Telangana News Live November 24, 2024: Hydra Commissioner House : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో, క్లారిటీ!-today telangana news latest updates november 24 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 24, 2024: Hydra Commissioner House : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో, క్లారిటీ!

Hydra Commissioner House : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో, క్లారిటీ!

Telangana News Live November 24, 2024: Hydra Commissioner House : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో, క్లారిటీ!

04:26 PM ISTNov 24, 2024 09:56 PM HT Telugu Desk
  • Share on Facebook
04:26 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 24 Nov 202404:26 PM IST

తెలంగాణ News Live: Hydra Commissioner House : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో, క్లారిటీ!

  • Hydra Commissioner House : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఏవీ రంగనాథ్ స్పందించారు. తన ఇల్లు బఫర్ జోన్ లో లేదని క్లారిటీ ఇచ్చారు. 44 ఏళ్ల క్రితం తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202412:17 PM IST

తెలంగాణ News Live: CRY Walk To EmpowHER : బాలికల చదువు దేశ భవితకు వెలుగు నినాదంతో హైదరాబాద్‌లో క్రై సంస్థ వాక్

  • CRY Walk To EmpowHER : ప్రముఖ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యు ఆదివారం హైదరాబాద్ లో వాక్ టు ఎంపవర్‌ హర్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎ. నిర్మల కాంతి వెస్లీ..బాలికలు చదువుకుంటే దేశానికే మార్గదర్శకులు అవుతారన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202411:38 AM IST

తెలంగాణ News Live: BC Ranabheri : 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం : ఆర్ కృష్ణయ్య

  • BC Ranabheri : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సంచలన ప్రకటన చేశారు. 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దీనికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ప్రైవేట్ రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202411:08 AM IST

తెలంగాణ News Live: Karimnagar : కరీంనగర్‌లో నకిలీ ధ్రువపత్రాల కలకలం.. నలుగురిపై కేసు.. ముగ్గురు అరెస్టు

  • Karimnagar : కరీంనగర్‌లో ఆక్రమణలకు పాల్పడే వారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తప్పుదారుల్లో భూములను ఆక్రమించుకునేందుకు స్కెచ్ వేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూమి ఆక్రమించిన నలుగురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202409:26 AM IST

తెలంగాణ News Live: Notice To Actor Ali : ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు, సినీనటుడు అలీకి నోటీసులు

  • Notice To Actor Ali : సినీ నటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎక్ మామిడి పంచాయతీ అధికారులు నోటీసులు పంపారు. గ్రామంలోని తన ఫామ్ హౌస్ లో అలీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలకు తగిన పత్రాలు చూపించాలని ఆదేశించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202408:01 AM IST

తెలంగాణ News Live: TVVP Recruitment 2024 : తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 64 ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొద్ది గంటలే గడువు..!

  • TVVP Recruitment 2024 : తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 64 పోస్టులున్నాయి. దరఖాస్తు గడువు నవంబర్ 26వ తేదీతో పూర్తి కానుంది. https://hyderabad.telangana.gov.in/n వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202407:59 AM IST

తెలంగాణ News Live: South Central Railway : ఈ రైళ్లలో ప్రయాణం నరకం.. పైగా ఎక్కువ ఛార్జీలు! ఎందుకిలా?

  • South Central Railway : ఎక్కువ దూరం సౌకర్యవంతంగా ప్రయాణించడానికి చాలామంది రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రెగ్యులర్ సర్వీసులు లేకపోతే.. ఎక్కువ డబ్బులు పెట్టి స్పెషల్ ట్రైన్స్‌లో వెళ్తున్నారు. కానీ.. వారికి నరకం కనిపిస్తోంది. ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202407:10 AM IST

తెలంగాణ News Live: BRS Deeksha Diwas : తెలంగాణ తల్లికి ప్రణమిల్లుదాం.. కేటీఆర్ పిలుపు.. ఈనెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్

  • BRS Deeksha Diwas : ఈనెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించాలని.. కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణలో మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణపై కేసీఆర్ ముద్రను ఎవరూ చేరిపేయలేరని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202405:17 AM IST

తెలంగాణ News Live: TG Samagra Kutumba Survey : 'కోటి' దాటిన సమగ్ర కుటుంబ సర్వే - ప్రారంభమైన డేటా ఎంట్రీ

  • Telangana Samagra Kutumba Survey : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తుది దశకు చేరింది. మరోవైపు శనివారం నుంచి వివరాల కంప్యూటరీకరణ కూడా షురూ అయింది. ఈ నెలఖారులోపు ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202405:02 AM IST

తెలంగాణ News Live: Hyderabad ECIL: డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్లకు హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఏడాది అప్రంటీస్‌, స్టైఫెండ్‌…

  • Hyderabad ECIL: హైదరాబాద్‌ ఎలక్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు,డిప్లొమా టెక్నిషియన్‌ అప్రంటీస్‌లకు నోటఫికేషన్‌ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు స్టైపెండ్‌తో కూడిన శిక్షణ అందిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202402:15 AM IST

తెలంగాణ News Live: Karimnagar : కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో సైబర్ మోసం - తీగ లాగితే డొంక కదిలింది..!

  • కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో సైబర్ నేరస్తులు కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా మోసం చేశారు. ఆమె వద్ద నుంచి  రూ.21 లక్షల 80 వేలు కాజేశారు. మోసపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఒడిస్సా కు చెందిన సైబర్ నేరస్తుడిని  పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202412:32 AM IST

తెలంగాణ News Live: IICT Hyderabad Jobs 2024 : ఐఐసీటీ హైదరాబాద్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 29 ఖాళీలు, మంచి జీతం..!

  • IICT Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ లోని ఐఐసీటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో 29 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఎంపికైన వారికి రూ. 38,483 జీతం చెల్లిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 24 Nov 202411:51 PM IST

తెలంగాణ News Live: Kodangal Constituency : కొడంగల్ లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్‌ - సీఎం రేవంత్ కీలక ప్రకటన

  • కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పుకొచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి