమ్మవారిగా అల్లు అర్జున్ మాస్ అవతార్.. బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్

Pushpa 2 Teaser Out: పుష్ప 2 టీజర్ అదుర్స్.. అమ్మవారిగా అల్లు అర్జున్ మాస్ అవతార్.. బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్

Sanjiv Kumar HT Telugu
Apr 08, 2024 11:09 AM IST

Allu Arjun Pushpa 2 Teaser Out Now: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా పుష్ప 2 టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పుష్ప ది రూల్ టీజర్ ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇంకా టీజర్ పూర్తి విశేషాల్లోకి వెళితే..

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల

Pushpa 2 Teaser Out Allu Arjun Birthday: ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ టీజర్ గురించి ఇటీవలే అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

yearly horoscope entry point

చెప్పినట్లుగానే

దాంతో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు, ఇటు పుష్ప ఆడియెన్స్ తెగ సంతోషించారు. ఏప్రిల్ 8న ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుష్ప 2 టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా మేక‌ర్స్‌ ప్రకటించారు. చెప్పినట్లుగానే సోమవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు పుష్ప ది రూల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అంచనాలు మరింత పెరిగేలా

పుష్ప 2 టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మరోసారి బన్నీ తన యాక్టింగ్ మార్క్‌తో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో చూపించిన సన్నివేశాలు పుష్ప 2పై మరింత అంచనాలు పెంచేలా ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ మరోసారి ప్రేక్షకులను, క్రిటిక్స్‌ను ఇంప్రెస్ చేయనుందని తెలుస్తోంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి సెన్సేషన్ కానున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.

అదిరిపోయిన స్వాగ్

పుష్ప 2 టీజర్‌లో అమ్మవారి గెటప్‌లో మాస్ అవతారంతో అల్లు అర్జున్ కనిపించాడు. ఏదో ఒక జాతరతో రౌడీలతో ఫైట్ సీన్‌కు సంబంధించిన సీన్స్ చూపించారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, ఇయర్ రింగ్స్, కళ్లకు కాటుకతో అల్లు అర్జున్ లుక్ మైండ్ బ్లోయింగ్‌లా ఉంది. ఫైట్ సీక్వెన్స్ కూడా స్టన్నింగ్‌గా ఉంది. ఇక ఈ సీన్స్‌కు దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. అల్లు అర్జున్ బర్త్ డేకు అభిమానులకు పర్ఫెక్ట్ గిఫ్ట్‌లా ఉంది పుష్ప 2 టీజర్.

జాతీయ స్థాయి అవార్డ్

ఇదిలా ఉంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయ స్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

ఆగస్టు 15న రిలీజ్

పుష్ప 2 సినిమాను 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

Whats_app_banner