Animal Success Party: గ్రాండ్‍గా యానిమల్ సక్సెస్ పార్టీ.. వైరల్ అవుతున్న వీడియోలు.. రష్మికకు ముద్దు పెట్టిన రణ్‍బీర్-animal success party ranbir kapoor sandeep reddy vanga rashmika madanna tripti and other bollywood stars attended ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Success Party: గ్రాండ్‍గా యానిమల్ సక్సెస్ పార్టీ.. వైరల్ అవుతున్న వీడియోలు.. రష్మికకు ముద్దు పెట్టిన రణ్‍బీర్

Animal Success Party: గ్రాండ్‍గా యానిమల్ సక్సెస్ పార్టీ.. వైరల్ అవుతున్న వీడియోలు.. రష్మికకు ముద్దు పెట్టిన రణ్‍బీర్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 07, 2024 03:16 PM IST

Animal Success Party: యానిమల్ సినిమా సక్సెస్ పార్టీ అత్యంత గ్రాండ్‍గా జరిగింది. ఈ చిత్రంలో నటించిన వారితో పాటు చాలా మంది బాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఈ సెలెబ్రేషన్లలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సక్సెస్ పార్టీలో యానిమల్ టీమ్ (Photo: Twitter)
సక్సెస్ పార్టీలో యానిమల్ టీమ్ (Photo: Twitter)

Animal Success Party: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.890 కోట్ల కలెక్షన్లను దక్కించుకొని భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గత డిసెంబర్‌లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ కొట్టింది. ఈ తరుణంలో యానిమల్ సక్సెస్ పార్టీ.. ముంబైలో శనివారం (జనవరి 6) అత్యంత గ్రాండ్‍గా జరిగింది. ఈ సెలెబ్రేషన్లకు యానిమల్ మూవీ టీమ్‍తో పాటు బాలీవుడ్ స్టార్లు చాలా మంది హాజరయ్యారు.

రణ్‍బీర్ కపూర్, ఆలియా భట్, మహేశ్ భట్, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్, రితేశ్ దేశ్‍ముఖ్, ఆయుష్మాన్ ఖురానా, జెనీలియా, కార్తిక్ ఆర్యన్ సహా చాలా మంది బాలీవుడ్ నటీనటులు, టెక్నిషియన్లు యానిమల్ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. యానిమల్ టీమ్ గ్రాండ్‍గా సెలెబ్రేట్ చేసుకుంది.

యానిమల్ సినిమాలో నటించిన రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా సహా మరికొందరు కెమెరాలకు గ్రూప్‍గా పోజులు ఇచ్చారు. సైలెన్స్ అంటూ నోటిపై వేలు వేసుకొని సిగ్నేచల్ మూవ్మెంట్ ఇచ్చారు. అయితే, యానిమల్ చిత్రాన్ని విమర్శించిన వారికి సమాధానంగానే ఇలా సెలెన్స్ అంటూ సెలెబ్రేషన్ సిగ్నేచర్ ఇచ్చారా అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రష్మికను కిస్ చేసిన రణ్‍బీర్

బ్లాక్‍ ఔట్‍ఫిట్‍లో హీరోయిన్ రష్మిక మందన్న.. యానిమల్ సక్సెస్ బ్యాష్‍కు వచ్చారు. రష్మికను హగ్ చేసుకొని.. కిస్ చేసి వెల్‍కమ్ చెప్పారు హీరో రణ్‍బీర్ కపూర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యానిమల్‍లో విలన్ పాత్ర చేసిన బాబీ డియోల్.. ఈ పార్టీకి షర్ట్ లేకుండా బ్లేజర్ మాత్రమే వేసుకొని వచ్చారు. రణ్‍బీర్ కపూర్ కూడా బ్లాక్‍ ఔట్‍ఫిట్‍లో మరింత హ్యాండ్‍సమ్‍గా కనిపించారు. అతడి భార్య, స్టార్ హీరోయిన్ ఆలియా భట్ బ్లూకలర్ డ్రెస్‍లో తళుక్కున మెరిశారు. యానిమల్‍ ద్వారా ఫుల్ పాపులర్ అయిన త్రిప్తి డిమ్రి.. కూడా బ్లాక్‍ కలర్ డ్రెస్‍లో అదిరిపోయారు. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా.. హాట్‍లుక్‍తో ఈ పార్టీలో మరో అట్రాక్షన్‍గా నిలిచారు.

యానిమల్ సినిమా గత డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచి భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. హింస, బోల్డ్ సీన్లు హద్దులు దాటేలా ఉన్నాయని విమర్శలు వచ్చినా.. యానిమల్ వసూళ్లపై ప్రభావం పడలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సత్తాచాటింది. రణ్‍బీర్ కపూర్ కెరీర్లో అతిపెద్ద హిట్‍గా యానిమల్ నిలిచింది.

కాగా, యానిమల్‍పై వచ్చిన విమర్శలపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా పలు ఇంటర్వ్యూల్లో స్పందించారు. సినిమాలో టేకింగ్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ సహా మరిన్ని క్రాఫ్ట్ లను చూడాలని, కొన్ని విషయాలను పట్టుకొని విమర్శించడం సరికాదని బదులిచ్చారు. యానిమల్‍కు సీక్సెల్‍గా యానిమల్ పార్క్ కూడా వస్తుందని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది.

టీ20 వరల్డ్ కప్ 2024