BEL Jobs: రూ.12.5లక్షల వార్షిక వేతనంతో బెల్‌లో ఉద్యోగాలు…దరఖాస్తు చేయండి ఇలా-engineer job recruitment in bharath electronics limited with 12 5lac salary package ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bel Jobs: రూ.12.5లక్షల వార్షిక వేతనంతో బెల్‌లో ఉద్యోగాలు…దరఖాస్తు చేయండి ఇలా

BEL Jobs: రూ.12.5లక్షల వార్షిక వేతనంతో బెల్‌లో ఉద్యోగాలు…దరఖాస్తు చేయండి ఇలా

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 24, 2024 09:20 AM IST

BEL Jobs: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రకాల ఇంజీనిరింగ్ విభాగాల్లో గరిష్టంగా ఏడేళ్ల కాల వ్యవధితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వార్షిక వేతనం రూ.12.5లక్షల వరకు చెల్లిస్తారు.

బెల్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
బెల్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

BEL Jobs: కేంద్రప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐదేళ్ల నిర్ణీత కాలానికి పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలను పనితీరు ఆధారంగా ఏడేళ్ల వరకు పొడిగిస్తారు. భర్తీ చేసే పోస్టుల్లో  బెంగుళూరులోని బెల్ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌ పోస్టులు 48, మెకానికల్‌ 52, కంప్యూటర్ సైన్స్‌ ఇంజనీర్లు 75, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు 2 ఖాళీలు ఉన్నాయి.

  • అంబాలా, జోద్‌పూర్‌, బటిండాలోని కేంద్రాల్లో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్స్ పోస్టులు 3 ఉన్నాయి.
  • ముంబై, విశాఖపట్నం కేంద్రాల్లో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్ పోస్టులు 2 ఉన్నాయి.
  • విశాఖపట్నం, ఢిల్లీ, ఇండోర్‌లలో కంప్యూటర్ సైన్స్‌ ఇంజనీర్‌ పోస్టులు 10 ఉన్నాయి.
  • ఘజియాబాద్‌లో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్ పోస్టులు 10, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ పోస్టులు 5 ఉన్నాయి.
  • మొత్తం పోస్టుల్లో అన్‌ రిజర్వుడు పోస్టులు 9, ఈడబ్ల్యుఎస్‌ పోస్టులు 20, ఓబీసీ 61, ఎస్సీ 32, ఎస్టీ 17 ఉన్నాయి. వికలాంగుల కోట ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.

దరఖాస్తు చేసేవారికి 2024 నవంబర్ 1 నాటికి 28ఏళ్లలోపు వయసు ఉండాలి. ఓబీసీలకు 3ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5ఏల్లు, 40శాతం మించిన దివ్యాంగులకు 10ఏళ్ల సడలింపు ఇస్తారు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి.

https://jobapply.in/BEL2024BNGEngineerFTE/Default.aspx 

అర్హతలు...

  • ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్‌, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్‌అండ్ కమ్యూనికేన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్, ఇన్‌స్ట్రూమెంటేషన్‌, కమ్యూనికేషన్‌, టెలి కమ్యూనికేషన్‌ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.
  • మెకానికల్ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్‌, మెకట్రానిక్స్‌, ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్ విద్యార్హతలు ఉండాలి.
  • కంప్యూటర్ సైన్స్‌ ఇంజనీర్ పోస్టులకు సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్‌ అండ్ ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్‌, డేటా సైన్స్‌ అండ్ ఇంజనీరింగ్‌, అర్టిఫిషియల్ ఇంజనీరింగ్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ విద్యార్హతలు ఉండాలి.
  • ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్ విద్యార్హతలు ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులను బెల్ అవసరాలకు అనుగుణంగా బెంగుళూరు, అంబాలా, జోధ్‌పూర్‌, బటిండా, ముంబై, వైజాగ్‌, ఢిల్లీ, ఇండోర్‌, ఘజియాబాద్‌లలో పోస్టింగ్ ఇస్తారు.

ఎంపిక పరీక్ష..

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించిన వారిలో షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సీబీటీ-ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాతపరీక్షలో మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్‌, కాంప్రెహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరిక్స్‌, డేటా ఇంటర్‌ ప్రెటేషన్‌, జీకేలలో సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. టెక్నికల్ ప్రొఫెషనల్‌ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు.

డిసెంబర్‌లో వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 12 నుంచి 12.5లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తారు.

పరీక్ష ఫీజు...

బెల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర క్యాటగిరీల అభ్యర్థులు జిఎస్టీతో కలిపి రూ.472 పరీక్ష ఫీజు చెల్లించాలి.

పరీక్ష ఫీజులను ఈ లింకు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=14842 

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు రాత పరీక్షల్లో 35శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి.

దరఖాస్తుదారులు మెయిల్‌ ఐడి, ఫోన్‌ నంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు చేసిన తర్వాత వాటిని మార్చడానికి అనుమతించరు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల హార్డ్‌ కాపీలను పోస్టులో పంపాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసే ముందు విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయోపరిమితి, ఇతర నియమ నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

Whats_app_banner