Allu Arjun: అల్లు అర్జున్‍ను కలిసి వెక్కివెక్కి ఏడ్చిన ఫ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో-fan gets emotional while meet pushpa 2 actor allu arjun video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Fan Gets Emotional While Meet Pushpa 2 Actor Allu Arjun Video Goes Viral

Allu Arjun: అల్లు అర్జున్‍ను కలిసి వెక్కివెక్కి ఏడ్చిన ఫ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 20, 2024 10:28 PM IST

Allu Arjun - Viral Video: స్టార్ హీరో అల్లు అర్జున్‍ను ఓ అభిమాని కలిశారు. తన ఫేవరెట్ హీరోను కలవటంతో అతడు భావోద్వేగంతో ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Allu Arjun: అల్లు అర్జున్‍ను కలిసి వెక్కివెక్కి ఏడ్చిన ఫ్యాన్
Allu Arjun: అల్లు అర్జున్‍ను కలిసి వెక్కివెక్కి ఏడ్చిన ఫ్యాన్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీని అభిమానులు చాలా ఇష్టపడతారు. అతడు ఎక్కడ కనిపించినా వారి హోరు మామూలుగా ఉండదు. అల్లు అర్జున్‍ను ఒక్కసారైనా కలవాలని ప్రతీ అభిమాని కోరుకుంటారు. అయితే, అలా ఎంతో కాలంగా వేచిచూస్తున్న ఓ అభిమానికి ఆ అవకాశం దక్కింది. అల్లు అర్జున్‍ను కలిసే ఛాన్స్ వచ్చింది. దీంతో తన అభిమాన నటుడి చూడగానే అతడు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

అల్లు అర్జున్‍ను ఓ వీర అభిమాని హైదరాబాద్‍లో నేడు కలిశారు. ఈ సందర్భంగా ఆ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చారు. ఐకాన్ స్టార్ చేతులను పట్టుకొని కన్నీరు పెట్టుకున్నారు. అతడిని ఆప్యాయంగా పట్టుకొని ఓదార్చారు అల్లు అర్జున్. తన అభిమానితో ప్రేమగా మాట్లాడారు. అతడు చెప్పిన విషయాలను ఓపిగ్గా విన్నారు. ఆ తర్వాత తన ఫ్యాన్‍తో కలిసి ఫొటోలు దిగారు.

అల్లు అర్జున్ కలిసిన సమయంలో అభిమాని ఎమోషనల్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. లక్కీ ఫ్యాన్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అమితంగా అభిమానించే నటుడిని కలిసినప్పుడు ఎమోషనల్ అవడం సహజమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్‍ను అంత ఆప్యాయంగా పలకరించిన అల్లు అర్జున్‍ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఐకాన్ స్టార్ మనసు మంచిదంటూ కొందరు రాసుకొస్తున్నారు.

ఆర్టీఏ ఆఫీస్‍లో అల్లు అర్జున్

హైదరాబాద్‍లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‍కు నేడు వెళ్లారు అల్లు అర్జున్. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. పుష్ప 2: ది రూల్ సినిమాలో భాగంగా జపాన్‍లో కార్ ఛేజింగ్ సీన్ ఉండనుందని… అందుకే ఇంటర్నేషనల్ లైసెన్స్ కోసం అల్లు అర్జున్ అప్లై చేశారనే టాక్ నడుస్తోంది. మొత్తంగా ఆర్టీఏ ఆఫీస్‍కు అల్లు అర్జున్ వెళ్లిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వేగంగా పుష్ప 2 షూటింగ్

పుష్ప 2: ది రూల్ సినిమా షూటింగ్‍ వేగంగా సాగుతోంది. ఇటీవలే విశాఖపట్నంలో షెడ్యూల్ పూర్తయింది. బన్నీ వైజాగ్ వచ్చిన సందర్భంగా అభిమానులు భారీస్థాయిలో స్వాగతం పలికారు. తదుపరి షెడ్యూల్ కూడా అతిత్వరలో మొదలుకానుంది. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేసేలా సిద్దం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ హిట్ అయిన పుష్పకు సీక్వెల్‍గా పుష్ప 2: ది రూల్ తెరకెక్కుతోంది. భారీ స్థాయిలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

పుష్ప 2: ది రూల్ మూవీలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‍గా చేస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, రావురమేశ్ అనసూయ భరద్వాజ్ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

IPL_Entry_Point