IICT Hyderabad Jobs 2024 : ఐఐసీటీ హైదరాబాద్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 29 ఖాళీలు, మంచి జీతం..!-iict hyderabad invites applications for 29 technician jobs in various departments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Iict Hyderabad Jobs 2024 : ఐఐసీటీ హైదరాబాద్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 29 ఖాళీలు, మంచి జీతం..!

IICT Hyderabad Jobs 2024 : ఐఐసీటీ హైదరాబాద్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 29 ఖాళీలు, మంచి జీతం..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 24, 2024 06:02 AM IST

IICT Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ లోని ఐఐసీటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో 29 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఎంపికైన వారికి రూ. 38,483 జీతం చెల్లిస్తారు.

ఐఐసీటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్
ఐఐసీటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (IICT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 29 టెక్నీషియన్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇంజినీరింగ్ సర్వీస్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పాసై ఉండాలి. వయసు 28 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 38,483 జీతం చెల్లిస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

నవంబర్ 27వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. https://www.iict.res.in/CAREERS వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి మూడు పరీక్షలు ఉంటాయి. ఓఎంఆర్ విధానంలో లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 1 లో 50 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం వంద మార్కులు కేటాయించారు. ఈ ఎగ్జామ్ లో మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రస్నలు ఉంటాయి. ఇక పేపర్ 2 లో జనరల్ అవర్నేస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ంటాయి. మొత్తం 50 ప్రశ్నలు..150 మార్కులు కేటాయించారు. పేపర్ 3 లో సంబంధిత సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులు కేటాయించారు. పేపర్ 1 లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కానీ... పేపర్ 2, 3 లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

31 సెంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ :

ఇటీవలనే హైదరాబాద్ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (IICT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 31 సెంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్ల లోపు ఉండాలి. ఆర్గానికి కెమిస్ట్రీ, అగ్రో కెమిస్ట్రీ, ఇన్ ఆర్గానికి కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్గానిక్ కోటింగ్, పాలిమర్స్, కెమికల్ బయాలజీతో పాటు డిజైన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి రూ. 1,34,907 జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ చేసి ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో వివరించారు. అభ్యర్థుల షార్ట్‌ లిస్టింగ్‌ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తు రుసుం కింద రూ.500 చెల్లించాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.iict.res.in/g4recruitment/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 09, 2024 తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించరు. నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును https://www.onlinesbi.sbi/sbicollec లింక్ పై క్లిక్ చేసి చెల్లించుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం