Andhra Pradesh News Live November 24, 2024: Srisailam Devotees Rush : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు, 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్-రంగంలోకి పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 24 Nov 202403:55 PM IST
Srisailam Devotees Rush : శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, రేపు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Sun, 24 Nov 202403:01 PM IST
Eluru Crime : ఏలూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది.
Sun, 24 Nov 202401:19 PM IST
AP Constable Recruitment : హోంగార్డులకు కానిస్టేబుల్ ఉద్యోగాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టం ఇచ్చింది. ప్రాథమిక పరీక్షల్లో కనీస మార్కులు రావాల్సిందేనని పోలీస్ నియామక బోర్డు హైకోర్టుకు స్పష్టం చేసింది. కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ అనర్హులుగా ప్రకటించారని హోంగార్డులు పిటిషన్లు దాఖలుచేశారు.
Sun, 24 Nov 202412:56 PM IST
Tiruchanoor Brahmotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Sun, 24 Nov 202412:25 PM IST
- Jagan vs Lokesh : ఏపీలో ట్వీట్ ఫైట్ నడుస్తోంది. విద్యా వ్యవస్థ గురించి ప్రభుత్వానికి జగన్ ప్రశ్నలు సంధించగా.. తాజాగా మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులకు రూ.6,500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. ఆఖరికి విద్యార్థులను కూడా మోసం చేశారని ఆరోపించారు.
Sun, 24 Nov 202411:43 AM IST
Duvvada Divvela Vs Janasena : టెక్కలిలో సోషల్ మీడియా వార్ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా దివ్వెల మాధురి జనసేన నేతలపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Sun, 24 Nov 202410:28 AM IST
AP Transco Posts : ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ పరిధిలో 5 కార్పొరేట్ లాయర్ పోస్టుల భర్తీకి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు ఫారమ్ లను డిసెంబర్ 9వ తేదీ లోపు విజయవాడ విద్యుత్ సౌధకు పంపాలి.
Sun, 24 Nov 202408:59 AM IST
Weeding Invitation Scam : సైబర్ నేరగాళ్లు మరో సరికొత్త స్కామ్ కు తెరలేపారు. వాట్సాప్ లో పెళ్లి ఆహ్వానాల లింక్ లు పంపిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు చోరీ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ పోలీసులు సూచిస్తున్నారు.
Sun, 24 Nov 202408:41 AM IST
- AP Ration Cards : రేషన్ కార్డులేని వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ కోసం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు వరకు దరఖాస్తు స్వీకరణ చేపట్టాలని నిర్ణయించింది. అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించనున్నారు.
Sun, 24 Nov 202407:39 AM IST
- కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు.
Sun, 24 Nov 202406:31 AM IST
- Amaravati : అమరావతి అభివృద్ధి కోసం చాలామంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అందుకు ప్రభుత్వం వారికి ప్లాట్లు కేటాయిస్తోంది. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కాకుండా సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Sun, 24 Nov 202406:18 AM IST
- EdCIL Counsellors: కేంద్ర ప్రభుత్వ ఎడ్‌సిల్ ఇండియాలో కౌన్సిలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని 26జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Sun, 24 Nov 202405:55 AM IST
- ప్రేమ పేరుతో ఏలూరు జిల్లాకు చెందిన ఓ బాలికపై అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో నమ్మించి రేప్ చేశాడు. ఆపై డబ్బుల కోసం వేధింపులు కొనసాగించాడు. విషయంలో వెలుగులోకి రావటంతో ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదైంది.
Sun, 24 Nov 202405:49 AM IST
- AP Container Hospital : ఉత్తరాంధ్రలోని మన్యం ఆవాసాల్లో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా గర్భిణులను డోలీల్లో మోసుకుంటూ కొండల నడుమ ఆసుపత్రులకు తరలించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ కష్టాల్లోంచి వారిని గట్టెక్కించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
Sun, 24 Nov 202403:50 AM IST
- BEL Jobs: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రకాల ఇంజీనిరింగ్ విభాగాల్లో గరిష్టంగా ఏడేళ్ల కాల వ్యవధితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వార్షిక వేతనం రూ.12.5లక్షల వరకు చెల్లిస్తారు.
Sun, 24 Nov 202403:32 AM IST
- విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి జరిగింది. ఈ ఘటన కాకినాడలో వెలుగు చూసింది. విద్యార్థినుల ఫిర్యాదుతో సదరు ఉపాధ్యాయుడిపై పొక్సో కేసు నమోదైంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు జిల్లా విద్యాధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Sun, 24 Nov 202402:41 AM IST
- TTD News : చెన్నైకి చెందిన భక్తుడు టీటీడీ రూ.2.02 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇందులో టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు.