Horror Movie: హారర్ యాక్షన్ జోనర్‌లో ఎర్రచీర.. దక్షిణాది భాషల్లో రిలీజ్.. 'తొలి తొలి ముద్దు' సాంగ్ విడుదల (వీడియో)-horror movie erracheera the beginning tholi tholi muddhu song released telugu horror action thriller erra cheera ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Movie: హారర్ యాక్షన్ జోనర్‌లో ఎర్రచీర.. దక్షిణాది భాషల్లో రిలీజ్.. 'తొలి తొలి ముద్దు' సాంగ్ విడుదల (వీడియో)

Horror Movie: హారర్ యాక్షన్ జోనర్‌లో ఎర్రచీర.. దక్షిణాది భాషల్లో రిలీజ్.. 'తొలి తొలి ముద్దు' సాంగ్ విడుదల (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Nov 24, 2024 08:20 AM IST

Erracheera The Beginning Tholi Tholi Muddhu Song Release: హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ జోనర్‌లో తెరకెక్కిన తెలుగు మూవీ ఎర్రచీర ది బిగినింగ్. నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన ఎర్రచీర సినిమా నుంచి ఇటీవల తొలి తొలి ముద్దు సాంగ్‌ను రిలీజ్ చేశారు.

హారర్ యాక్షన్ జోనర్‌లో ఎర్రచీర.. దక్షిణాది భాషల్లో రిలీజ్.. 'తొలి తొలి ముద్దు' సాంగ్ విడుదల
హారర్ యాక్షన్ జోనర్‌లో ఎర్రచీర.. దక్షిణాది భాషల్లో రిలీజ్.. 'తొలి తొలి ముద్దు' సాంగ్ విడుదల

Erracheera The Beginning Song Launch: హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు సినిమా "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ మూవీలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్రలో నటిస్తోంది.

దక్షిణాది భాషల్లో

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "ఎర్రచీర - ది బిగినింగ్" సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఎర్రచీర ది బిగినింగ్ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ వంటి దక్షిణాది భాషల్లో డిసెంబర్ 20న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఎర్రచీర ది బిగినింగ్ సినిమా నుంచి రొమాంటిక్‌గా చిత్రీకరించిన 'తొలి తొలి ముద్దు' సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా 'తొలి తొలి ముద్దు' సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెస్ట్‌గా వచ్చిన డైరెక్టర్ వీరశంకర్‌తోపాటు ఎర్రచీర డైరెక్టర్, నటుడు, ఇతర టెక్నిషియన్స్ పలు విశేషాలు పంచుకున్నారు.

మంచి రొమాంటిక్ సాంగ్

చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. "మా మూవీలోని తొలి తొలి ముద్దు సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన వీరశంకర్ గారికి థ్యాంక్స్. ఎర్రచీర ది బిగినింగ్ సినిమా హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్‌తో ఉంటుంది. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ రూపొందించాలని అనుకున్నాం. భార్యా భర్తల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది" అని అన్నారు.

"ముద్దు అనే పదంతో పాట ఉండాలని అనుకున్నాం. మా ఆలోచనకు తగినట్లే జయసూర్య మంచి లిరిక్స్ ఇచ్చారు. అలాగే ప్రమోద్ ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. ఈ పాటలో సెట్ వర్క్ ఆకర్షణగా నిలుస్తుంది. 3 రోజులు ఈ పాట చిత్రీకరించాం. మేము అనుకున్నట్లే బాగా వచ్చింది. మా ఎర్రచీర సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నాం" అని సుమన్ బాబు చెప్పారు. ట

బహుమతిగా లక్ష రూపాయలు

"డిసెంబ్ 15వ తేదిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాం. తొలి తొలి ముద్దు సాంగ్ రీల్స్, షార్ట్స్ చేసి మాకు పంపిస్తే ది బెస్ట్ అనిపించిన వాటికి ఫస్ట్ ప్రైజ్ కింద లక్ష రూపాయలు, సెకండ్ ప్రైజ్‌గా యాభై వేలు, థర్డ్ ప్రైజ్‌గా పాతిక వేలు బహుమతిగా అందిస్తాం" అని డైరెక్టర్ సుమన్ బాబు ఆఫర్ ప్రకటించారు.

అతిథిగా వచ్చిన దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ.. "ఎర్రచీర సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు సుమన్ బాబు తన శక్తిమేరకు కృషి చేస్తున్నారు. సినిమా మీద ప్యాషన్ ఉన్న ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి. మనమంతా వీరికి సపోర్ట్ చేయాలి" అని అన్నారు.

ట్రెండింగ్‌లో ఎర్రచీర

"రెండేళ్లుగా ఈ సినిమా కోసం సుమన్ బాబు కష్టపడుతున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఎర్రచీర ట్రెండ్ అవుతోంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్, హారర్.. ఇవన్నీ ఒక కథలో కలిపి చేయడం అరుదైన ప్రయత్నం. ఇది ఇంతే ఫ్రెష్‌గా డిసెంబర్ 20న థియేటర్స్‌లోకి రావాలి. ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నా" అని వీరశంకర్ తెలిపారు.

"సుమన్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ప్రమోద్.. ముద్దు పదం హైలైట్ చేస్తూ రొమాంటిక్ సాంగ్ చేయాలని నన్ను అడిగారు. మేమంతా పాట ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుని రూపకల్పన చేశాం. హీరో హీరోయిన్స్ పాటలో బాగా పర్‌ఫార్మ్ చేశారు. ఈ సాంగ్ మూవీకి ఒక హైలైట్‌గా నిలుస్తుంది" అని సంగీత దర్శకుడు ప్రమోద్ చెప్పారు.

ఇలా ఉండాలని

"తొలి తొలి ముద్దు పాట కాన్సెప్ట్ సుమన్ గారు ఇచ్చిందే. ఆయన ఇలా ఉండాలి పాట అని సజెషన్ ఇచ్చారు. ప్రమోద్ కంపోజిషన్, లిరిక్స్ బాగా కుదిరాయి. అంజనా సౌమ్య, హేమచంద్ర అంతే బాగా పాడారు. ఎర్రచీర ది బిగినింగ్ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేర్చేందుకు సుమన్ బాబు గారు చేస్తున్న కృషికి అభినందనలు" అని లిరిక్ రైటర్ జయసూర్య తెలిపారు.

"తొలి తొలి ముద్దు పాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా మూవీలో ఈ సాంగ్ ఆకర్షణగా నిలుస్తుంది. ప్రమోద్ గారు పాటను బాగా కంపోజ్ చేశారు. ఎర్రచీర ది బిగినింగ్ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. డిసెంబర్ 20న మా ఎర్రచీర ది బిగినింగ్ సినిమాను మీరంతా థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని హీరోయిన్ కారుణ్య చౌదరి పేర్కొన్నారు.

Whats_app_banner