Allu Arjun: అల్లు అర్జున్‍కు గ్రాండ్ వెల్‍కమ్.. దద్దరిల్లిన విశాఖ విమానాశ్రయం: వీడియో-allu arjun gets grand welcome at visakhapatnam airport pushpa 2 the rule shooting will happen in the city ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Gets Grand Welcome At Visakhapatnam Airport Pushpa 2 The Rule Shooting Will Happen In The City

Allu Arjun: అల్లు అర్జున్‍కు గ్రాండ్ వెల్‍కమ్.. దద్దరిల్లిన విశాఖ విమానాశ్రయం: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 10, 2024 07:09 PM IST

Allu Arjun - Pushpa 2: Tue Rupe: స్టార్ హీరో అల్లు అర్జున్ విశాఖపట్టణం చేరుకున్నారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్స్ అరుపులతో వైజాగ్ విమానాశ్రయం దద్దరిల్లింది.

Allu Arjun: అల్లు అర్జున్‍కు గ్రాండ్ వెల్‍కమ్.. దద్దరిల్లిన విశాఖ విమానాశ్రయం
Allu Arjun: అల్లు అర్జున్‍కు గ్రాండ్ వెల్‍కమ్.. దద్దరిల్లిన విశాఖ విమానాశ్రయం

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు ఏ రేంజ్‍లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను అమితంగా ప్రేమించే అభిమానగణం మెండుగా ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’ చేస్తున్నారు అల్లు అర్జున్. 2021లో వచ్చి తెలుగుతో పాటు హిందీలోనూ భారీ హిట్ అయిన పుష్పకు సీక్వెల్‍గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 షూటింగ్ ఇంకా సాగుతోంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ నేడు (మార్చి 10) విశాఖపట్టణంలో అడుగుపెట్టారు.

దద్దరిల్లిన వెల్‍కమ్

పుష్ప 2 షూటింగ్ కోసం అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ సహా మూవీ టీమ్ సభ్యులు విశాఖపట్టణానికి నేడు చేరుకున్నారు. వైజాగ్ విమానాశ్రయం వద్ద అల్లు అర్జున్‍కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కేకలతో మోతెక్కించారు. ఈలలు, అరుపులతో తమ అభిమాన హీరోకు వెల్‍కమ్ చెప్పారు. దీంతో ఎయిర్ పోర్ట్ పరిసరాలు దద్దరిల్లిపోయాయి.

పూల వర్షం

అల్లు అర్జున్‍పై అభిమానులు పూల వర్షం కురిపించారు. కారులో ఎక్కాక సన్‍రూఫ్ ఓపెన్ చేసి నిలబడి అభిమానులకు అభివాదం చేశారు బన్నీ. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించారు. బన్నీ అన్న అంటూ కేకలతో మోత మోగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్‍కు అల్లు అర్జున్ చేరుకున్నారు.

విశాఖలో షూటింగ్

విశాఖపట్టణంలో రెండు రోజుల పాటు పుష్ప 2 మూవీ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఫిషింగ్ హార్బర్ పోర్టులో చిత్రీకరణ జరగనుంది. ఇందుకోసం పుష్ప టీమ్ విశాఖపట్టణానికి వచ్చింది.

పుష్ప 2: ది రూల్ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ గతంలోనే ప్రకటించింది. వాయిదా పడుతుందనే రూమర్లు వచ్చినా.. సమయానికి తీసుకొస్తామని ఇటీవల స్పష్టం చేసింది. అనుకున్న సమయానికి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ శరవేగంగా షూటింగ్ చేస్తోంది.

పుష్ప 2పై ఆకాశమంత అంచనాలు ఉండటంతో గ్రాండ్‍ స్కేల్‍లో, భారీ యాక్షన్ సీక్వెన్సులతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవలే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో పుష్ప ఫస్ట్ పార్ట్ సినిమా ప్రదర్శితమైంది. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫెస్టివల్ సందర్భంగా బెర్లిన్ వెళ్లారు బన్నీ. పుష్ప 3 కూడా ఉండే అవకాశం ఉందని ఆయన హింట్ కూడా ఇచ్చారు. గ్లోబల్ మీడియాకు కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు.

పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మంధాన హీరోయిన్‍గా ఉన్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ ఈ మూవీలో కీరోల్స్ చేస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

IPL_Entry_Point