Hyderabad ECIL: డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఏడాది అప్రంటీస్, స్టైఫెండ్…
Hyderabad ECIL: హైదరాబాద్ ఎలక్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు,డిప్లొమా టెక్నిషియన్ అప్రంటీస్‌లకు నోటఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు స్టైపెండ్‌తో కూడిన శిక్షణ అందిస్తారు.
Hyderabad ECIL: కేంద్రప్రభుత్వ అటామిక్ఎనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో న్యూక్లియర్, సెక్యూరిటీ, ఏరోస్పేస్, ఐటీ, టెలికాం, ఈ గవర్నెన్స్‌రంగాలపై పరిశోధనలు నిర్వహిస్తారు. ఈ సంస్థలో డిప్లొమా అభ్యర్థులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏడాదిపాటు అప్రంటీస్ ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
2024-25 విద్యా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రంటీస్, డిప్లొమా టెక్నిషియన్ అప్రంటీస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రంటీస్ విభాగంలో మొత్తం 150ఖాళీలు ఉన్నాయి. ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈఐఈ విభాగాల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులు అప్రంటీస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.9వేల స్టైఫెండ్ చెల్లిస్తారు. డిప్లొమా టెక్నిషియన్ విభాగంలో 37ఖాళీలను భర్తీ చేస్తారు. వీరికి నెలకు రూ.8వేలు చెల్లిస్తారు.
వయోపరిమితి..
దరఖాస్తుదారులు గరిష్టంగా 25ఏళ్లలోపు వయస్కులై ఉండాలి. 2025 జనవరి 1 నుంచి ఏడాది పాటు అప్రంటీస్ కొనసాగుతుంది. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసలకు3ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలిస్తారు.
విద్యార్హతలు...
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రంటీస్‌కు 2022 ఏప్రిల్ 1 తర్వాత ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా అప్రంటీస్‌కు మూడేళ్ల డిప్లొమా కోర్సులను 2022 ఏప్రిల్ 1 తర్వాత పూర్తి చేసిన వారు అర్హులు. భారత పౌరులు మాత్రమే దరఖాస్తు యాల్సి ఉంటుంది.
దరఖాస్తులు...
అప్రంటీస్ పొందాలనుకుంటున్న వారు మొదట https://nats.education.gov.in/ లో అప్రంటీస్ కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న తర్వాత ఈసీఐఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కెరీర్స్‌లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్‌లో నమోదుచ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈసీఐల్‌కు దరఖాస్తు చేసిన వాటిని మాత్రమే అమోదిస్తారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన తర్వాత ధృవీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేస్తారు.
కావాల్సిన పత్రాలు...
సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసిన అప్లికేషన్ కాపీతో పాటు కలర్ ఫోటో జత చేసి తీసుకెళ్లాలి. నేషనల్ అప్రంటీస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసిన వివరాలకు అనుగుణంగా అన్ని ఒరిజినల్ విద్యార్హత పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ వంటి వాటితో పాటు విద్యార్హత పత్రాలు, దివ్యాంగుల ధృవీకరణ, క్యాస్ట్ సర్టిఫికెట్ ఒరిజనల్, డూప్లికేట్ తీసుకెళ్లాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ హైదరాబాద్‌లో ఈసీఐఎల్ కాంప్లెక్స్‌లోని కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు...
రిజిస్ట్రేషన్లు ప్రారంభం... 20-11-2024 ఉదయం 10.30
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ... డిసెంబర్ 1, 2024
ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను డిసెంబర్ 4 ప్రకటిస్తారు. డిసెంబర్ 9 నుంచి 11వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జనవరి 1 నుంచి అప్రంటీస్ మొదలవుతుంది.