Same To Same: అచ్చం ఒకేలా ఉండే తెలుగు స్టార్ హీరోలు, హీరోయిన్స్- ఎన్టీఆర్, రామ్ చరణ్, సమంత, రష్మిక ఎవరిలా కనిపిస్తారంటే?-tollywood heroes heroines look like other actors like ram charan yash jr ntr rishab shetty samantha samyuktha menon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Same To Same: అచ్చం ఒకేలా ఉండే తెలుగు స్టార్ హీరోలు, హీరోయిన్స్- ఎన్టీఆర్, రామ్ చరణ్, సమంత, రష్మిక ఎవరిలా కనిపిస్తారంటే?

Same To Same: అచ్చం ఒకేలా ఉండే తెలుగు స్టార్ హీరోలు, హీరోయిన్స్- ఎన్టీఆర్, రామ్ చరణ్, సమంత, రష్మిక ఎవరిలా కనిపిస్తారంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 24, 2024 09:00 AM IST

Same To Same Tollywood Heroes Heroines: టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నాని, రామ్ చరణ్‌తోపాటు హీరోయిన్స్ సమంత, రష్మిక మందన్నా వర్ష బొల్లమ్మ వంటి హీరోయిన్స్ సేమ్ ఇతర యాక్టర్స్‌లా ఉంటారు. వారిని చూసినప్పుడు అచ్చం చెర్రీ, తారక్, నానిని చూసినట్లుగానే అనిపిస్తుంటుంది. మరి ఆ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.

అచ్చం ఒకేలా ఉండే తెలుగు స్టార్ హీరోలు, హీరోయిన్స్- ఎన్టీఆర్, రామ్ చరణ్, సమంత, రష్మిక ఎవరిలా కనిపిస్తారంటే?
అచ్చం ఒకేలా ఉండే తెలుగు స్టార్ హీరోలు, హీరోయిన్స్- ఎన్టీఆర్, రామ్ చరణ్, సమంత, రష్మిక ఎవరిలా కనిపిస్తారంటే?

Tollywood Heroes Heroines: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. తమ పోలికలతో ఇతరులు కనిపించినా, ఒకరిలా మరొకరు ఉన్న విచిత్రంగా అనిపిస్తుంటుంది. అలాంటిది సినిమా హీరోల్లా మరో హీరోలు కనపిస్తే భలే అనిపిస్తుంది. అది చూసి ఫ్యాన్స్, ఆడియెన్స్ షాకింగ్‌గా కూడా ఫీల్ అవుతుంటారు. మరి తెలుగు హీరోలు, హీరోయిన్స్‌లా కనిపించే ఇతర ఇండస్ట్రీ హీరోహీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.

నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని కొంచెం తమిళ హీరో శివ కార్తికేయన్‌లా కనిపిస్తాడు. ఇద్దరిని పక్కపక్కను చూస్తే సిమిలర్ పోలికలు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో తన ముక్కు నానిలా ఉంటుందని, చూడటానికి నానిలా ఉంటానని శివ కార్తికేయన్ చెప్పాడు. అలాగే, శివ కార్తికేయన్‌తో మల్టీ స్టారర్ మూవీ చేయాలని ఉందని నాని చెప్పాడు.

రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కేజీఎఫ్ హీరో యశ్‌లాగా కనిపిస్తాడు. ముఖ్యంగా రామ్ చరణ్, యశ్ వీరిద్దరు గడ్డంలో ఉన్నప్పుడు ఒకేలా ఉంటారు. మొదట్లో కేజీఎఫ్ సినిమా వచ్చినప్పుడు యశ్‌ను చూసి తెలుగు ప్రేక్షకులు రామ్ చరణ్‌లానే ఉన్నాడే అని ఫీల్ అయ్యారు.

శర్వానంద్

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ కాస్తా అటు ఇటుగా టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మలా ఉంటాడు. ఇద్దరి పర్సనాలిటీ దాదాపుగా ఒకేలా ఉంటుంది. సైడ్ యాంగిల్‌లో చూస్తే అలాగే కనిపిస్తారు. అంతేకాకుండా రోహిత్ శర్మ మీద బయోపిక్ మూవీ తీస్తే అందులో శర్వానంద్ హీరోగా చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయింది.

జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అచ్చం కాంతారా ఫేమ్, కన్నడ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టిలానే కనిపిస్తాడు. వీరిద్దరి యాక్టింగ్ కూడా ఒకేలా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కాంతార క్లైమాక్స్ సీన్‌లో రిషబ్ శెట్టిని చూస్తే ఎన్టీఆర్‌లానే అనిపిస్తాడు. ఇక వీరిద్దరు రియల్ లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే.

నాగ శౌర్య-శ్రీ విష్ణు

టాలీవుడ్‌లో దాదాపుగా ఒకే సమయంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు నాగ శౌర్య, శ్రీవిష్ణు. ఇప్పుడంటే వీరిద్దరు వేరు వేరు అని, ఒకేలా ఉండరు అని చెబుతారు. కానీ, మొదట్లో నాగ శౌర్య, శ్రీవిష్ణు ఇద్దరు ఒక్కరే అని అనుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు.

సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పోలికలు విరూపాక్ష, సార్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంయుక్త మీనన్‌లో కనిపిస్తుంటాయి. కొన్ని ఫ్రేమ్స్‌లలో వీరిద్దరూ ఒకేలా కనిపిస్తారు. వీరిద్దరి ఫేస్ కట్, లిప్స్, ఐ జా దాదాపుగా ఒకేలా ఉంటుంది. సంయుక్త మీనన్ మాత్రమే కాకుండా బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి అషు రెడ్డి కూడా సమంతలా కనిపిస్తుంది. అషు రెడ్డి సేమ్ సమంతలా ఉందనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతోనే ఆమెకు సినీ అవకాశాలు వచ్చాయి.

వర్ష బొల్లమ్మ- నజ్రియా

ఊరు పేరు భైరవకోన సినిమాతో ఇటీవల హీరోయిన్‌గా అలరించిన ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ మలయాళ పాపులర్ హీరోయిన్ నజ్రియా నజీమ్‌లా ఉంటుంది. వీరిద్దరు అచ్చం ఒకేలా కనిపిస్తారు. వర్ష బొల్లమ్మను మొదట్లో చూసి అంతా నజ్రియానే అనుకున్నారు. అంతాల వీరి ఫేస్ కట్ మ్యాచ్ అవుతుంది. అంతేకాకుండా వర్ష బొల్లమ్మను జూనియర్ నజ్రియా అని పిలుస్తుంటారు.

రష్మిక మందన్నా

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది భాగ్యశ్రీ బోర్సే. ఈ ముద్దుగుమ్మ కొంచెం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాల కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమాలోని కొన్ని సీన్లలో భాగ్యశ్రీలో రష్మిక మందన్నా పోలికలు కనిపించాయి.

మరికొంతమంది

వీరే కాకుండా ఒకేలా కనిపించే హీరో హీరోయిన్స్ ఉన్నారు. నందితా శ్వేత-సింధూ మీనన్, హనీరోజ్-సీనియర్ హీరోయిన్ సుకన్య, ధనుష్ అండ్ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథ్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ అండ్ దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా దాదాపుగా ఒకేలా కనిపిస్తారు.

Whats_app_banner