Allu Arjun Pushpa 2: పుష్ప 2 అప్‍డేట్‍పై ప్రశ్న: అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..: వీడియో-pushpa 2 updates asked by reporters allu arjun reactions goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pushpa 2 Updates Asked By Reporters Allu Arjun Reactions Goes Viral

Allu Arjun Pushpa 2: పుష్ప 2 అప్‍డేట్‍పై ప్రశ్న: అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 21, 2024 03:41 PM IST

Pushpa 2: The Rule - Allu Arjun: పికాబు ప్రెజెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఈవెంట్‍కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. అయితే, ఈ సందర్భంగా పుష్ప 2 గురించి అప్‍డేట్ ఇవ్వాలని ఆయనను కొందరు ప్రశ్నించారు.

Allu Arjun Pushpa 2: పుష్ప 2 అప్‍డేట్‍పై ప్రశ్న: అల్లు అర్జున్ రియాక్షన్ వైరల్
Allu Arjun Pushpa 2: పుష్ప 2 అప్‍డేట్‍పై ప్రశ్న: అల్లు అర్జున్ రియాక్షన్ వైరల్

Pushpa 2: The Rule - Allu Arjun: ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు ఏ రేంజ్‍లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 2021లో పాన్ ఇండియా రేంజ్‍లో సంచలన విజయం సాధించిన పుష్పకు సీక్వెల్‍గా పుష్ప 2 ది రూల్ వస్తోంది. ఈ మూవీ అప్‍డేట్‍ల కోసం కూడా అందరూ నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో హీరో అల్లు అర్జున్ ఏ కార్యక్రమానికి హజరైనా పుష్ప 2 సినిమా గురించే ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన పికాబు ప్రెజెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఈవెంట్‍కు హాజరుకాగా.. ఇదే జరిగింది.

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి.. పికాబు పేరుతో ఓ ప్రీమియమ్ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. ఈ పికాబు సంస్థ శనివారం హైదరాబాద్‍లో పికాబు ప్రెజెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ నిర్వహించింది. తన భార్యకు సపోర్టుగా ఈ కార్నివాల్‍కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే, పుష్ప 2 సినిమా గురించి అప్‍డేట్ ఇవ్వాలని అక్కడి వారు అడిగారు.

తన భార్యకు సపోర్ట్ ఇచ్చేందుకే తాను ఈవెంట్‍కు వచ్చానని అల్లు అర్జున్ అన్నారు. పుష్ప 2 షూటింగ్ నుంచే ఇక్కడికి వచ్చానని చెప్పారు. దీంతో అప్‍డేట్ ఇవ్వాలని అక్కడి వారు అడిగారు. పుష్ప 2 గురించి అప్‍డేట్ ఇవ్వాలని అడగగానే.. గట్టిగా నవ్వుతూ చెప్పను అనేలా చేయి ఊపారు అల్లు అర్జున్. “ఇది సరైన ఈవెంట్ కాదు. తర్వాత.. తర్వాత” అని అల్లు అర్జున్ అన్నారు. పుష్ప 2 అప్‍డేట్ అనగానే ఐకాన్ స్టార్ గట్టిగా నవ్వుతూ స్పందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పుష్ప 2: ది రూల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అడవుల్లో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ మూవీలో ఉండనున్నాయని తెలుస్తోంది. పుష్ప సినిమా భారీ బ్లాక్‍బాస్టర్ అవటంతో ఈ సీక్వెల్‍ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, ఆలస్యమవుతుందని ఇటీవల పుకార్లు రాగా.. వాటిని కొట్టేసింది మూవీ టీమ్. ప్రకటించిన తేదీకే ఈ మూవీని రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.

పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, రావురమేశ్ కీరోల్స్ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పుష్ప 2: ది రూల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్ కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. థియేట్రికల్ రన్ తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో పుష్ప 2 స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం సుమారు రూ.100 కోట్లను నెట్‍ఫ్లిక్స్ వెచ్చించిందని తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం