Pushpa 2 OTT Update: పుష్ప 2 ఓటీటీ పార్ట్‌నర్ ఇదే.. అఫీషియల్ అప్‍డేట్ వచ్చేసింది
Pushpa 2 The Rule OTT: పుష్ప 2: ది రూల్ సినిమా ఓటీటీ అప్‍డేట్ వచ్చేసింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా ఏ ఓటీటీలోకి రానుందో ఫిక్స్ అయింది. ఈ విషయంలో అఫీషియల్ అప్‍డేట్ వచ్చేసింది.
Pushpa 2 The Rule OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం కోసం సినీ ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి తెలుగుతో పాటు దేశమంతా ఫుల్ క్రేజ్ ఉంది. 2021లో వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దీంతో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.
పుష్ప 2: ది రూల్ చిత్రానికి సంబంధించి ఓటీటీ ఒప్పందం అప్పుడే జరిగిపోయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. నేడు (జనవరి 15) సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. థియేట్రికల్ రిలీజ్, రన్ తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ వస్తుందని తెలిపింది.
థియేట్రికల్ రన్ తర్వాత తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పుష్ప 2 చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. నెట్‍ఫ్లిక్స్ పండగ పేరుతో ఈ విషయాన్ని వెల్లడించింది.
పుష్ప 2: ది రూల్ సినిమా ఓటీటీ హక్కులను సుమారు రూ.100 కోట్లు వెచ్చించి నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీకి ఉన్న క్రేజ్‍ను బట్టి ఇంత పెద్ద మొత్తం చెల్లించేందుకు ఆ ప్లాట్‍ఫామ్ ఓకే చెప్పిందట. అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరిగినా ఇంత భారీ ధర చెల్లించేందుకు ఆ ప్లాట్‍ఫామ్ సుముఖత చూపలేదు.
పుష్ప 1: ది రైజ్ మూవీని 2021లో రూ.30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే, ఇప్పుడు పుష్ప 2కు నెట్‍ఫ్లిక్స్ అంతకు మూడింతలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఆ స్థాయిలో ఈ సీక్వెల్‍కు క్రేజ్ పెరిగింది.
పుష్ప 2: ది రూల్ సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేలా మేకర్స్.. నెట్‍ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
తొలి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ పుష్ప 2ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావురమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
దేవర కూడా నెట్‍ఫ్లిక్స్‌కే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ దేవర సినిమా ఓటీటీ హక్కులను కూడా నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దేవర పార్ట్-1 ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. టిల్లూ స్క్వైర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఎన్‍బీకే 109 (బాలకృష్ణ - బాబీ) సహా మరిన్ని చిత్రాల గురించి నేడు అప్‍డేట్ ఇచ్చింది నెట్‍ఫ్లిక్స్.