Allu Arjun: పుష్ప 2 షూటింగ్ అప్‍డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. అభిమానులే తనకు స్ఫూర్తి అన్న ఐకాన్ స్టార్-allu arjun shares pushpa 2 the rule shooting at mangalavaaram pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: పుష్ప 2 షూటింగ్ అప్‍డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. అభిమానులే తనకు స్ఫూర్తి అన్న ఐకాన్ స్టార్

Allu Arjun: పుష్ప 2 షూటింగ్ అప్‍డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. అభిమానులే తనకు స్ఫూర్తి అన్న ఐకాన్ స్టార్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 11, 2023 11:47 PM IST

Allu Arjun on Pushpa 2 Shooting: పుష్ప 2 షూటింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మంగళవారం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun on Pushpa 2 Shooting: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2 ది రూల్’ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘పుష్ప-1 ది రైజ్’ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్‍ను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగానూ అవార్డు దక్కించుకొని చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్‍. కాగా, తాజాగా ‘పుష్ప-2 ది రూల్’ మూవీ షూటింగ్ గురించి అప్‍డేట్ చెప్పారు అల్లు అర్జున్. నేడు (నవంబర్ 11) జరిగిన మంగళవారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్‍ హాజరయ్యారు.

ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మంగళవారం మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‍కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్ప గురించి చెప్పాలని అభిమానులు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో పుష్ప 2 ది రూల్ మూవీ షూటింగ్ అప్‍డేట్‍ను అల్లు అర్జున్ చెప్పారు.

పుష్ప షూటింగ్ నుంచే తాను ఈ ఈవెంట్‍కు వచ్చానని అల్లు అర్జున్ తెలిపారు. ఫస్ట్ లుక్‍లో ఉన్న గెటప్‍లో ప్రస్తుతం జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్టు ఐకాన్ స్టార్ అన్నారు. “రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి పుష్ప షూటింగ్ నుంచే వచ్చా. మీకు కనిపిస్తుందో లేదో చేతులకు కొంచెం పారాణి, నెయిల్ పాలిష్ ఉంది. ఆ గెటప్ ఉంటుంది కదా.. పుష్ప 2లో గెటప్.. ఆ జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. పుష్ప గురించి ఇదే అప్‍డేట్. సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతుంది. దాని గురించి వేరే ఈవెంట్‍లో మాట్లాడుకోవచ్చు” అని అల్లు అర్జున్ అన్నారు.

జాతీయ అవార్డు అందుకున్నాక తాను వచ్చిన తొలి పబ్లిక్ ఈవెంట్ ఇదేనని, తనను అభినందించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు అల్లు అర్జున్. ఆర్మీలా తనకు అండగా ఉండే అభిమానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. తనకు బలం ఫ్యాన్సేనని ఐకాన్ స్టార్ అన్నారు.

“చాలా మంది అభిమానులకు వారి హీరోలే స్ఫూర్తి (ఇన్‍స్పిరేషన్) ఏమో. కానీ నాకు నా ఫ్యాన్సే ఇన్‍స్పిరేషన్. నన్ను నేను డౌట్ పడుతుంటే.. అప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నా మీద నాకు ఆత్మవిశ్వాసం వస్తుంటుంది. నా మీద నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. థాంక్యూ మై డియర్ ఫ్యాన్స్” అని అభిమానులతో అన్నారు అల్లు అర్జున్.

మంగళవారం సినిమా నవంబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తోంది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి అజ్నీశ్ లోక్‍నాథ్ సంగీతం అందించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం