New bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​- ​మరింత బోల్డ్​గా, మరింత స్టైలిష్​గా..-royal enfield goan classic 350 launched in india check out details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​- ​మరింత బోల్డ్​గా, మరింత స్టైలిష్​గా..

New bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​- ​మరింత బోల్డ్​గా, మరింత స్టైలిష్​గా..

Sharath Chitturi HT Telugu
Nov 24, 2024 09:43 AM IST

Royal Enfield Goan Classic 350 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్ అయ్యింది. దీని పేరు రాయల్​ ఎన్​ఫీల్డ్​ గోవాన్​ క్లాసిక్​ 350. ఈ బైక్​ ఫీచర్స్​, ఇంజిన్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ గోవాన్​ క్లాసిక్​ 350..
రాయల్​ ఎన్​ఫీల్డ్​ గోవాన్​ క్లాసిక్​ 350..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ లవర్స్​కి క్రేజీ అప్డేట్​!  కొత్త రాయల్ రాయల్​ ఎన్​ఫీల్డ్​ గోవాన్​ క్లాసిక్ 350 బైక్​ని మోటోవర్స్ 2024లో లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. కొత్త గోవాన్​ క్లాసిక్ 350.. క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించిన బాబర్! దీనికి ప్రామాణికమైన బాబర్ అప్పీల్ ఇవ్వడానికి అనేక మార్పులు చేసింది సంస్థ. ఈ నేపథ్యంలో ఈ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గోవాన్​ క్లాసిక్ 350: డిజైన్..

కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్ గోవాన్​ క్లాసిక్ 350 బాబర్ జే-సిరీస్ ప్లాట్​ఫామ్​ ఆధారంగా వచ్చిన ఐదొవ మోటార్​సైకిల్. ఈ బైక్ క్లాసిక్ 350తో తన మూలాలను పంచుకుంటుంది. అయితే 100 ఎంఎం పొడవైన హ్యాండిల్ బార్, కట్​ చేసిన ఫెండర్లు, డిటాచెబుల్ పిలియన్ సీటు, 19-ఇంచ్​ ముందు- 16-ఇంచ్​ రేర్​క ట్యూబ్​లెస్ స్పోక్ వీల్స్​తో సహా అనేక స్టైలింగ్ డిఫరెన్స్​లను ఈ బైక్​ కలిగి ఉంది. ప్రస్తుతం దేశంలో ట్యూబ్​లెస్ స్పోక్ వీల్స్ ఉన్న మోటార్ సైకిల్ ఇదే కావడం విశేషం!

గోవాన్​ క్లాసిక్ 350.. టాప్-స్పెక్ క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించిన ఆల్-ఎల్​ఈడీ లైటింగ్​ని పొందింది. ఈ బైక్​లో అడ్జెస్టెబుల్ బ్రేక్, క్లచ్ లివర్లు, ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్​లో భాగంగా ఫ్యూయల్ గేజ్, గేర్ ఇండికేటర్, 2 ట్రిప్ మీటర్లతో డిజిటల్ రీడౌట్ కూడా ఉన్నాయి. ఆర్ఈ గోవాన్​ క్లాసిక్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్.

రాయల్ ఎన్​ఫీల్డ్​ గోవాన్​ క్లాసిక్ 350: ఇంజిన్..

349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ మోటార్ 20.2 బీహెచ్​పీ, 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇతర బైక్​ భాగాల్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్లు ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్​తో బైబ్రే యూనిట్లలో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ గోవాన్​ క్లాసిక్ 350: ప్రత్యర్థులు..

కొత్త గోవాన్​ క్లాసిక్ 350.. సెగ్మెంట్​లో జావా పెరాక్, జావా 42 బాబర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. సింగిల్-సీట్ డిజైన్​తో బాబర్ బాడీ స్టైల్​కు దీని పోటీ మరింత ప్రామాణికంగా ఉన్నప్పటికీ, గోవాన్​ క్లాసిక్ బైక్​ ప్రామాణికంగా లభించే పిలియన్ సీటుతో మరింత అట్రాక్టివ్​గా ఉంటుంది.

ఈ కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్​ గోవాన్​ క్లాసిక్ 350 ధర రూ .2.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. డెలివరీలు ఎప్పుడు మొదలవుతాయి? బుకింగ్స్​ ఎప్పుడు చేసుకోవచ్చు? వంటి వివరాలపై త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది.

ఇక ఇదే మోటోవర్స్​ 2024లో రాయల్ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్ 440 ని కూడా సంస్థ ఆవిష్కరించింది. ఈ బైక్​ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం